Dettadi Harika : దేత్తడి హారిక బిగ్ బాస్ షోతో ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాని వాడుకుంటూ వినూత్నమైన వీడియోలు చేస్తూ పాపులారిటీ దక్కించుకుంది హారిక. బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత హారిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు పలు ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిన హారిక బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు అభిజీత్‌తో ప్రేమాయణం నడిపింది. చిన్న చిన్న దుస్తులు ధరించి అభిజీత్‌తో తెగ రచ్చ చేసింది. బయటకు వచ్చాక మాత్రం ఇద్దరు తమది ప్రేమ కాదని, కేవలం ఫ్రెండ్షిప్ అని సైలెంట్ బాంబ్ వేసారు.
అయితే ఆ తర్వాత కూడా వీరిద్దరు కలిసినట్టు ఎక్కడా కనిపించలేదు. ఎవరి పనులతో వారు బిజీగ ఉన్నారు. అయితే తాజగా దేత్తడి హారిక పెళ్లి గురించి ఓ వార్త హల్చల్ చేస్తుంది. అభిజీత్ కన్నా అందం, మంచి టాలెంట్ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబర్ ని హారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు దీనిపై దేత్తడి హారిక గాని వాళ్ళ అమ్మగారు స్పందించలేదు, కాని ఈ విషయం తెగ వైరల్ అవుతుంది. చూడాలి మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో.
హారికలో మంచి టాలెంట్ ఉంది. సమాజంలో జరిగే విషయాలను ఫన్నీగా చూపిస్తూ వీడియోలు క్రియేట్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. ‘దేత్తడి’ అనే ఛానెల్‌తో ఆమె క్రేజ్ అంతకంతకూ పెరిగిపోగా, ఈ వీడియోల వల్లే ఆమెకు దేత్తడి హారిక అనే పేరు వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీ పేరు సెన్సేషన్ అయిపోయింది. హారిక నెట్టింట నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. క్రేజీ కంటెంట్ తో పోస్టులను పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఘాటుగా కొన్ని క్రేజీ ఫొటోషూట్లు చేస్తోంది. కుర్రాళ్లపై గ్లామర్ వల విసురుతూ తన పాపులారిటీనీ పెంచుకుంటోంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.