Tangedu Flowers : తంగేడు పూల ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! 

Tangedu Flowers :  సాధారణంగా పల్లెల్లో తంగేడు మొక్కలను చూస్తుంటాము.తంగేడు పూలు లేనిదే బతుకమ్మ పండుగ పూర్తవదు అంటే కూడా అతిశయోక్తి లేదు.ఈ చెట్టు వేరు నుండి పూల వరకు అన్ని భాగాలు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగపడేవే. అన్నింటి కన్నా తంగేడు పూలలో అధిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తంగేడు పువ్వులో శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు పుష్కళంగా లభిస్తాయి.దీని పూల రసంలో టెర్పెనాయిడ్లు, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు, కార్డియాక్ గ్లైకోసైడ్లు మరియు స్టెరాయిడ్లు అధికంగా ఉంటాయి. వీటితో అనేక ఆరోగ్య సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు.

మలబద్ధకంతో బాధపడేవారు,తంగేడు పూలను నీటిలో వేసి బాగా మరిగించి,తేనెతో కలిపి రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది.అధిక విరోచనాలతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల విరోచనాలకు విరుగుడుగా పనిచేస్తుంది.

If you know the benefits of Tangedu flowers, you will be shocked
If you know the benefits of Tangedu flowers, you will be shocked

మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా తంగేడు పూల కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి కలవారు 10,15 రెమ్మలు తంగడిపూలు తీసుకొని ఒక అర లీటరు నీటిలో వేసి,బాగా మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

ఏదైనా ప్రమాదవశాత్తు విరిగిన ఎముకలను సరిచేయడానికి దీని ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ఆకులను బాగా మెత్తగా నూరి, కోడిగుడ్డు సొనతో కలిపి కట్టు కట్టడం వల్ల విరిగిన ఎముకలు వారం లోపల అతుక్కుంటాయి.

వివాహమై చాలా రోజుల తర్వాత కూడా పిల్లలు కాక,సంతాన లేమితో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఒక ఐదారు తంగడిపూలు తీసుకొని నిదానంగా నములుతూ తినాలి. తర్వాత బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల మగవారిలో శుక్రకణ వృద్ధి జరుగుతుంది. అలాగే ఆడవారిలో అండం ఉత్పత్తి పెరిగి తొందరగా పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కొంతమంది స్త్రీలు రుతుక్రమ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల కలిగే చర్మ సమస్యలను తొలగించుకోవడానికి, ఎండిన తంగేడు పూలను పొడిగా చేసుకుని అందులో చందనం కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, అవాంచిత రోమాలను ఈజీగా తొలగించుకోవచ్చు. తంగేడు ఆకుల పొడిని శీకాకాయతో కలిపి జుట్టు కుదుళ్లకు రాయడం వల్ల, జుట్టు ఒత్తుగా,అందంగా పెరుగుతుంది.