intinti gruhalakshmi 23 sep episode : ఇంటింటి గృహలక్ష్మి నేటి ఎపిసోడ్.. రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ కి షాక్ ఇచ్చిన తులసి..!

intinti gruhalakshmi 23 sep episode : సామ్రాట్ వాళ్ళ మేనేజర్ బయట ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు తులసి వుంటుంది.. మీరు సామ్రాట్ ను ఎలా మోసం చేయాలని అనుకుంటున్నారు.. ఎంత నమ్మితే అంత బాగా మోసం చేయగలం.. మీరు నా గురించి సామ్రాట్ కి తెలిస్తే నేను మిమ్మల్ని చంపేస్తా జాగ్రత్త అని అతను లోపలికి వెళ్తాడు.. అప్పుడే తులసి సామ్రాట్ సైన్ చేసి మేనేజర్ కి ఇచ్చిన ఫైల్ తీసుకుంటుంది.. అతను ఏం మాట్లాడాడో అది సామ్రాట్ కి వినిపిస్తుంది తులసి.. వెంటనే తనని జైల్లో పెట్టించమని నందు సలహా ఇస్తాడు.. కానీ తన కూతురు పెళ్లి ఉందని చెప్పడంతో తులసిని కాళ్ళ వేళ్ళ బ్రతిమిలాడుకుంటే.. సామ్రాట్ ఆ మేనేజర్ ని ఏం చేయకుండా వదిలిపెడతాడు..

సామ్రాట్ ఇంట్లో అందరి ముందుకు వచ్చి మీరందరూ అలా క్లాస్ కొట్టడం ఆపేస్తే నేను మీకు అంతకంటే గుడ్ న్యూస్ చెబుతాను అని సామ్రాట్ అంటాడు.. మన కంపెనీ కొత్త జనరల్ మేనేజర్ గా తులసి గారిని అపాయింట్ చేస్తున్నాను అని సామ్రాట్ అంటాడు.. ప్లీజ్ గివ్ హర్ రౌండ్ అప్లాస్ అని సామ్రాట్ అంటాడు.. కంగ్రాట్స్ తులసి అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు.. గడ్డి పూచను ఎవరైనా సింహాసనం మీద కూర్చో పెడతారా మీరు ఊరుకోండి బాబాయ్ గారు అని తులసి అంటుంది హాట్సాఫ్ తులసి నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడవు అని లాస్య అంటుంది అప్పుడే సామ్రాట్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం గొప్ప వాళ్ళ లక్షణం.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడటం నేనేమీ ఆశ్చర్య పోవడం లేదు అది కాదు అని తులసి చెప్పబోతుండగానే నేను ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను..

intinti gruhalakshmi Tulasi shocked Samrat in tomorrow's episode
intinti gruhalakshmi Tulasi shocked Samrat in tomorrow’s episode

