Sania: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని ప్రకటించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసింది.
అందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి తెలిపింది. 30 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్ కోర్టుకు వెళ్లానని.. ఆరేళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందని.. ప్రతి సమయంలో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్, ఫిజియో, అంతా సపోర్ట్ చేశారని తెలిపింది. ప్రతి ఒక్కరితో తన కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెలిపింది. సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్ స్లామ్‌లో ఆడనుంది. సానియా తన కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించింది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణి నిలిచింది. వరల్డ్ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.