Vastu Shastra : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉంటే ధనలక్ష్మి మీ ఇంట్లోనే..!!

Vastu Shastra : మన హిందూ సంప్రదాయంలో ఇంటి పెరట్లో చెట్లు నాటడం ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంతరించుకుంది. ఇక ఇంటి ముందు నాటిన చెట్లు, మొక్కలు, చల్లని నీడ, పండ్లు, పువ్వులు, ప్రాణవాయువును మాత్రమే కాదు మనకు కావలసిన వస్తువులతో పాటు మన అదృష్టాన్ని కూడా పెంచుతాయని మీకు తెలుసా..? వాస్తు ప్రకారం కొన్ని చెట్లలో.. తులసి చెట్టుతో పాటు కొన్ని మొక్కలను నాటితే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ని పెంచి , ధన ప్రాప్తి కలిగేలా చేస్తుంది. వాస్తు ప్రకారం పవిత్రమైన చెట్లను నాటితే అవి ఇంటి అందంతో పాటు ఐశ్వర్యాన్ని పెంచుతాయి. అయితే ఆ మొక్కలను ఏ దిశలో? ఎక్కడ నాటాలో ? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తొమ్మిది రకాల మొక్కలు అదృష్టలక్ష్మి చేత మన ఇంటి తలుపు తట్టేలా చేస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తారు.

Vastu Shastra, if these plants in your house yard then Dhanalakshmi is your house

1. మామిడి –మన సంప్రదాయ పండగలకు , ఫంక్షన్ లో కి మామిడాకులు కట్టడం శుభ సూచికంగా భావిస్తారు. దీని వల్ల కలప, పండ్లు, విత్తనాలు, ఆకులు మానవుడికి అన్ని విధాలుగా ఉపయోగపడుతాయి. ఈ పవిత్రమైన చెట్టును ఇంటిముందు ఈశాన్యంలో ఉంటే శుభప్రదముగా పరిగణిస్తారు.

2. నేరేడు –నేరేడు ఔషదాల గని అని చెప్పొచ్చు. మధుమేహం, గుండె రోగులు నేరేడు పండును ఔషధంగా భావిస్తారు. ఈ చెట్టును దక్షిణ లేదా నైరుతి మధ్యలో నాటితే శుభ ఫలితాలను ఇస్తుంది.

3. దానిమ్మ – ఇంటి బయట దానిమ్మ చెట్టును ఆగ్నేయ దిశలో ఉంచడం చాలా మంచిది . రక్త హీనతను తొలగించడానికి దానిమ్మ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

4. బేల్ – బేల్ చెట్టును ఇంటి పశ్చిమ దిశలో నాటాలి. ఈ చెట్టు ఆకులు, పండ్లను ప్రత్యేకంగా శివుని పూజలో ఉపయోగిస్తారు. ఇది చాలా పవిత్రమైన చెట్టు. ఈ చెట్టు నీడ చాలా చల్లగా ప్రయోజనకరంగా ఉంటుంది.

5.ఉసిరి – ఉసిరి చెట్టును వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో నాటాలి.

6.జాక్ ఫ్రూట్ – వాస్తు ప్రకారం ఇంటి లోపల పండ్ల చెట్టు నాటకూడదు. దానిని మీ ఇంటి బయట ఉత్తర లేదా తూర్పు దిశల మధ్య నాటితే మంచిది.

7.రావి చెట్టు – రావి చెట్టు దేవతల నివాసంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఈ చెట్టును ఇంటి నుంచి పశ్చిమ దిక్కున పెట్టడం శుభప్రదంగా భావిస్తారు.

8. మర్రి – ఈ చెట్టుకు హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది అన్ని రకాల కోరికలను నెరవేరుస్తుంది. వాస్తు ప్రకారం ఈ చెట్టు ఇంటి నుంచి సూర్యుడు ఉదయించే దిక్కున ఉండటం శుభాలు కలిగి ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది.

9.తులసీ-ఈ మొక్కను మీ ఇంటి ద్వారానికి కొద్దిగా కుడివైపు ఉండేటట్టు నాటినట్లయితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి రావడం ఖాయమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.