Financial loss : ఆర్థిక నష్టం తొలగిపోయి.. సంపద పెరగాలంటే ఈ చెట్లను పూజించాల్సిందే..!!

Financial loss : అందమైన ప్రకృతిని ఆస్వాదించాలి అంటే రెండు కళ్ళూ సరిపోవు అని.. అలాంటి అందమైన ప్రకృతి మనకు ఎన్నో రకాల వృక్షాలను.. ఔషధ మొక్కలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వాటిని చాలామంది కాపాడుకోలేక ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా గురి అవుతున్నారు. ముఖ్యంగా చెట్లు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించడమే కాకుండా వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను మనుషులకు అందిస్తాయి . అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు..

ఖాళీ స్థలంలో చెట్లు నాటాలి అని డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ కూడా అందరికీ పిలుపు నిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకుల తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద ఎన్నో మొక్కలను నాటుతున్నారు.ఈ మొక్కలు కేవలం ఆరోగ్యాన్నే కాదు కొన్ని రకాల మొక్కలను ప్రత్యేకంగా పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక హిందూ సాంప్రదాయ ప్రకారం చెట్లను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. మన పురాణాలలో కొన్ని చెట్లను పూజిస్తే అత్యంత సంపద, ఆరోగ్యం కలుగుతుందని మన పూర్వికులు వివరించారు . మరి అవి ఏమిటో తెలియసుకుందామా..

These trees to worshiped in remove Financial loss and increase wealth

1.రావి చెట్టు : మన పురాణాల్లో రావిచెట్టుకు అధికమైన ప్రాధాన్యత వుంది. రావి చెట్టు మొదలులో విష్ణుమూర్తి నివాసం ఉంటాడని.. కొమ్మలలో నారాయణుడు,ఆకులలో హరి నివాసం ఉంటారని చెబుతారు. హిందూ సాంప్రదాయ ప్రకారం రావిచెట్టును పూజించడం, మన ఇష్టదైవం పేరు
రావి ఆకు మీద రాసి.. స్వామి వారి ముందు పెట్టీ నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు పోయి లక్ష్మిదేవి కటాక్షం పొందుతారని పురాణాలూ మనకి చెబుతాయి. చెట్టును పూజించడం వల్ల సంతాన సాఫల్యం కూడా కలుగుతుంది.

2. తులసి : తులసి కోట కి మన హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి ప్రతి స్వరూపంగా కొలుస్తారు. రోజు స్నానం చేసి వెంటనే తులసి కోటలో నీళ్లు, కొన్ని పాలు వేసి పసుపు, కుంకుమలతో పూజించి అందులో ఉన్న మట్టిని బొట్టు లాగా పెట్టుకుంటే సర్వ దోషాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసీ మాలను నిత్యం విష్ణుమూర్తికి సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి అందవలసిన సొమ్ము సకాలంలో మన ఇంటికి చేరుతుంది. అంతే కాదు తులసి మొక్కకు ఎంత ప్రత్యేకంగా పూజ చేస్తే లక్ష్మీదేవి కూడా ఆ ఇంటి లోకి వస్తుంది అని పురాణాల్లో సైతం చెబుతున్నాయి. అందుకే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి తులసికోటను దర్శించడం వలన పాపాలు కూడా తొలగిపోతాయి.

3. c : మనీ ప్లాంట్ ని మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల సర్వదోషాలు తొలగుతాయి. ప్రతిరోజు మనీ ప్లాంట్ ఎదురుగా నువ్వుల నూనె దీపం పెడితే శని దోషం తొలగి లక్ష్మీదేవి కటాక్షం కలుగును. మనీ ప్లాంట్ ను పైకి పాకే విధముగా పెంచుకోవాలి. అప్పుడే మన ఇంటి సంపదలు పెరుగుతాయి

4. అరటి చెట్టు : హిందు సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాలలోనైన అరటి ఆకుమీద భోజనం చేయడం ఒక ఆనవాయితీ. అరటి ఆకులు మీద భోజనం చేయడం వల్ల శుభం కలగడమే కాక,ఆరోగ్యం కూడా కలుగును. ఇలాంటి అరటి చెట్టు ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం వల్ల ఆ శివుని అనుగ్రహం స్వయంగా దొరుకును. శివుని అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు కదా. అందుకే సంపద పెరగాలి అంటే అరటి చెట్టుకు పూజ చేయాలి.

5. జమ్మి చెట్టు : మన పురాణాలలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. పూర్వం పాండవులు వనవాసం వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను ఎవరికీ కనిపించకుండా దాచారని, జమ్మి చెట్టు లో ఉన్న లక్ష్మీదేవి వారికి అండగా నిలబడింది అని ప్రతీతి. జమ్మి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, శత్రు పీడలు తొలగి, సర్వ సంపదలు చేకూరుతాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.