Categories: ExclusiveNews

Business Idea : రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే సరికొత్త సాగు.. రూ.50 లక్షలకు పైగా ఆదాయం..!

మన భారత దేశంలో రైతులు ఇంకా సంప్రదాయక పంటల్ని సాగు చేసి ఎన్నో నష్టాలను చవి చూస్తున్నారు. రైతులకు పంటల లో నష్టాలు కలగడం .. అప్పుల పాలు అవ్వడం.. ఆత్మహత్య చేసుకోవడం లాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాము. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా పండించే సాగులో వేరుశనగ, జొన్న, వరి వంటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. తరచుగా ఇలాంటి పంటలను పండించడం వల్ల భూమి యొక్క సారం పడిపోవడం.. ఫలితంగా నష్టం రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు రైతులు ఏదైనా సాగు చేయాలి అంటే ఈ మధ్యకాలంలో కీటకాల బెడద ఎక్కువ అవుతున్నట్లు నేపథ్యంలో ఎక్కువగా రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇక పంట దిగుబడి సంగతి పక్కన పెడితే రైతులకు నష్టం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక శారీరక శ్రమతో పాటు అప్పుల బాధలు కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో రైతు ఎప్పటికీ రారాజు కాలేకపోతున్నాడు.ఇక రైతేరాజు అని ఎంతోమంది చెప్పినప్పటికీ ఆ రైతు రాజు అయ్యే సమయం ఎప్పుడు వస్తుందా అని కలలు కంటూ అలాగే ఉండిపోతున్నాడు.

ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే పంటతో నిజంగానే రైతు రాజు అవుతాడు అనడంలో సందేహం లేదు. మరి ఆ పంట ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇటీవల కాలంలో బాగా పాపులారిటీ పొందిన సాగు డ్రాగన్ ఫ్రూట్.. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కడ చూసినా రైతులు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి ..? ఎలా లాభాలను పొందాలి ..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.రైతులు వ్యవసాయం చేయడం ద్వారా ధనవంతులు కావడానికి డ్రాగన్ ఫ్రూట్ సాగు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిని ప్రధానంగా థాయ్ లాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ , యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే వియత్నాం వంటి దేశాలలో ఎక్కువగా పండిస్తారు. ఈ పంటను నిర్దేశిత ప్రమాణాల ద్వారా పెంచినట్లయితే అదిరిపోయే ఆదాయాలను పొందవచ్చు. ముఖ్యంగా ఎకరం భూమిలో మీరు ప్రతి సంవత్సరం అరకోటికి పైగా లాభాలను పొందవచ్చు అని అనుభవజ్ఞులు కూడా తెలియజేస్తున్నారు.

Business Idea The newest crop that gives good income to the farmers

ఇకపోతే తొలిదశలో సాగు కి నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ని బట్టి కనీసం మూడు సార్లైనా ఈ పండ్లను మనం పొందడానికి వీలుగా ఉంటుంది. ఒక పండు సుమారుగా 400 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది . ఒక చెట్టు కనీసం 60 పండ్లను ఇస్తుంది.ఇక భారతదేశంలో అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ధర సుమారుగా కిలో రూ.250 నుంచి రూ.300 వరకు ధర పలుకుతోంది. ఇక ప్రతి చెట్టు నుంచి కనీసం మీరు ఆరు వేల రూపాయలకు పైగా లాభం పొందవచ్చు. ఇక నేలను బట్టి.. అనుకూలతను బట్టి సుమారుగా ఎకరం భూమి కి 1700 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటవచ్చు. అంటే ఒక ఎకరం పొలం లో ఈ పంట సాగు చేసినట్లయితే సుమారుగా సంవత్సరానికి రూ.50 లక్షలకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది.

ఇక ఈ తర్వాత ఈ మొక్కను నాటిన మొదటి సంవత్సరం నుంచి మీరు మొక్క యొక్క ఫలితాలను పొందడం ప్రారంభించవచ్చు. ఎక్కువగా నీరు అవసరం కూడా ఉండదు తక్కువ వర్షపాతం ఉన్న ఎడారి ప్రాంతాలలో కూడా ఈ పంట సాగు బాగా పెరుగుతుంది. నేల సారం సరిగా లేకపోయినా కూడా పండు పెరుగుతుంది.ఇక పంట దిగుబడి ఎక్కువగా కావాలి అంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్కను 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సులభంగా పెంచవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే సూర్యకాంతి అవసరం లేకపోయినా సరే ఈ చెట్లు పెరుగుతాయి. ఇసుక నేలలో కూడా ఈ పండ్లను పెంచడానికి అనుకూలం. నేల యొక్క పీహెచ్ విలువ 5.5 నుంచి 7 వరకు ఉండాలి. ఇలా చేసినట్లయితే పంట యొక్క దిగుబడి అధికంగా పెరిగి మీరు అతి తక్కువ సమయంలోనే మిలియనీర్ అవుతారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.