Custard Apple : పేరుకే సీతాఫలం.. ప్రయోజనాలెన్నో..!! 

Custard Apple : ప్రకృతిలో లభించే ప్రతి మొక్క.. ప్రతి పండులో కూడా ఎన్నో రకాల పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి వాటిలో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనాలను అందజేస్తుంది.. సాధారణంగా ఇంటి తోటల్లో కూడా ఈ చెట్టును పెంచుకోవచ్చు. చాలామందికి ఇలాంటి పండు ఒకటి ఉందనే విషయం కూడా తెలియదనే చెప్పాలి. అంతేకాదు మరి కొంతమందికి ఈ పండు రుచి పై అనుమానం కూడా ఉంటుంది.. కానీ ఈ సీతాఫలాన్ని ఒక్కసారి రుచి చూశారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత అద్భుతంగా, మధురంగా ఉంటుంది. ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లోనే కాకుండా కొండ ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలను పెంచవచ్చు. పండ్లు కొంచెం పెద్దవిగా ఉంటాయి.

ఇక సీతాఫలంలో ఉండే పోషకాల విషయానికి వస్తే విటమిన్ సి , విటమిన్ b6, కాల్షియం , ఐరన్ తో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఈ పండు రుచి జామపండు రుచిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సీతా జామ అని కూడా దీనిని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా వీటి ఖర్చు కూడా పెద్దగా ఉండదు . అతి తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలు తినడానికి అనువైన పండు.. ఇక సీతాఫలం ప్రయోజనాల విషయానికి వస్తే అల్సర్ వ్యాధితో బాధపడేవారు సీతఫలాన్ని తింటే త్వరగా కోలుకుంటారు. అదేవిధంగా ఎసిడిటీ , జీర్ణక్రియ సమస్యలు కూడా దూరం అవుతాయి. మన ఆహారాన్ని శక్తిగా మార్చగల సామర్థ్యం ఈ పండుకు ఉంది.

many benefits of custard apple
many benefits of custard apple

ఇక సీ తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, మెదడు చురుకుదనాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. నిజానికి ఈ పండులో సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల చర్మం మృదువుగా , కోమలంగా తయారవుతుంది. చిన్న పిల్లలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపడుతుంది. రక్తహీనత ఉన్నవారు, గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలు కూడా ఈ పండును తినవచ్చు. రక్తంలో చక్కర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. అయితే డయాబెటిస్ వారు వైద్యుల సలహా మేరకు ఈ పండును తీసుకోవాల్సి ఉంటుంది.