Bigg Boss 6 Telugu : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకొని ఆ పాపులారిటీతో సినిమా ఆఫర్స్ అందుకొని తెలుగు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. చలాకీ చంటీ క్రేజ్ చూసి బిగ్ బిస్ యాజమాన్యం ఆయనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఏదో మూడీగా, బయటకు ఎప్పుడు వచ్చేస్తామా అన్నట్టుగా చంటి కనిపించారు. అయితే చివరి వారం నామినేషన్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫైమా, బాలాదిత్య, వాసంతి ఇనయ, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనాలు నామినేషన్స్‌లో ఉండగా.. వీళ్ల మధ్య ఓటింగ్ హోరా హోరీగా సాగగా, చివరకు చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యాడు.
చంటికి ఎంత బూస్టప్ ఇచ్చిన, నీకు తగ్గట్టు గేమ్ ఆడమని చెప్పిన కూడా అతను అలానే ఉండిపోవడంతో తప్పక ఎలిమినేట్ చేశారు. మూడు పువ్వులు.. ఆరు కాయలు చంటి ఎలిమినేషన్‌కి లీస్ట్ ఓటింగ్ ఒక కారణం అయితే .. రెండు పూర్ పెర్ఫామెన్స్ . టాప్ రేస్‌లో ఉన్న రేవంత్‌తో గొడవలు కూడా చంటి ఎలిమినేషన్ కారణం అయ్యాయనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక బయటకు వచ్చిన చంటి ప్రస్తుతం తన పనులతో బిజీ అయినట్టు తెలుస్తుంది. గతంలో కన్నా ఎక్కువగా పలు టీవీ షోస్, సినిమా ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో చంటి వారం తిరక్కుండానే బాగానే సంపాదించాడని చెప్పుకుంటున్నారు.
మరోవైపు చంటికి బిగ్ బాస్ తో 2 లక్షల ఒప్పందం అనేది చేసుకున్నాడు అని తెలుస్తుంది. ఈ లెక్కన ఈయన 5 వారలో లోపల ఉన్నారు కాబట్టి.. మొత్తం 10 లక్షలు అనేవి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చలాకి చంటి సంపాదించినట్టు కొందరు లెక్కలు వేశారు. తన కామెడీతో అందరిని నవ్వించే చలాకి చంటి జీవితంలో విషాదాలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేసి అందరి కంట కన్నీరు పెట్టించాడు. ఊహ తెలిశాక అమ్మ నా కళ్ల ముందే కాలిపోయింది., ఆ తర్వాత అన్నయ్య, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాం. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నా. నాకు ఆడకూతురు పుడితే మా అమ్మే పుట్టిందనుకొని చాలా సంతోషించాను అంటూ చంటి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు.