Health Benefits : ప్రకృతి అందించిన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మన చుట్టూనే ఉన్నా.. మనం రోజు చూస్తున్నప్పటికీ వాటి విలువలు తెలియక పిచ్చి మొక్కలుగా పరిగణిస్తూ ఉంటాము. కానీ ఈ మొక్కలు మన ఆరోగ్యాన్ని మరింతగా పెంపొందిస్తాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యంత ప్రాముఖ్యత పొందిన మొక్కలలో తిప్పతీగ మొక్క కూడా ఒకటి. విరివిగా లభించే ఈ తిప్పతీగ ఆకులలో కొన్ని వేల రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో స్టెరాయిడ్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. తిప్పతీగ ఉపయోగించి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు ఈ తిప్పతీగలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను అధికంగా కలిగి ఉండడం.
వల్ల శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వాటిని బయటకు పంపించడంలో సహాయపడతాయి. అజీర్తితో బాధపడేవారు తిప్పతీగల చూర్ణం గుళికల రూపంలో ప్రతిరోజు తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఆర్థరైటిస్ నొప్పి నుంచి కూడా విముక్తి పొందుతారు. తిప్పతీగ జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి చాలా సహాయపడుతుంది తిప్పతీగలో ఉండే పోషకాలు మూత్రశయంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి దోహదపడతాయి . ఇందులో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఒత్తిడిని దూరం చేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. కొంతమంది తిప్పతీగ తో జ్యూస్ , పౌడర్ , క్యాప్సిల్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు.
కరోనా వంటి మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తుందని కూడా చెబుతున్నారు సీజనల్ గా వచ్చే జ్వరాలు, వ్యాధులు , ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. తిప్పతీగ ఆకుల పొడిని బెల్లం లో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఔషధం.. ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోస్ తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి. ప్రతిరోజు గోరువెచ్చని పాలలో కొద్దిగా తిప్పతీగ చూర్ణం , అల్లం రసం కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే కీళ్లనొప్పులు కూడా దూరం అవుతాయి. విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా వంటి వాటిని కూడా దూరం చేసుకోవచ్చు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.