Categories: FeaturedTrending

Subash Chandra Bose : చరిత్ర నిజాలు : దేశం కోసం పొరాడి ఏమైపోయాడో తెలియని చంద్రబోస్ జీవిత గాద..

Subash Chandra Bose :  చంద్రబోస్ విద్యాభ్యాసం :
ఒరిస్సాలోని కటక్ అనే ప్రాంతంలో ప్రభావతి దేవి, జానకినాథ్ బోస్ లకు జనవరి 23 1897 న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించారు. బోస్ తండ్రి గారు వృత్తిరీత్యా లాయర్ అయినప్పటికీ రాజకీయాలలో కూడా చురుకుగా ఉండేవారు. ఆయన బెంగాల్ శాసనమండలి కి కూడా ఎన్నికయ్యారు. సుభాష్ చంద్రబోస్ చిన్న తనం నుంచి చదువులో ముందుండేవాడు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి అయ్యాక 1920లో భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకునుపొందాడు. అయినా కూడా 1921లో తన ఉడ్జ్యోగానికి స్వస్తి చెప్పి స్వతంత్ర ఉద్జ్యమం లో పాల్గొన్నారు.

ధీరోదాత్త :

బోస్ అనగానే యూనిఫామ్ ధరించిన ఓ మూర్తి మనముందు ప్రత్యక్షమవుతుంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడం తో పాటు తెల్లదొరలు ఈ దేశం నుంచి పారిపోయేలా చేసిన ధీరోదాత్త నేతగా నిలిచారు.

నిజమైన స్వతంత్ర సమరయోధుడు:

సుభాష్ చంద్రబోస్ అంటే మాటల్లో చెప్పలేని ఓ మహోజ్జ్వల సాహసం, అంతకు మించిన సమయస్ఫూర్తి, అచంచలమైన దేశభక్తి, స్వతహాగా అద్భుతమైన మేధస్సు కల నిజమైన స్వతంత్ర సమరయోధుడు.
కాంగ్రెస్ లో చురుకైన పాత్ర:
సుభాష్ చంద్రబోస్ మీద స్వామి వివేకానంద యొక్క ప్రసంగాల ప్రేరణ బాగాఉండేది అని అంటారు. 1937 డిసెంబర్ 26 వ తేదీన ఎమిలీ షెంకెల్ అనే స్త్రీ ని వివాహం చేసుకున్నారు. బోస్ దంపతులకు 1942లో ఒక కూతురు పుట్టింది. ఆమెకి అనిత బోస్ అని పేరు పెట్టారు. బోస్ మొదటి నుండి గాంధీజీ తో కలిసి జాతీయ కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించారు. జాతీయ కాంగ్రెస్లో ఒక కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షుడిగా నియమించబడ్డారు.

భారత స్వాతంత్రం కోసం :

గాంధీజీ విధానాలు నచ్చక వాటిని విభేదించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఆ తరువాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీనినెలకొల్పారు. భారతదేశం మాత్రమే బ్రిటిష్ వారిని ఎదిరించలేదని తెలుసుకున్న బోస్ భారత స్వాతంత్రం కోసం ఇతర దేశాల సహాయం కూడా తీసుకోవాలి అని భావించాడు.

నేతాజీ గా :

సుభాష్ చంద్రబోస్ ని బ్రిటిష్ వారు మొత్తం 11 సార్లు కారాగారంలోపెట్టారు. అయినా కూడా బోస్ అక్కడ నుండి తప్పించుకొని రష్యా ఇటలీ మరియు జర్మనీ వంటి దేశాలలో తిరిగి ఆ దేశం యొక్క మరియు సైనిక మద్దతును కూడా సంపాదించగలిగాడు. అగ్రరాజ్యాలకు బందీలుగా ఉన్న 4,500 మంది భారతీయ సైనికులతో ఇండియన్ లెజియన్ను నెలకొల్పాడు. ఇలా వివిధ దేశాలలో ఉన్న భారతీయ సైనికులందర్నీ కలిపి అజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యాన్నితయారు చేసుకున్నాడు. ఆ సైనికులు సుభాష్ చంద్రబోస్ కు నేతాజీ అనే బిరుదును కట్టబెట్టారు. అప్పటినుండే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అయ్యారు.

దేశ భక్తులు సైన్యంలో :

బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా చేసేవారు.
మిలిటరీ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా బోస్ మాత్రం అజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని ఆపలేదు. జులై 4 వ తేదీ , 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో బోస్ చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి పొందిన వ్యాఖ్యలు

మీ రక్తాన్ని ధారపోయండి. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను
”ఈ ర్యాలీలోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకం గా చేస్తున్న పోరాటంలోభారత ప్రజలను తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఉత్తేజ భరితంగా సాగి అందర్నీ ఆకట్టుకుంది.
బ్రిటీష్ వారి కన్నుకప్పి:
సుభాష్ తన మిత్రులందరితో కలిసి కటక్ లో “స్వేచ్ఛా సేవాసంఘ్” ను స్థాపించి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో సేవాకార్యక్రమాలను చేసేవారు. రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమయ్యాక నేతాజీని బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది.బ్రిటీష్ వారి కన్నుకప్పి 1941 లో గృహనిర్భందం నుండి తప్పించుకుని పెషావర్ మీదుగా జర్మనీకి వెళ్ళి హిట్లర్ ను కలుసుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించి తెలియచేసి ఆయన సమర్థనను కూడాపొందగలిగాడు. డిల్లీ ఎర్రకోట మీద కూడా త్రివర్ణ పతాకం ఎగరాలన్న సంకల్పంతో డిల్లీచలో అనే పిలుపునిచ్చాడు. ప్రజల్లో చైతన్యాన్ని పులకరింతలను పుట్టించేలా జైహింద్ అనే వినిపించాడు.ఇది జాతీయ నినాదంగా మారుమ్రోగింది.

నేతాజీమృతి:
1945 ఆగష్టు 18 న ఫార్మోజా సమీపంలో విమాన ప్రమాదంలో నేతాజీమృతి చెందినట్టు గా టోక్యో రేడియో ప్రకటించింది.అయితే అప్పట్లో విమాన ప్రమాదం ఏదీ జరగలేదని తర్వాత తెలిసింది. నేతాజీ మరణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. నేతాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు యువతకు ఆదర్శము.

స్వాతంత్య్రానికి ఎవరు కారణం:

భారత దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చింది? అన్న ప్రశ్న వేయగానే వెంటనే వచ్చే సమాధానం ఏమిటంటే మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటం వలన వచ్చింది అని చెప్తారు. ఎందుకంటే మనం చరిత్రలో చదువుకున్నది, మన పిల్లలకు పాఠ్యపుస్తకాల్లో బోధిస్తున్నది కూడా ఇదే.. కానీ ఇది కొంతవరకే నిజం.. అసలు నిజం వేరే ఉంది. అది ఏమిటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కారణంగా మనకు స్వతంత్రం వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఈ విషయాన్ని స్వయంగా నాటి బ్రిటన్ ప్రధానమంత్రి క్లైమెంట్ అట్లీ స్వయంగా తెలియచేసారు. దీనివెనుకున్న అసలు నిజం తెలుసుకుందాం. 1942లో కాంగ్రెస్ పార్టీ చేప్పట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ వారు దారుణంగా అణచేయడంతో, ఎక్కువ కాలం కొనసాగించలేక పోరాటాన్ని ఆపేస్తున్నటు గాంధీజీ ప్రకటించారు. దీంతో ఇప్పట్లో ఇక స్వాతంత్య్రం వచ్చే అవకాశం లేదని నాటి నేతలు అందరు నిరాశ చెందారు.. అలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నామని బ్రిటిష్ వారు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1947లో భారతదేశ స్వతంత్ర ప్రకటనను బ్రిటన్ ప్రధాని క్లైమెంట్ అట్లీ ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ , బ్రిటిష్ వారి ఆర్థిక స్థితి దెబ్బ తినడంతో వలసలను కాపాడుకోలేక స్వతంత్రం ఇచ్చారని నాటి నేతలు అనుకున్నారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో క్లైమెంట్ అట్లీ ఒకసారి భారత్ పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయన కలకత్తాలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయినా జస్టిస్ పీబీ చక్రవర్తి వద్ద రెండు రోజులు అతిథిగా ఉన్నారు. ఆ సమయంలో అట్లీతో చక్రవర్తి జరిపిన సంభాషణలో కొన్ని ఆసక్తికరమైన అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. కాంగ్రెస్ నేతలు బ్రిటిష్ వారినిబ్రతిమాలి , మెప్పించి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలని చేసిన ప్రయత్నాలు ఏవి కూడా సుభాష్ చంద్రబోస్ కు నచ్చలేదు. వారితో సాయుధపోరాటమే సరైన మార్గం అని బోసు భావించారు. గాంధీ, నెహ్రూలతో విభేదించిన బోసు బ్రిటిష్ వారి నిఘా నుండి తప్పించుకొని దేశం విడిచి వెళ్లిపోయారు.

సొంత కరెన్సీ ఏర్పాటు :

1943లో నేతాజీ ప్రవాసం నుంచి ప్రారంభించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ బ్రిటిష్ వారిని ప్రశాంతం గా ఉండనివ్వలేదు. తొలి స్వతంత్ర భారత సైన్యంతో పాటు, ప్రభుత్వం, సొంత కరెన్సీ ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. దానితర్వాత జరిగిన కొన్ని మార్పులు వలన సుభాష్ చంద్రబోస్ అదృశ్యం అయ్యారు.. అది ఇప్పటికి మిస్టరీగానే మిగలడం మనకి తెలుసు.. రెండో ప్రపంచ యుద్ధం లో విజయంపొందిన తర్వాత బ్రిటిష్ వారు నేతజీకి చెందిన ఆజాద్ హింద్ ఫౌజ్‌ అధికారులపై రాజద్రోహం మోపి చిత్ర హింసలు పెట్టి విచారణ చేసారు. ఇలా చేయడం అనేది బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయుల ఆగ్రహనికి కారణంగా నిలిచింది. భారత సైన్యంలో త్రివిధ దళాల్లో తిరుగుబాటు, అవిధేయత ఇంగ్లాండ్ లో గుబులు రేకెత్తించింది. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 25 లక్షల మంది భారతీయ సైనికులను తొలగించారు. భారతీయ సైనికులు ఆగ్రహంగా ఉన్నారని, బ్రిటిష్ అధికారుల పట్ల విధేయత చూపడం లేదని నివేదికలు అందాయి. ఈ పరిస్థితులలో భారత్ లో తమ మనుగడ అసాధ్యమని గ్రహించిన బ్రిటిష్ వారు భరత్ కి స్వాతంత్య్రం చేయాలి అని నిర్ణయానికి వచ్చారు.

 

ఇని స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ :
క్లైమెంట్ అట్లీతో చక్రవర్తి జరిపిన సంభాషణ చివరలో భారత్‌ కు స్వతంత్రం ఇవ్వాలన్న నిర్ణయంలో గాంధీజీ ప్రభావం ఏ మేరకు ఉన్నదని అడిగారు. అట్లీ వ్యంగ్యంగా నవ్వుతూ చాలా తక్కువ అని చెప్పారు. 1982లో ఇదంతా ఇని స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ రివ్యూ’లో పబ్లిష్ చేయడం జరిగింది. భారతదేశానికీ స్వతంత్రం సంపాదించడానికి బ్రిటిష్ వారి తో శతృత్వం ఉన్న జర్మనీ, జపాన్ లతో చంద్రబోస్ వ్యూహాత్మకంగా స్నేహం చేశారు. విదేశీ గడ్డ మీద నుండి ఒక సైన్యాన్ని సృష్టించడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన గా చెప్పుకోవచ్చు. నేతాజీ ప్రదర్శించిన నైపుణ్యం, ధైర్య సాహసాలు ప్రపంచ చరిత్రలో ఎవ్వరితో పోల్చలేనివి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.

