Categories: News

Koratala Siva-NTR : కొరటాలకి ఎన్టీఆర్ చివరి వార్నింగ్.. మాట వినకపోతే ఇక తారక్ తీసుకునే నిర్ణయం అదే?

Koratala Siva-NTR : ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమాను తెరకెక్కిస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్న #ఎన్టీఆర్30 చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో మాత్రం తెలియడం లేదు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం ప్రస్తుతం ఫిలింనగర్ లో బాగా హల్చల్ చేస్తోంది.. ఒకరకంగా చెప్పాలంటే అభిమానులకే కాదు ఎన్టీఆర్ కి కూడా సహనానికి పరీక్షాకాలం లాంటిది . హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు సినిమాలు చేస్తూ సెట్ మీదకు దూసుకుపోతుంటే.. మరోపక్క తన స్నేహితుడు తోటి హీరో రామ్ చరణ్ కూడా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

NTR’s last serious words to Koratala siva

కానీ ఎన్టీఆర్ మాత్రం గత ఏడు నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఇప్పటివరకు ఆయన కొత్త సినిమా ప్రారంభం అవ్వలేదు. అయితే ఎందుకు ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు అన్న విషయంపై సస్పెన్షన్ ఏమాత్రం వీడలేదు. కొరటాల శివతో ఎన్టీఆర్ ఇప్పుడు ఒక సినిమా చేయాల్సి ఉంది. ఒక బలమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కానీ కొరటాల శివ చివరి చిత్రం ఆచార్య డిజాస్టర్ తో ఎన్టీఆర్ తో చేయాల్సిన ఈ సినిమాపై ప్రభావం పడింది. నిర్లక్ష్యం చేయకుండా అన్ని రకాలుగా స్క్రిప్ట్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోని ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా పూర్తవలేదట. గత ఆరు నెలలుగా కొరటాల శివ కూడా ఇదే ఫైనల్ టచ్ పై కూర్చున్నట్లు సమాచారం. అయినప్పటికీ కూడా తారక్ కి నచ్చిన విధంగా స్క్రిప్ట్ రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతామని అన్నారు.. కానీ జరగలేదు . ఆ తర్వాత సెప్టెంబర్ ముహూర్తం అన్నారు. అది కూడా జరగలేదు. దసరాకి ముహూర్తం ఫిక్స్ చేస్తే.. దసరా కూడా అయిపోయింది. ఇప్పుడు దీపావళి వస్తోంది. అయినా ఇప్పటికీ కూడా ఈ సినిమా అప్డేట్ వదలడం లేదు. అందుకే ఈ విషయంపై కొరటాల శివ పై అటు ఎన్టీఆర్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.. ఇక ఈ క్రమంలోనే ఎట్టకేలకు తన సహనాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. మౌనాన్ని వీడి.. కొరటాలకు తేల్చి చెప్పారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు అక్టోబర్ లోపు స్క్రిప్ట్ పూర్తి చేసి నవంబర్లో సెట్ పైకి సినిమాను తీసుకెళ్లాలని కండిషన్ కూడా పెట్టారట.

అంతేకాదు ఎట్టకేలకు నవంబర్ చివరి కల్లా సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వాలని వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఒకవేళ అనుకున్న సమయానికి షూటింగ్ మొదలు పెట్టకపోతే.. ఇక ఎన్టీఆర్ ఆలస్యం చేయకుండా బుచ్చిబాబు సనా తో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ విషయంలో బిజీగా ఉన్న నేపథ్యంలో బుచ్చిబాబు సనా తో తన తదుపరిచిత్రం పట్టాలెక్కించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Recent Posts

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

2 weeks ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

2 weeks ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

4 months ago

Joint Pains: నడుం నొప్పి, ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తించే దివ్య ఔషధం..!!

Joint Pains: సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనిషి చాలా…

5 months ago

Cyber Crime : సైబర్ మోసాలు , లోన్ apps వేధింపులకి గురి అవుతున్న వాళ్లకి best solution ఇదే

Cyber Crime : గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే సంస్థ సైబర్ ఫ్రాడ్ లని చేధిస్తూ అనేకమంది సామాన్యులని సైబర్…

5 months ago

This website uses cookies.