Iphone 14 Pro : ఈమధ్య కాలంలో చాలామంది ఐఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు.. కానీ వాటి ధరలు చూసి వెనుకడుగు వేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. కానీ యాపిల్ సంస్థ కూడా ఎక్కువగా తన ఐఫోన్ సిరీస్ లను విడుదల చేస్తూ కష్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో యాపిల్ కంపెనీ నుంచి విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ కూడా ఒకటి. ఇక ఈ ఫోన్ తో పాటు యాపిల్ కి సంబంధించిన పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు కూడా సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి విడుదల చేశారు. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ నుంచి నాలుగు మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇకపోతే చాలామంది ఫీచర్స్ అధికంగా ఉండే ఐఫోన్ 14 ప్రో మోడల్ కొనడానికి ఇష్టపడుతున్నారు.
నిజానికి ఈ ఐఫోన్ 14 ప్రో మోడల్ ధర ప్రస్తుతం రూ.1,39,900 ఉంది. అయితే ఐఫోన్ 14 ప్రో ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం అమెజాన్ మీకు అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఫెస్టివల్ సేల్ సందర్భంగా అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఇతర ప్రముఖ కంపెనీలకు చెందిన ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఐఫోన్ 14 ప్రో పై రూ.31,000 డిస్కౌంట్ పొందవచ్చు. 256 జిబి వేరియంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్ ధర మార్కెట్లో రూ.1,39,900 ఉండగా, రూ.23,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ను పొందాలనుకుంటే నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ ను పెంచుకోవాల్సి ఉంటుంది.
అమెజాన్ పే , ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కొనుగోలు చేస్తే చాలా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది . ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక నో కాస్ట్ ఇఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు ఇతర ఫోన్లను ఎక్స్చేంజ్ చేస్తే రూ.28 వేల వరకు తగ్గింపు ఉంటుంది. అప్పుడు ఈ ఫోన్ ని మీరు కేవలం రూ.1,07,650 కే సొంతం చేసుకోవచ్చు. 48MP + 12MP ప్రియర్ కెమెరాతోపాటు 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది.