Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. నిన్న విడుదలైన ఈ ఫస్ట్ లుక్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..! రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్.. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి.. రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకునే వారికి.. ఆదిపురుష్ చిత్రం ఊహించని విధంగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది..!
స్టార్ డైరెక్టర్ ఓం రాత్ దర్శకత్వం వహిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ కు మునుపెన్నడూ ఊహించనంత భారీ రెస్పాన్స్ వచ్చింది.. రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ అవడంతో ఇక ప్రభాస్ హీరోగా రాణించలేరని చాలామంది అనుకున్నారు.. కానీ ఒక్క ఫస్ట్ లుక్ కి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చి ఆ నెగటివ్ టాప్ మొత్తాన్ని ఒక్క పోస్టర్ తో పోగొట్టాడు ప్రభాస్.. అంతే కాదు.. ఈ సినిమా విడుదలకు ముందే భారీ రికార్డు సృష్టించింది నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు కలిపి 250 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.. బ్రాండ్ ప్రభాస్ సినిమాపై మార్కెట్ అంచనాలకు ఇది నిదర్శనం..
అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా బిజినెస్ ఆసియాలోనే రికార్డ్స్ క్రియేట్ చేసేలాగా బిజినెస్ జరుగుతోందని తాజా సమాచారం.. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ సినిమాతో.. కృతి సనన్ హీరోయిన్ నటిస్తోంది.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.