Hair Tips : డాక్టర్లు చెప్పే బెస్ట్ జుట్టు మంత్రం ఇదే .. ఇలా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతం !

Hair Tips : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రూ జుట్టును రాల‌కుండా కాపాడు కోవ‌డం కోసం చిన్న పాటి యుద్ధ‌మే చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జుట్టు ఒత్తుగా ఉండ‌డ‌మే కాకుండా. న‌ల్ల‌గా మెరిసి పోవాల‌ని క‌ల‌లు కంటుంటారు . మ‌రి కొంత మంది ఉన్న జుట్టునే కాపాడు కుందామ‌ని ప్ర‌య‌త్నిచి విఫ‌ల‌మ‌వుతారు. అలా ప్ర‌య‌త్నించే వారు వారికి తెలియ‌కుండానే అతి పెద్ద పొర‌పాటు చేస్తున్నారు. ముందుగా మీరు మీ ఆహార శైలిని మార్చాలి. మంచి ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటూ అందులో విట‌మిన్లు, న్యూట్రియ‌న్స్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

వీటితో పాటు మంచి జీవ‌న‌శైలిని కూడా పాటించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇవేవి తెలియ‌కుండా మార్కెట్‌లో దొరికే ర‌క ర‌కాల షాంపూలు, ర‌సాయ‌నాలు లాంటివి వాడుతుంటారు. ముందుగా మీ స‌మ‌స్య గుర్తించాలి. జుట్టు ఎక్కువ‌గా రాలుతుందా ?మీకు జుట్టు ఎక్కువ‌గా రాలుతున్న‌ట్ల‌యితే మీరు. జుట్టుపై కొద్దిగా శ్ర‌ద్ధ తీసుకుంటూ నిత్యం మ‌నం తీసుకునే ఆహారంలో కోడిగుడ్లు, వాల్‌న‌ట్స్, ఆల్‌మండ్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను కూడా తీసుకోవాలి. వాల్‌న‌ట్స్‌, ఆల్‌మండ్ కొద్దిగా ఖ‌రీదైన‌వే కానీ జుట్టు ఊడిపోతుంద‌ని ర‌క ర‌కాల నూనెలు , షాంపూలు వాడ‌డం కంటే ఆహారం పై డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌డం ఉత్త‌మం. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

Hair Tips on curry leaves and Amla seeds
Hair Tips on curry leaves and Amla seeds

జుట్టు పెర‌గ‌డానికి ? మీరు తీసుకునే ఆహారంలో నిత్యం క‌చ్చితంగా క‌రివేపాకును తీసుకోవాలి. మ‌న‌లో చాలా మంది క‌రివేపాకు రాగానే తీసి ప‌క్క‌న ప‌డేస్తుంటాం. ఇక‌పై అలా చేయ‌కండి. కుదిరితే ఒకే సారి క‌రివేపాకును తీసుకుని పొడిలా చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవాలి. కుదిరిన‌ప్పుడ‌ల్లా అన్నంలో కాని, టిఫిన్స్‌లోకి తినొచ్చు. దీంతో పాటు ఉసిరి కాయ‌లు, మెంతులు ఆహారంలో బాగంగా చేర్చుకోవాలి. తెల్ల వెంట్రుక‌లు స‌మ‌స్య ఉంటే విట‌మిన్ బి, విట‌మిన్ బి12, అశ్వ‌గంధ తో పాటు స‌రైన స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకుంటూ క‌నీసం 7 గంట‌లు నిద్ర‌పోవాలి. ఇవి పాటిస్తే స‌హ‌జంగా నే మీజుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.