Jabardasth Emmanuel : జబర్ధస్త్ షో చాలా మందికి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షో వలన కొందరు లగ్జరీ కార్లు కొనుగోలు చేయగా, మరి కొందరు సొంత ఇళ్లు కొనుకున్నారు. ఈ వలన వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగుతుంది. దసరా నాడు బుల్లితెర తారలు చాలా మందే కొత్త కార్లు కొన్నారు.. పవిత్ర, రచ్చ రవి, షన్ను ఇలా చాలా మంది కొత్త కార్లు కొని.. తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. ఇక అంతే కాకుండా శివ జ్యోతి సైతం బెంజ్ కారు కొని ఆ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు జబర్దస్త్ ఇమాన్యుయేల్ కూడా ఆ లిస్ట్‌లోకి చేరి, తన కొత్త కారుని అందరికీ చూపించాడు. కల నెరవేరిందంటూ ఎమోషనల్ అవుతూ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. అవి నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇమ్మాన్యుయేల్ కొ్న్న కొత్త కారు హ్యుందాయ్ కంపెనీ యొక్క వెన్యూ ఎస్యూవీ. దీని ధర ఏకంగా రూ. 14 లక్షలు అని సమచారం. ఇది బ్రాండ్ యొక్క హై ఎండ్ వేరియంట్ కాగా, భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే తన 2022 వెన్యూ విడుదల చేసింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.మొన్నటి వరకు సాదా సీదా ఉన్న అను ఇమ్మాన్యుయేల్ ఇంత కాస్ట్ లీ కారు కొనడం చూసి హైపర్ ఆది, నాగబాబు ఆశ్చర్యంలో ఉన్నారట.
తాము కూడా ఇలాంటి కాస్ట్‌ల కారు కొనడానికి చాలా సమయం పట్టింది. మనోడు భలే తొందరగా కొనుకున్నాడుగా అని వారు అనుకున్నారట. తోటి కమెడీయన్స్ కూడా ఇమ్మాన్యుయేల్ ఇంత కాస్ట్లీ కారు కొనడం చూసి ఆశ్చర్యపోతున్నారు. త్వరలో ఆయన ఓ ఇల్లు కూడా కొనే ఆలోచనలో ఉన్నాడట. వర్షతో ఎప్పుడు క్లోజ్ గా ఉండే ఇమ్మాన్యుయేల్ కొత్త కారు కొనే సందర్భంలో వర్ష కాకుండా రోహిణితో కనిపించడం అందరిని ఆశ్చర్యపరచింది. మామూలుగా అయితే అందరూ వర్ష ఉంటుందని భావించి ఉంటారు. కాని అక్కడ రోహిణి కనపడడంతో ఒక్కసారి ఆలోచనలో పడ్డారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.