Karthika Deepam 03 oct episode : నేటి కార్తికదీపం ఎపిసోడ్.. రేపు మోనితకి ఫ్యుజులు ఎరిగే ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. దీప ఖుషి..!

Karthika Deepam 03 oct episode : నువ్వు ఏ విషయం అయిన సరే నా దగ్గర నిర్మొహమాటంగా చెప్పొచ్చు డాక్టర్ బాబు.. దీప ఏంటో చెప్పండి అని అంటుంది.. అప్పుడే శివ కార్తీక్ దగ్గరకు వచ్చి నన్ను అడిగారట కదా సార్ అని అంటాడు శివా.. మౌనిత మేడం మిమ్మల్ని రెండు గంటల పాటు ఎక్కడికైనా తీసుకువెళ్లి తిప్పుకు రమ్మంది అని అంటాడు.. శివా అప్పుడే సార్ సార్ అంటూ ఒకరితో మాట్లాడతాడు..

ఆ దుర్గ సార్ నన్ను రెండు గంటలు ఎక్కడికైనా బయటకు వెళ్ళమన్నారు.. నాకు సినిమా టికెట్ కోసం 1500 డబ్బులు కూడా వేశాడు సార్.. సినిమా టికెట్ 300 సార్ కానీ.. నాకు మేత కోసం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు.. ఆ సార్ కి ఎవరిని ఎక్కడ పడేయాలో బాగా తెలుసు సార్ అని శివా అంటాడు.. సార్ నేను వెళ్తున్నాను సార్ కి టైం అవుతుంది అంటూ శివా వెళ్ళిపోతాడు.. మౌనిత గురించి కార్తిక్ ఆలోచనలలో పడతాడు.. తను అంతకుముందు కూడా ఇలాగే ఉంటుందా గతం మర్చిపోయి నేను ప్రశాంతంగా ఉన్నాను.. అసలు ఏం జరుగుతుంది అంటూ కార్తీక్ ఆలోచనలో పడతాడు..! దీప కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది..!

Karthika Deepam 03 oct episode : మోనిత కి దిమ్మతిరిగే షాక్..!

దుర్గ ప్రశాంతంగా బయట లాన్ లో పడుకుని పాటలు పడతాడు.. అప్పుడే మోనిత రాడ్ ఎత్తి దుర్గ ను చంపేయాలని అనుకుంటుంది.. ఏంటి బంగారం రాడ్ ఎద్దామని శివ వెనక్కి తిరిగి చూస్తాడు.. అబ్బే అదేం లేదు డోర్ కి అడ్డంగా ఉందని తీసి పక్కన పెడుతున్నాను అని మోనిత కవర్ చేసుకుంటుంది.. నాకు తెలుసు బంగారు నువ్వు నా గురించి ఇలాంటి ప్లాన్సే చేస్తున్నావని ఇప్పుడు గనక నన్ను ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసావనుకో కార్తీక్ సార్ అనుకుంటుంది.. నువ్వు నిజం చేసినట్లే అని అంటాడు. నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో మనిద్దరం ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుందామని దుర్గ అంటాడు.. కార్తీక్ ఎక్కడ అది బయటకు వెళ్ళమని చెప్పాను అని మోనిత అంటుంది..

Karthika Deepam  karthik twist to mounitha in tomorrow episode
Karthika Deepam karthik twist to mounitha in tomorrow episode

కార్తీక్ దీప దగ్గర దుర్గా మోనితల విషయం తలుచుకొని బాధపడతాడు.. ఎవరి గురించి దీపతో కార్తీక్ అంతగా బాధపడుతూ మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది.. మోనిత ను నన్ను ఇలా మోసం చేస్తుందని నేను ఊహించలేదు అని కార్తీక్ అంటాడు. ఈరోజు నాకు తెలిసిన విషయం రేపు కాలనీలో అందరికీ తెలిసిపోతుంది అని కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఈ మాటలను చాటుగా ఉంటున్న మౌనిక అర్థమైంది.. ఆ దీప దుర్గా ఇద్దరు కలిసి కార్తీక్ మనసులో నాపై అనుమానాన్ని క్రియేట్ చేశారు అని అనుకుంటుంది..