intinti gruhalakshmi 23 sep episode :  నందగోపాల్ మీద మీకు నమ్మకం లేదా

సామ్రాట్ గారు నేను చెప్పేది వినండి అని తులసి అంటుండగానే.. అప్పుడే అభి నేను ముందు నుంచి మొత్తుకుంటుంది అదే కదా.. క్లర్క్ ఉద్యోగానికి కూడా పనికిరాని నువ్వు ఇప్పుడు ఓ మంచి పొజిషన్లో నిన్ను ఎలా కూర్చోబెడతారు.. కనీసం బట్టల కంపెనీని డీల్ చేయలేక మధ్యలో వదిలేసిన నీకు ఇంత పెద్ద బాధ్యతలు ఎలా ఇస్తారు.. కనీసం ఇంగ్లీషులో పెట్టడానికి ఆలోచించి నువ్వు ఇంగ్లీషులో ఉన్న దానిని.. చూసి ఎలా చదువు అర్థం చేసుకోగలవు అని అభి అంటాడు.. అనుభవం ఉన్న వారిని తీసుకువచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాను కానీ ఇప్పుడు ఏం జరిగింది మోసం చేశారు.. కానీ నాకు ఇప్పుడు కావాల్సింది అర్హత ఉన్న వాళ్ళు కాదు తులసి లాంటి నమ్మకం ఉన్నవాళ్లు అని సామ్రాట్ తన అభిప్రాయాన్ని చెబుతాడు.. అలాంటి నమ్మకమైన వ్యక్తులు మీ చుట్టూ ఎవరూ లేరా అని అభి అడుగుతాడు.. చదువు అర్హత ఉన్న నందగోపాల్ మీద మీకు నమ్మకం లేదా అని అభి సూటిగా అడుగుతాడు.. నమ్మకం లేనప్పుడు ఆయన్ని ఎందుకు ఉద్యోగంలో ఉంచారు.. ఏ విధంగా మా డాడీని రిజెక్ట్ చేస్తున్నారు.. అయినా ఎందుకు మా మామ్ ను జాబ్ లోకి తీసుకుంటున్నారు.. రేపు తనని బలి పశువు చేద్దామని అనుకుంటున్నారా.. నువ్వు గుడ్డిగా నమ్మి ఆయన చెప్పినట్టు వినొద్దు అని అభి అడుగుతాడు..

సామ్రాట్ గారు నాకు మ్యూజిక్స్ స్కూల్ వరకు వరకే చాలు ఇంకా అంతకుమించి నేను ఎక్కువ ఆలోచించడం లేదు అని తులసి అంటుంది చేతకానికి వాళ్లకు ఉండిపోతాను అంటే ఎలా తులసి గారు ఏదో సాధించాలి అని అనుకోవాలి.. ఆ రోజు వైజాగ్ లో ఎవరూ పక్కన లేకపోయినా మీరు ఒక్కరే వెళ్లి ప్రాజెక్టుపై ఎక్సప్లయిన్ చేశారు ఆ తర్వాత ఏమైంది.. అప్పుడు ఉన్న తెగింపు ఇప్పుడు లేదు ఎందుకు? అప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు ఎందుకు లేదు అని సామ్రాట్ తులసిని అడుగుతాడు..

మీరు ఈ జాబ్ విషయంలో తప్పతే అడుగులు వేయకుండా మీ వేలు పట్టుకుని నడిపించడానికి నేను మీకు అండగా ఉంటాను అని సామ్రాట్ అంటాడు.. ఇక్కడ నందగోపాల్ కూడా అర్హత కలిగి ఉన్నారు.. తన గురించి తెలుసుకోవాలని నేను అనుకోలేదు నాకు తెలిసిన కొన్ని విషయాలు కూడా నాకు ఆసంతృప్తిని మిగిల్చాయి.. అందుకే మిమ్మలిని ఎంచుకున్నాను.. ముందు అయితే జాబ్ లో జాయిన్ అవ్వండి కష్టమైనప్పుడు నాకు చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని సామ్రాట్ అంటాడు..

ఇక తరువాయి భాగంలో తులసి వనం ప్రాజెక్టు గురించి మీతో మాట్లాడడానికి.. అలాగే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాం అని మీడియా వారితో సామ్రాట్ అంటారు.. ముందు మేము కొన్ని ప్రశ్నలు అడగాలి అని మీడియా వాళ్ళు అంటారు.. తులసి గారికి మీకు మధ్యన ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు.. తను మీరు దగ్గరయ్యారని.. త్వరలోనే ఒక్కటి కానున్నారని మాకు తెలిసింది అని వాళ్ళు నేరుగా సామ్రాట్నే ప్రశ్నిస్తారు.. ఇప్పటివరకు మీ భార్య ఎవరో మాకు చెప్పలేదు కనీసం హనీకైనా తన తల్లి గురించి తెలుసా అని వాళ్ళు ప్రశ్నిస్తారు.. సామ్రాట్ ఏం మాట్లాడుతారు తులసి ఎలా రియాక్ట్ అవుతుందో అనేది తర్వాయ భాగంలో చూద్దాం..