Intinti Gruhalakshmi 11 oct Episode : అనసూయమ్మ, సామ్రాట్, తులసి ఫైట్.. నందు, లాస్య గూబ గుయ్యిమనెలా రియాక్షన్..!

Intinti Gruhalakshmi 11 oct Episode :  దసరా సంబరాలలో భాగంగా హస్బెండ్ స్లిప్ తీసిలో ఏముందో వైఫ్ చెప్పాలి.. ఇప్పుడు అందులో భాగంగా అనసూయమ్మ పరంధామయ్య వస్తారు వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా స్లిప్లో ఏముందో చెప్పలేరు.. ఇక ప్రేమజంట, క్యూట్ కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ్ శృతి రంగంలోకి దిగుతారు.. ప్రేమ స్లిప్లో ఏముందో చూసి శృతికి అర్థం అయ్యేలా చెప్తాడు.. ఒకే ఒక్క మాటతో మనసంతా నువ్వే అంటూ ఆ స్లిప్లో ఉన్న సినిమా పేరు చెప్పేస్తుంది శృతి.. ఇద్దరినీ విన్నర్స్ అంటూ అనౌన్స్ చేస్తారు…!

ఇక నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు హస్బెండ్ కళ్ళకు గంటలు కట్టుకొని ఉంటే తన చేతిలో ఉన్న బాలు కరెక్ట్ గా ఆ బౌల్లో వేయడానికి వైఫ్ డైరెక్షన్స్ ఇవ్వాలి ముందు శృతి పాటిస్పేట్ చేస్తారు ఇద్దరు వెయ్యలేక పోతారు ఆ తర్వాత నేనొక దాన్ని ఉన్నాను అంటూ లాస్య లభిస్తుంది మనకెందుకు ఈ ఆటలు అని నందు అంటాడు రమ్మని లాక్కొచ్చి అక్కడ నుంచో పెడుతుంది నందు వేయలేకపోతాడు.. ఎప్పటిలాగే లాస్య నందు కి చివాట్లు పెడుతుంది.. ఆ తర్వాత ఇంకెవరైనా పార్టిసిపేట్ చేస్తారా అంటే తులసి ఆభిని ట్రై చేయమని చెబుతుంది.. అంకిత డైరెక్షన్స్ విని నువ్వు చెయ్యి కచ్చితంగా గెలుస్తావని తులసి అంటుంది. తులసి అన్నట్టుగానే అభి అంకిత చెప్పినట్టు పర్ఫెక్ట్ గా బాల్ వేస్తాడు.. అభి మనం గెలిచామంటూ అంకిత అభినీ హత్తుకుంటుంది.. చూసావా అభి నువ్వు గెలుస్తావని నాకు తెలుసు.. అంకిత మాట వింటే నువ్వు జీవితంలో గెలుస్తావని అందరూ ముందు మరొకసారి ప్రూవ్ చేసావు. అంకిత చెప్పినట్టు నడుచుకోమని తులసి అంటుంది..

Intinti Gruhalakshmi 11 oct today full Episode
Intinti Gruhalakshmi 11 oct today full Episode

హనీకి ఏమైపోయిందో ఎలా ఉందో అంటూ.. సామ్రాట్ గబగబా ఫంక్షన్ హాల్ లోకి వస్తాడు. తీరా చూస్తే హనీ ఆడుకుంటుంది.. ఏమైందమ్మా హనీ ఇప్పుడు ఎలా ఉంది అని సామ్రాట్ అడుగుతాడు.. మీ అందరికీ ఎన్నిసార్లు ఫోన్ చేశాను.. హనీకి కడుపులో నొప్పి అని నాకు ఫోన్ చేసింది.. తన పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందామని మీకు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు.. నాకు ఎంత టెన్షన్ వచ్చిందో మీకేం తెలుసు అని సామ్రాట్ అంటాడు.. అసలు హనీకే కడుపులో నొప్పి సంగతి నాకు చెప్పలేదు సామ్రాట్ గారు అని తులసి అంటుంది. అయ్యో నాన్న నేను చెప్పేది ఒకసారి విను. నాకు నిజంగా కడుపులో నొప్పి లేదు.. ఇంట్లో నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉన్నావని.. మేమందరం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావ్.. నువ్వు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని.. నిన్ను ఇక్కడికి రమ్మని పిలవడానికి కడుపు నొప్పి అని అబద్ధం చెప్పాను నాన్న నన్ను క్షమించు అని హనీ అంటుంది..

ఏంటి అబద్ధం చెప్పావా నేను ఎంత కంగారుగా ఇక్కడికి వచ్చానో తెలుసా అని నీకు అని సామ్రాట్ హనీ పై అరుస్తాడు.. అయిందేదో అయిపోయింది కదా డాడీ నీ ఆఫీస్ వర్క్ అని పక్కన పెట్టి వచ్చావు కదా నాకోసం ఎంజాయ్ చేయమని హనీ అంటుంది. సామ్రాట్ గారు రండి అని తులసి పిలుస్తుంది. అంకుల్ రండి అని శ్రుతి అంకిత పిలుస్తారు. మీరు రాకపోతే మేము మీ ఇంటికి రాము అని దివ్య చెబుతుంది. రెండు గంటలకు కాదు అని దివ్య అంటుంది. సరే అని సామ్రాట్ మౌనంగా ఉండిపోతాడు. అమ్మ అని డాడీ చేయి పట్టుకొని లోపలికి తీసుకురాని తులసి అంటుంది. ఇక ఈ సంబరాలలో భాగంగా నెక్స్ట్ దాండియా ఆడుదాం.. చివరిదాకా ఎవరు ఉంటారో వాళ్ళే గెలుస్తారు అని అంతా అంటారు..

దాండియా అడి సామ్రాట్, తులసి గెలుస్తారు. ఆ దేవుడికి తులసిని హారతి ఇవ్వమని అడుగుతారు.. అక్కడ ఉన్నవాళ్లు తులసికి ఏ అర్హత ఉందని తులసి చేత ఆ అమ్మవారికి హారతి ఇప్పిస్తారు.. ఆడది అంటే అనుకోగా ఉండాలి విచ్చలవిడిగా తిరగకూడదు.. కట్టుబాట్లు మీద ఉండాలి ఊరు మీద పడి పోట్ల గిత్త లాగా తిరగకూడదు.. రేపటి ఎపిసోడ్లో సారీ తులసి గారు ఈ గొడవ అంతా జరగడానికి నేనే కారణం. నేను ఇక్కడకు రాకుండా ఉండాల్సింది అని సామ్రాట్ అంటాడు.. మా మనసుల్లో మా స్నేహం లో ఎలాంటి దురుద్దేశం లేదు.. ఉన్న కల్మషం అంత నీ మనసులో మీ ఆలోచనల్లో ఉంది అని సామ్రాట్ అంటాడు ఆడ, మగ మధ్య ఇలాంటి స్నేహాలు అమెరికా లాంటి దేశాలలో ఉంటాయేమో కానీ ఇక్కడ కాదు అని అనసూయమ్మ అంటుంది.. పెళ్లి తర్వాత ఆడదానికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు.. స్నేహితులుగా ఉండకూడదా.. విడాకుల తీసుకున్న ఆడదానికైనా కళంకం.. తీసుకున్న మగవాడికి ఎలాంటి కలంక ఉండదా అని తులసి నిలతీస్తుంది..