మోనిత రెండు గంటలు నన్ను బయటకు తీసుకు వెళ్ళమని ఎందుకు చెప్పింది.. సరే మోనిత నన్ను అప్పటిలాగే వెయిటింగ్ తీసుకువెళ్లమంది అని అనుకున్నాం.. మరి ఆ దుర్గా శివకు ఎందుకు డబ్బులు పంపించాడు అని కార్తీక్ అంటాడు.. ఆ విషయం తెలుసుకొని అరేయ్ దుర్గ నువ్వు నా చేతుల్లో చచ్ఛావు అని దుర్గ దగ్గరికి బయలుదేరుతుంది.. మీరు చెప్పేది నిజం అని అనిపిస్తుంది.. కానీ ఇది మన ఇద్దరి సమస్య కాస్త ఓర్చుకొండి అని అంటుంది.. మరోవైపు మోనిత దుర్గకు ఒక్క రోజులో పైకి పోయే ఇంజక్షన్ ఇస్తుంది.. హాయ్ ఇంజక్షన్ చేస్తుండగా కార్తీక్ దీప అక్కడికి వస్తారు ఇప్పుడు దాకా నేను చెప్పింది. నిజం కాదు అన్నావుగా ఇప్పుడు చూడు అని దీపతో కార్తీక్ అంటాడు. దుర్గ మీద చేతులు వేసిన మోనిత ను చూసి అడ్డంగా బుక్ అయిపోయాను అని మౌనిక మనసులో అనుకుంటుంది రెండు గంటలు ఆగి రమ్మన్నావు కదా.. మోనిత నేను మరో రెండు గంటలు ఆగి రానా అని కార్తీక్ అంటాడు.. కార్తీక్ ఇది నిజమాని నమ్ముతున్న కానీ ఇది నిజం కాదు అని మోనిత అంటుంది..

అప్పుడే దుర్గ నిద్రలోంచి లేచి ఏంటి మోనిత కార్తీక్ సార్ రెండు గంటలు వరకు రారు అని అన్నావు కదా అని సీన్ క్రియేట్ చేస్తాడు.. కార్తీక్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఇలా మీరిద్దరూ దొంగ నాటకాలు ఆడి కార్తీక్ ముందు నన్ను బ్యాడ్ గా క్రియేట్ చేయడం తప్పు కదా అని మోనిత అంటుంది.. దానికి వాళ్ళిద్దరూ పగలబడి నవ్వారు.. ఒకప్పుడు విహారి తో ఇలానే చేయించి నన్ను బాధ పెట్టవు కదా.. అంతకు అంత ఇస్తాను అని దీప అంటుంది.. నువ్వైనా ఆయన్ని వదిలేయాలి.. లేదంటే కార్తీక్ నిన్ను వదిలేయాలి అని అంటుంది.. మోనిత లొపలికి వెళ్ళగానే.. ఈ రోజుకి ఈ డోస్ చాలు దిపమ్మ అని దుర్గ అంటాడు..

రేపటి ఎపిసోడ్ లో మోనిత ఈ దుర్గ కార్తీక్ దగ్గర నాపై అనుమానం క్రియేట్ అయ్యేలా చేశాడు.. ఇలా చేస్తే ఎవ్వరికైనా అనుమానం వస్తుంది కదా.. ఏం చేయాలి అని మోనిత ఆలోచనలో పడుతుంది.. ఏం చేయాలి అనుకుంటుంది.. మోనిత ఏడుస్తూ ఏ తప్పు చేయలేదు అని అంటుంది.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు లేని తండ్రిని కాదు అని కార్తీక్ గతం గుర్తుతెచ్చుకొని పెద్దగా అరుస్తాడు అది విన్న దీప సంతోషిస్తుంది మోనిత షాక్ అవుతుంది.