Categories: ExclusiveNews

Business Idea : ఈ వ్యాపారంతో ఇంటి దగ్గర నుంచే ఆదాయం..!!

Business Idea : దేవునికి కొబ్బరికాయ కొట్టి చాలామంది ఆ కొబ్బరిని ప్రసాదంలా తీసుకుంటే.. మరికొందరు ఆ కొబ్బరితో చట్నీ లేకపోతే కొబ్బరి లడ్డూ లు కూడా చేసుకొని తింటారు. అదే సిటీలో అయితే కొబ్బరి చిప్పలను పడేస్తారు. పల్లెటూర్లో అయితే వాటిని పొయ్యిలో పెట్టి ఉపయోగిస్తారు. ఇంతకుమించి మనం కొబ్బరి చిప్పలతో చేసేది ఏమి ఉండదు. కదా కానీ కేరళకు చెందిన ఒక మహిళ ఆమె పేరు మరియా కురియాకోస్ అనే అమ్మాయి మాత్రం ఈ చిప్పలతో అందమైన పాత్రలు తయారు చేస్తోంది. కాదేది కళకు అనర్హం అన్న చందాగా ఆమె… కొబ్బరి చిప్పలతో మంచి పాత్రలను చేస్తూ… దాన్నే వ్యాపారంగా మలుచుకుంది. చిప్ప బిజినెస్ కదా అని తక్కువంచనా వేయకండి. నెలకు లక్షల కొద్ది ఆదాయం వస్తుందట..మీరు ఓసారి ఈ స్టోరీ పై లుక్కెయ్యండి. కేరళలోని త్రిస్సూర్‌లో పుట్టి పెరిగింది. అంతేకాకుండా ఆమె విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసింది. ఇండియాకు తిరిగి వచ్చాక కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేసిందట.

అయితే చిన్నప్పటి నుంచే వ్యాపారం చేయాలన్న ఆశ ఉండటంతో.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ చేయాలనుకుంది. బిజినెస్ చేయాలన్న కోరిక ఉంది కానీ… ఏం వ్యాపారం చేయాలి అన్న క్లారిటీ మాత్రం లేదు.. ఈ క్రమంలోనే ఓసారి స్థానిక కొబ్బరి నూనె మిల్లుకు వెళ్ళింది. అప్పుడే.. కొబ్బరి చిప్పలు వృధా చేయటం చూసిన మరియా. వాటిని తన వ్యాపార సూత్రంగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం నెట్లో సర్చ్ చేసి యూట్యూబ్లో పలు వీడియోలు కూడా చూసింది. ఇలా వీడియోలు చూసి రీసర్చ్ లో భాగంగానే కొబ్బరి చిప్పలతో మృదువైన పాత్రలను, వంట సామాగ్రి తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. తక్కువ ధరకే శాండింగ్ మిషనరీని కొనుగోలు చేసి… దీంతో చిప్పల పైన భాగాన్ని మృదువుగా మార్చి వివిధ రకాల బౌల్స్, పాత్రలు తయారు చేసిందట. వీటిని ఎగ్జిబిషన్లో ఆన్లైన్లో, సోషల్ మీడియా పేజీలలో అమ్మకానికి పెట్టింది… మంచి స్పందన రావడంతో ‘thenga’అనే స్టార్టప్‌ని ప్రారంభించింది..

Business Idea on Making good utensils out of coconut shells

తెంగా అంటే మలయాళం లో కొబ్బరి అని అర్థం లక్షల్లో ఆదాయం..అయితే క్రమంగా తన ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. బయట నుంచి వచ్చే ఆర్డర్లను తయారుచేసి ఇవ్వటానికి కొంతమంది కళాకారులను కూడా పెట్టుకుంది.. ప్రస్తుతం తన వద్ద విభిన్న పరిమాణాల్లో బౌల్స్, వంట పాత్రలు, స్పూన్స్, ఫోర్కులు, టీ కప్స్, క్యాండిల్స్, హ్యాంగింగ్ ప్లాంటర్స్, కంటైనర్స్, షార్ట్ గ్లాసెస్, సోప్ కేసెస్, టైల్స్ వంటివి ఎన్నో రూపుదిద్దుకుంటున్నాయట ఆశ్చర్యంగా ఉంది కదా .. కొబ్బరి చిప్పలతో ఇన్ని తయారు చేస్తున్నారా అనిపిస్తోంది. ఇక వీటికి క్లాసీ లుక్ అందించడానికి కొబ్బరి నూనెతో వార్నిష్ చేస్తున్నారు… లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీ తో మరికొన్ని ఉత్పత్తులకు అదనపు హంగులద్దుతున్నట్లు ఆమె తెలిపింది. ఆన్లైన్ ,ఆఫ్ లైన్ తమ వస్తువులు అందుబాటులో ఉన్నాయట.

వీటి ద్వారా నెలకు సుమారు రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తోందట.ఇక ఈ వ్యాపారంలో తన తల్లిదండ్రుల సహకారం ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని తెలిపింది. కురియకోస్ ఏదన్నా చేయాలన్న కోరిక బలంగా ఉంటే.. మీనమేషాలు లెక్కించుకోకుండా స్టెప్ తీసుకోవాలని కురియాకోస్ అంటుంది. అంతే కదా. వాళ్లు ఏమనుకుంటారో వీళ్ళు ఏమంటారో అని.. చాలామంది తమ ఆశలను, ఆశయాలను అనగ తొక్కుకుంటారు. కానీ ఏదైతే అది అయ్యిందని ముందుకెళ్తేనే.. జీవితం యొక్క అసలైన రుచిని చూడగలుగుతారు. పడితే మళ్లీ లేవాలి.. మునపటి కంటే గట్టిగా ప్రయత్నించాలి.. ఈ పద్ధతినే ఎంతోమంది వ్యాపారవేత్తలు ఫాలో అయ్యారు అవుతున్నారు కూడా.! ఇంస్టాగ్రామ్ లో తన ఖాతాలో మనం ఈ కొబ్బరి చిప్పల అందమైన ఆకృతిని కూడా చూడవచ్చు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.