Naga Chaitanya : నాగచైతన్య లైఫ్ లోకి సమంత స్థానంలో రాబోతోన్న అమ్మాయి ఎవరో కాదు.. నాగార్జున చుట్టాలే.!!

Naga Chaitanya :  నాగచైతన్య సమంత వీరిద్దరికీ సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది.. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఈ జంటకు ఫాలోవర్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు విడాకులు తర్వాత వీరికి సంబంధించిన ఏ వార్త అయినా మరింత వైరల్ అవుతుంది.. విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య ఏం చేసినా కూడా అభిమానులు మరింత ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. తాజాగా ఇప్పుడు నాగచైతన్యకు సంబంధించి మరో వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..! నాగచైతన్య కన్నా సమంత మీద ఎక్కువ రూమర్స్ స్ వినిపించాయి అయితే ప్రస్తుతం చైతు కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి చక్కర్లు కొడుతుంది..!

The girl who is going to replace Samantha in Naga Chaitanya's
The girl who is going to replace Samantha in Naga Chaitanya’s

సమంత ఎక్కువ కాలం ఒంటరిగా జీవించలేవు అంటూ సోషల్ మీడియాలో టీ షర్టు కనిపిస్తూ ఓ కొటేషన్ పెట్టింది.. దానిని బట్టి చూస్తే.. నాగచైతన్య నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది.. అయితే త్వరలో నాగచైతన్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట అని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కోడై కూస్తోంది.. నాగచైతన్య కు పెళ్లి చేయాలనీ నాగార్జున, అమల ఇద్దరు సంబంధాల వేటలో పడ్డారట.. వాళ్ల ఇద్దరికీ తెలిసిన రెండు ఫ్యామిలీల నుంచి నాగచైతన్యకు ఎవరైతే సెట్ అవుతారు అని ఇంట్రెస్టింగా నాగచైతన్య కి జోడిని వెతుకుతున్నారట..

అమల అయితే ఏకంగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి నాగచైతన్యకు ఒక అమ్మాయిని చూసిందట.. నాగార్జున కూడా నాగ చైతన్య కి రెండో పెళ్లి చేయాలని.. వాళ్ళ అమ్మ అన్నపూర్ణ గారి తరపున ఒక అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలని కోరుకుంటున్నట్టు సమాచారం. వాళ్ళు కూడా అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీకి చెందిన వాళ్లే అని.. వాళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యినట్టు సమాచారం.. అయితే నాగ చైతన్య మాత్రం నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని కరాకండిగా చెప్పేశాడట.. నా ఫోకస్ అంతా నా కెరియర్ పైన సినిమాలపైనే పెడతానని చెప్పాడట.. మరి నాగార్జున, అమల చూసిన రెండు సంబంధాలలో ఎప్పటికైనా నాగచైతన్య ఎవరో ఒకరిని చేసుకుంటారు అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. నిప్పు లేనిదే పొగ రాదు బాస్ అన్నట్టు ఈ వార్తలో కూడా నిజం ఉందనేది నేటిజన్ల వాదన..