Health Tips : వేప అనేది మానవ శరీరానికి ఎంత మంచిదో తెలుసుకోండి .. మిస్ అవ్వకండి !

Health Tips : వేప చెట్టు.. మత విశ్వాసాల ప్రకారం ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వేప చెట్టు మనకు ఆకులు , పువ్వులు, కాండం, వేర్లు, విత్తనాలు, పండ్లు ఇలా ప్రతి ఒక్కటీ అందించడమే కాకుండా వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వేప చెట్టు ద్వారా లభించే ప్రతీది కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. వేప చెట్టులో సకల దేవతలు నివసిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద ప్రపంచంలో వేప ఒక ప్రసిద్ధ ఔషధ మౌలిక.. దాదాపుగా 5000 సంవత్సరాల క్రితం నాటి సాంప్రదాయ చికిత్సలో భాగంగా వేప మొక్కను ఎక్కువగా ఉపయోగించేవారు.

130 కంటే ఎక్కువ జీవ సంబంధ క్రియాశీల సమ్మేళనాలకు వేప మొక్క నిలయం . ఇక ఇది శక్తివంతమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండడంతో పాటు సమర్థవంతమైన యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గా కూడా పనిచేస్తుంది. చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఈ వేప చెట్టు యొక్క ఆకులు రక్తాన్ని శుద్ధి చేయడంలో అలాగే శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన విషాన్ని కూడా తొలగించడానికి వేప సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక కీటకాల కాటు మరియు అల్సర్లకు చికిత్స చేయడంలో కూడా వేపకు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. వేపలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వల్ల అంటూ వ్యాధులు, కాలిన గాయాలు ఇలా ఎటువంటి చర్మ సమస్యలనైనా దూరం చేసుకోవచ్చు.

Health Tips on neem tree Leaves 
Health Tips on neem tree Leaves

వేప ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. మనలో రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అలాగే వేగంగా నయం కావడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా వేప కొమ్మలను ప్రజలు టూత్ బ్రష్ గా ఉపయోగిస్తున్నారు. ఇక ఇది సూక్ష్మ క్రిములతో పోరాడుతుంది. అలాగే లాలాజలంలో ఆల్కలైన్ స్థాయిలను నిర్వహిస్తుంది. ఇక బ్యాక్టీరియా కి దూరంగా ఉంచుతుంది. అలాగే చిగుళ్ల వాపు, దంతాల పటిష్టతకు సహాయపడుతుంది. తెల్లని దంతాలను కూడా అందిస్తుంది. కంటి సమస్యలను దూరం చేయడానికి సహాయపడే వేపాకులు మొటిమలను నివారించడానికి అలాగే జుట్టు రాలడాన్ని.. చుండ్రు తగ్గిపోవడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు చెవి సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి.