Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ లో ఈవారం ఈ ట్విస్ట్ ఉంటుందా.!?

కార్తికదీపం సీరియల్ బుల్లితెరపై సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.. ఈ సీరియల్ కి వచ్చిన టిఆర్పి రేటింగ్ మరే సీరియల్ కు రాదనడంలో సందేహం లేదు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ నిన్నటి తో 1450 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో కార్తీక దీపం మే మొదటి ప్లేస్ లో నిలిచింది.. ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా కార్తీకదీపం టిఆర్పి రేటింగ్ చేయలేకపోయింది.. ఇంకొక సంవత్సరం పాటు ఈ సీరియల్ సాగదీసినా కూడా ప్రేక్షకులు చూడటానికి సిద్ధంగా ఉంటారు.. ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం..!!

Karthika Deepam : దీపకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్..

దీప ఒక్కసారి నీకు చెబితే అర్థం కాదా.. నాకు పెళ్లయింది మోనిత నా భార్య.. తెలిసి కూడా పరాయి స్త్రీ భర్తను ఎందుకు కోరుకుంటున్నావు అని కార్తీక్ ప్రశ్నిస్తాడు.. ఏడవకు ఏమీ తెలియని అమాయకురాల్లాగా కనిపిస్తావు.. కానీ చేసే పనులు మాత్రం ఇలా ఉంటాయి.. మోనిత ఏమో నీకు నాకు కనెక్షన్ ఉందని ఇంట్లో నన్ను తిట్టిపోస్తుంది.. నీ ప్రవర్తన కూడా ఆవిడ అనుమానాలకు తగ్గట్టుగానే ఉంది అని కార్తీక్ అంటాడు.. డాక్టర్ బాబు నేను ఎప్పుడు తప్పుగా ప్రవర్తించ లేదు అని అంటుంది.. మోనిత నా భార్య నా మీద ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు అని కార్తీక్ దీపకు వార్నింగ్ ఇచ్చాడు..

Will Karthika Deepam serial in This week's twist
Will Karthika Deepam serial in This week’s twist

Karthika Deepam : మోనిత కుట్ర తెలుసుకున్న దీప..!

ఇదంతా మోనిత ప్లాన్ అని దీపకు తెలియక సంజీవని ప్రకృతి వైద్యశాల కు వెళ్లాలని.. బట్టలు సర్దుకుని ఇంటికి తాళం వేసి బయటకు వస్తుంది.. డాక్టర్ బాబుకి మందులు తీసుకువచ్చి.. కేవలం వారం రోజుల్లో అంటే వారం రోజుల్లోనే గతం గుర్తుకు వచ్చేలాగా చేస్తాను అని దీప అంటుంది.. సరే అక్క నీ ఆనందాన్ని నేను ఎందుకు కాదు అంటాను ఆల్ ద బెస్ట్ అని మోనిత చెబుతుంది.. నువ్వు వెళ్తేనే కదా నేను వెళ్లి ఆనంద్ ని వెతుక్కుని తీసుకువస్తాను. దీప బస్టాండ్ కి వెళ్లడానికి ఆటో దగ్గరకు వెళ్తుంది.. ఆ ఆటో వేనకమల అమ్మానాన్న ఎక్కడున్నారు అని బోర్డు ఉంటుంది.. దీపతో ఇంద్రుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు.. ప్రకృతి వైద్యశాల కు వెళ్తున్నా అని అంటుంది.. అక్కడ ఆ దరిదాపుల్లో ఎలాంటి హాస్పిటల్ లేదని.. మిమ్మల్ని ఎవరు తప్పుడు దారి పట్టిస్తున్నారు.. ఒకసారి ఆ అడ్రస్ కనుక్కొని వెళ్ళండి.. అది మా సొంతూరు అని ఇంద్రుడు చెబుతాడు.. అప్పుడు దీప ఆలోచనలో పడుతుంది.. మోనిత ఏదో ప్లాన్ చేసింది.. కచ్చితంగా తన ప్లాన్ తెలుసుకోవాలి అని దీప అనుకుంది..

Karthika Deepam : అమ్మ బ్రతికే ఉందన్న సౌర్య..

సౌర్య ఆటోలో ఎక్కిన ఆమె కు సరుకులు లిస్ట్ చెబుతుంది.. అది రాసింది దీప చేతి రాతను చూసి ఇది అచ్చం మా అమ్మ చేతిరాత లాగానే ఉంది బాబాయ్.. నీకు ఇందాకే చెప్పాను కదా బాబాయ్ తన గొంతు మా అమ్మ లాగే ఉంది అని సౌర్య అంటుంది.. చేతిరాత, గొంతు ఆ రెండు ఒకేలాగా ఉన్నాయి.. కచ్చితంగా తను మా అమ్మ అని సౌర్య అంటుంది.. యాక్సిడెంట్ జరిగినప్పుడు మా అమ్మనాన్న చనిపోయిందని మీరంతా అనుకుంటున్నారు కదా అని సౌర్య అంటుంది.. ఇదే నా నమ్మకం అని ఆ బుక్ చూపిస్తూ ఇదే నా నమ్మకం పిన్ని అని సౌర్య అంటుంది. ఇదే ఊర్లో అమ్మ ఉంది.. దొరికే వరకు ఆపకుండా వెతుకుతూ ఉంటాను.. మీరు మాత్రం ఇంకెప్పుడూ లేరు అని అనవద్దు అంటుంది సౌర్య.. లక్ష్మణ్, అరుణ దగ్గరకి మోనిత వెళ్లి ఆనంద్ ను తీసుకు వస్తుంది.. లక్ష్మణ్ నేను బాబుని తీసుకు వెళ్తున్నాను కదా అని మీకు ఇచ్చిన ఆస్తులు మాత్రం తీసుకువెళ్లను అని మోనిత చెబుతోంది..

ఇప్పుడు అదే బంధంతో కార్తీక్ నేను దగ్గర అవ్వాలి అని అనుకుంటుంది.. ఆనందుని తీసుకొని మోనిత వెళ్ళిపోయింది.. దీప కార్తీక్ వాళ్ళ ఇంటి బయట తిరుగుతుంది.. ఇంట్లో ఎవరు కనిపించడం లేదు.. ఎవరు బయటకు రావడం లేదు ఏంటి.. మోనిత డాక్టర్ బాబు ను ఏం చేస్తుంది అసలు ఏమైంది అని అనుకుంటుంది. అప్పుడే శివ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు.. శివ దీప ను ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డుకుంటాడు. మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు వంటలక్క అని శివ అంటారు.. నేను మీ మోనిత మేడం తో మాట్లాడటానికి వచ్చాను అంది.. ఇప్పుడు మోనిత ఆనంద్ ను అడ్డం పెట్టుకొని కార్తీక్ ను తనకు దగ్గర చేసుకోవాలి అని అనుకుంటుంది.. ఆనంద్ ను కార్తీక్ ను దగ్గర చేసి.. తన ప్రేమతో వంటలక్క క్యారెక్టర్ ను ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటుంది మోనిత.. అయితే దీప కార్తీక్ లు ఒకప్పుడు ఆనంద్ ను అన్ని వల్లే అయ్యి పెంచారు.. అలా ఆనంద్ రూపంలో కూడా దీప కార్తీక్ కు గుర్తు వస్తుంది అనేది ఒక ట్విస్ట్ ఉంటుంది అనేది అంచనా.. చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది..

Advertisement