Categories: ExclusiveNewsTrending

Business Idea : పెట్టుబడి పెట్టలేరు కానీ మంచి సంపాదన కావాలి అని ఉందా? ఇలా చేస్తే చేతినిండా డబ్బే డబ్బు!!

Business Idea : ఇటీవల కాలంలో చాలామంది సొంతంగా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడికి డబ్బులు లేక చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇటువంటి వారి కోసం పెట్టుబడి లేకుండా ప్రారంభించే కొన్ని బిజినెస్ ఐడియాలు మీకోసం. నేటితరం యువత ఉద్యోగం చేయడం ద్వారా కాకుండా సొంతంగా పైకి ఎదగాలని ఎక్కువగా భావిస్తున్నారు. కానీ చాలామంది తమలో ఉన్న టాలెంట్ ని గుర్తించలేకపోవడం వల్ల అద్భుతాలను సృష్టించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసమే బెస్ట్ బిజినెస్ ఐడియాలు.. నేటి తరం యువతలో పాలిటిక్స్, సోషల్ మీడియా పై అవగాహన లేని వారంటూ ఉండరు. ఈ అవగాహనను పెట్టుబడిగా పెట్టి మీరు అద్భుతాలను సృష్టించగలరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు ఖాతాలను ఏర్పాటు చేసి తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నా వారే ఎక్కువ. దీనికోసం వారు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఖాతాలన్నీ వారి పేరు మీద కనబడుతున్నప్పటికీ వాటిని వేరే వారు మెయింటెన్ చేస్తూ ఉంటారు.

ఈ సోషల్ మీడియా ఖాతాలను మెయింటెన్ చేయడానికి ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుంటారు. ఇటువంటి నిపుణుల ద్వారా వ్యక్తిగత ఖాతాలే కాకుండా వేరే పేర్లతో ఖాతాలను తెరిచి వారికి పబ్లిసిటీ వచ్చేలా, వారు చేసేటువంటి పనులు జనాల్లోకి వెళ్లేలా చేసుకుంటున్నా వారే ఎక్కువ. మీరు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలకు కూడా అడ్మిన్ గా ఉండవచ్చు. దీనికి శ్రమ ఎక్కువగా ఉండదు. మీ ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చుని వారు పంపించే కంటెంట్ ను, ఫోటోలను ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా తీర్చిదిద్ది సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేయాలి. దీని కోసం మీకు వీడియో ఎడిటింగ్ పై, ఫోటోషాప్ వంటి వాటిపై అవగాహన ఉన్నట్టయితే ఈ పనిలో మరింత ఎక్కువగా రాణించవచ్చు. మీరు చేసే పనితీరును బట్టి లేదా మీరు పని చేసే వ్యక్తి స్థాయిని బట్టి మీకు పారితోషకం ఇవ్వబడుతుంది. మీరు ఈ పనిలో పట్టు సాధిస్తే.. మీకు మంచి అవకాశాలు వస్తాయి. దీని కారణంగా ఒకేసారి చాలామంది సోషల్ మీడియా ఖాతాలను మెయింటెన్ చేసే అవకాశం వస్తుంది.

Business Idea on If you do this, it will be a lot of money

దీని ద్వారా మీకు లక్షల్లో ఆదాయం వస్తుంది. మరో బిజినెస్ ఐడియా.. ఇప్పటి కాలంలో రాజకీయాలపై అవగాహన లేని యువత అంటూ ఉండరు. వార్తలను అనేకమంది ఫాలో అవుతూ ఉంటారు. ఆ నేత ఇలా మాట్లాడితే బాగుండు, ఆ నాయకుడు ఇలా మాట్లాడి తప్పు చేశాడని వాటి గురించి అనుకుంటూ ఉంటారు. చాలామంది నాయకులు పొలిటికల్ స్ట్రాట‌జిస్ట్ ల‌ను నియమించుకుంటారు. దీని కారణంగా వారికి డిమాండ్ ఎక్కువ. మీకు రాజకీయాలపై అవగాహన, అమితంగా ఆసక్తి ఉంటే ఈ రంగాన్ని మీరు కూడా ఎంచుకోవచ్చును. మీరు పొలిటికల్ అనలిస్టుగా మారవచ్చు. ఇప్పుడు 80 శాతం మంది నాయకులు సర్వే టీం ,లను పొలిటికల్ అనలిస్ట్‌లను నియమించుకోవడం జరుగుతుంది. కనుక ఈ రంగంలో విపరీతమైన డిమాండ్ పెరిగింది. మీరు కూడా పొలిటికల్ అనలిస్ట్ అవ్వాలనుకుంటే ముందు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మీరు అప్ కమింగ్ పొలిటిషన్లను కలిసి వారికి మీ టాలెంట్ గురించి వివరించాల్సి ఉంటుంది. అవసరమనిపిస్తే వారికి మీ మీద నమ్మకం కలగాలంటే ఉచితంగా సేవలు అందించాల్సి ఉంటుంది.

Recent Posts

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

2 weeks ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

2 weeks ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

4 months ago

Joint Pains: నడుం నొప్పి, ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తించే దివ్య ఔషధం..!!

Joint Pains: సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనిషి చాలా…

5 months ago

Cyber Crime : సైబర్ మోసాలు , లోన్ apps వేధింపులకి గురి అవుతున్న వాళ్లకి best solution ఇదే

Cyber Crime : గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే సంస్థ సైబర్ ఫ్రాడ్ లని చేధిస్తూ అనేకమంది సామాన్యులని సైబర్…

5 months ago

This website uses cookies.