Big Boss 6 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో తిండి లేక 6 కేజీలు త‌గ్గిందా.. వాసంతి ఏం చెప్పిందంటే?

Bigg Boss 6 Telugu : తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఇప్పుడు సీజ‌న్ 6 జ‌రుపుకుంటుంది. ఇందులో మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్ట‌గా, ప్ర‌స్తుతం 9మంది మాత్ర‌మే ఉన్నారు. చివ‌రిగా మెరీనా హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అంత‌క ముందు వాసంతి ఎలిమినేట్ అయింది. అయితే హౌజ్ నుండి వ‌చ్చిన వాళ్లందరు కూడా బిగ్ బాస్ గురించి ఏదో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలియ‌జేస్తూనే ఉన్నారు. తాజాగా వాసంతి బిగ్ బాస్ హౌజ్‌లో ఫుడ్ ఎంత పెడ‌తారు, అందులో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లు ఎందుకు స‌న్న‌గా మారుతారు అనే విష‌యాన్ని తెలియ‌జేసింది.

vasanthi-stunning-comment-on-bigg-boss
vasanthi-stunning-comment-on-bigg-boss

ఇది అస‌లు కార‌ణం..

“బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాప్ 5లో కాకపోయినా, ఆ తరువాత స్థానంలోనైనా ఉంటానని ఎంతో  ఊహించాను. కానీ అలా జరగలేదు అని చెప్పిన వాసంతి తాను హౌజ్‌లో 70 రోజుల పాటు ఉన్న‌ట్టు చెప్పుకొచ్చింది. ఇది సామాన్యమైన విషయం కాదు. జ‌న‌ర‌ల్‌గా ఏ వారం ఎవరు ఎలిమినేషన్ కావొచ్చు అనేది హౌస్ లో ఉన్న మాకు ఒక అంచనా అంటూ ఉండేది. కానీ ఎప్పుడైతే హౌస్ నుంచి సూర్య .. గీతూ వెళ్లిపోయారో, ఇక ఏ క్షణం ఎవరైనా బయటికి వెళ్లిపోవచ్చు అనే ఒక అభిప్రాయానికి అంద‌రం వచ్చేశాము. హౌస్ లో నేను ఎవరితోను ఏ విషయాలను షేర్ చేసుకోను, నాకు అలవాటు లేదు అని పేర్కొంది వాసంతి.

ఇక ‘బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ వాళ్లంతా బరువు తగ్గుతూ ఉంటారు. అందుకు కార‌ణం హౌస్ లో ఉన్నవారికి సరిపోయేంత ఫుడ్ ఐటమ్స్ ఏవో ఒక‌టి వస్తూనే ఉంటాయి. కానీ అక్కడ ఉన్న మెంటల్ టెన్షన్ వలన, తిన్నది ఒంటికి వంటబట్టదు. ఎవరికి వారు నెక్స్ట్ ఏం జరగనుంది? ఏం చేయాలి? అనే విషయం గురించే ఎప్పుడు ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే చాలా సన్నబడుతుంటారు. నేను 53 కేజీల ఉండ‌గా, ఇప్పుడు 47 కేజీలకు వచ్చేను . 6 కేజీల బరువు తగ్గడంతో నా డ్రెస్ లు కూడా చాలా లూజ్ అయ్యాయి” అంటూ చెప్పుకొచ్చింది వాసంతి.