Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో గురించి తేల్చి పారేసిన ఏపీ హై కోర్టు .. బెదిరిపోతోన్న నాగార్జున + మాటీవీ ?

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో ఐదు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. అయితే ఎన్నో అవాంత‌రాల న‌డుమ బిగ్ బాస్ షో న‌డుస్తుంది. ఈ షోకి చాలా మంది నుండి వ్య‌తిరేఖ‌త ఎదుర‌వుతుంది. ఈ షోపై ప‌లు పిటీష‌న్స్ దాఖ‌లు కాగా, మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూఈనెల 27కి విచారణను వాయిదా వేసింది. అయితే ఈ షోలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు ఒకటి రెండు ఎపిసోడ్స్ చూస్తామని కూడా కోర్ట్ తెలిపింది.

Bigg Boss 6 Telugu : ఏం జ‌రుగుతుంది..

నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వేసిన పిటీష‌న్ ప్ర‌కారం ఈ విచార‌ణ సాగింది. ఈ కార్యక్రమానికి సెన్సార్ కూడా చేయ‌డం లేద‌ని, షోలో పాల్గొనే మహిళలకు గర్భధారణ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిని రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలి, కానీ విరుద్దంగా రాత్రి 9 నుంచి ప్రసారం చేస్తున్నారని.. సెన్సార్‌ బోర్టు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ పిటీష‌న్ లో పేర్కొన్నారు. ఈ షో ప్రదర్శనను వెంటనే ఆపేయాలని కోరారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న‌ హైకోర్టు స్పందిస్తూ.. ” ఇటీవల నిర్వాహకులే ప్రచారం కోసం ఇలాంటి వివాదాలు సృష్టించుకుంటున్నారని.. అందులో భాగంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారా ? ” అని ప్రశ్నించింది కోర్టు

bigg-boss6-show-in-trouble

అయితే ఏపీ హైకోర్ట్ ఇందులో ఎంట‌ర్ కావ‌డంతో నాగార్జున‌, మాటీవీతో గుండెల్లో అల‌జ‌డి మొద‌లైంది. స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షోకి ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదురు కావ‌డం వ‌ల‌న ఏదైన ఇబ్బంది క‌లుగుతుందా అనే ఆలోచ‌న‌లో వారు ఉన్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో ప‌లు స‌మ‌స్య‌లు ఎదురైన కూడా నాగార్జున‌, మాటీవీ వాటిని ధీటుగా ఎదుర్కొని షోల మీద షోలు చేస్తుంది. మ‌రి ఈ సారి ఎదురైన ఈ స‌మ్య‌ల‌ను ఎలా ఎదుర్కొంటారా అనేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే నాగార్జున‌పై నారాయ‌ణ నిప్పులు చెరుగుతుండ‌గా, నాగ్ నారాయ‌ణ నారాయ‌ణ అంటూ అత‌నికి ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు విసురుతున్న విష‌యం తెలిసిందే.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.