భారత్ సహా ఆసియా, పసిఫిక్ లలో:

భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ చేసిన పోరాటాలను తక్కువ అని చెప్పలేము కానీ అసమాన ధైర్య సాహసాలతో భారత్ సహా ఆసియా, పసిఫిక్ లలో 60 దేశాలు స్వాతంత్య్రం పొందడానికి కారకులైన నేతాజీ పట్ల నాటి కాంగ్రెస్ నేతలు అడుగడుగునా అవమానకరంగా వ్యవహరించారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. బోస్ విమాన ప్రమాదంపై కానీ అదృశ్యంపై కానీ విచారణ చాలా ఆలస్యం జరిగేలా చేసారు . ఒక మహాయోధుడి పట్ల ప్రపంచంలో మరే దేశం ఇంత నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించి ఉండదు అనేది నిజం.

1947కు ముందే మన దేశానికి స్వాతంత్య్రం :

ఇంకా చెప్పాలి అంటే కాంగ్రెస్ నేతలు బోస్ పోరాటానికి సహకరిస్తే 1947కు ముందే మన దేశానికి స్వాతంత్య్రంవచ్చి ఉండేది. ప్రపంచమంతా ఆరాధించే మహాత్ముడు బోస్ మీద వ్యతిరేక భావంతో ఉండడం, నిర్బంధం నుంచి తప్పించుకొని విదేశాలకు బోస్ వెళ్లి పోవడం, రాజకీయాల్లో కూడా వివేకానందుని భావాలను, ఆదర్శాలను గౌరవించి నిజజీవితంలో ఆచరించడం అనేవి నిజాలుగా నిలిచిపోయాయి.

ది గ్రేట్ సుభాష్ చంద్ర బోస్ :

నిలువెల్లా నిఘా కన్నులతో ఉండే బ్రిటిష్ పాలకుల కళ్లుగప్పి అందరూ చూస్తుండగానే మారువేషంలో పరాయి దేశానికి తప్పించుకుపోగల సాహసవీరుడు సుభాష్ చంద్ర బోస్.
ఒక్కొక్కసారి నిజాలు అబద్దాలుగా మారురూపాలు ధరిస్తాయి. అలాగే భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో గాంధీ, నెహ్రూలు తప్ప వేరే నాయకులే లేరన్నట్లు ప్రచారం చేశారు.ఎవరి పేరులు పైకి రానివ్వలేదు.
చరిత్రను ఎంత వక్రీకరించినా కూడా భారతదేశ ప్రజల హృదయాల్లో నేతాజీకి ఉన్న స్థానం మరి ఎవరికీ లేదు అనే చెప్పాలి. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు నేతాజీ విగ్రహం కనిపిస్తుంది. నేతాజీ పేరిట ఇప్పటికీ యువజన సంఘాలు పనిచేస్తున్నాయి. బోస్ అనగానే మనకు ఆజాద్ హింద్ ఫౌజ్ గుర్తుకురాక మానదు.
స్టాలిన్ కోసం వెళ్లాలనుకుని హిట్లర్ వద్దకు వెళ్లడం, జర్మనీలో కొంతకాలం ఉండవలిసి రావడం వల్ల బోస్ నాజీలను సమర్థించాడు అన్న అపనింద రావడం, గాంధీ బోస్తో విభేదించినా కూడా బోస్ మాత్రం గాంధీని గౌరవించడం, భారతదేశంలో ఉంటే తెల్లవాళ్ళు అరెస్టు చేసి జైల్లో పెడతారని, దానితో తన పోరాటం ఆగిపోతుందని.. విదేశాలకు వేళ్ళయినా స్వాతంత్ర్య ఉద్యమం నడపాలని మారువేషంలో విదేశాలకు వెళ్లడం బోస్ జీవితం జరిగిన కొన్ని ముఖ్య అంశాలు.
ఇటలీ నియంత ముస్సోలిని “స్వాతంత్ర్యం ఎలా కావాలనుకుంటున్నారు సంస్కరణ మార్గంలోనా, విప్లవాత్మకంగానా” అని బోస్ ను అడిగినప్పుడు ముమ్మాటికీ విప్లవ పంథాలోనే అని బోస్ చెప్పిన సమాధానం నిజంగా మరువలేనిది.

చరిత్రలో స్వాతంత్ర్య సమర నాయకులుగా గాంధీ, నెహ్రూలు మాత్రమే నిలిచినా, స్వాతంత్ర్య సంగ్రామ వీరునిగా ప్రజల గుండెల్లో బోస్ ధీర చరిత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.