Bigg Boss 6 Telugu :బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలదొక్కుకున్నాడు. గ్రాండ్ ఫినాలే కి ముందుగానే టికెట్ సంపాదించుకున్నాడు.. గత సీజన్ లో శ్రీహన్ లవర్ సిరి కూడా బిగ్ బాస్ లోకి వచ్చింది.. ప్రస్తుతం శ్రీహాన్ కి సిరి బయట ఉంది చాలా సపోర్ట్ చేస్తుంది. అయితే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ నిర్వహించే బిబి కేఫ్ లో గెస్ట్ గా పాల్గొనింది సిరి.. ఇక ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన తాజా ప్రోమో ఒకటి బయటకు రావడంతో అది కాస్త చాలా వైరల్ అవుతుంది..

అరియానా ఒక యూట్యూబ్ ఛానల్ వారి థంబ్ నెయిల్ సిరి కి చూపించి మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అంటూ ప్రశ్నించింది.. దీనికి సిరి మాట్లాడుతూ మా మ్యారేజ్ నిజంగానే వచ్చే సంవత్సరం కచ్చితంగా జరుగుతుంది అని క్లారిటీ ఇచ్చింది. అలాగే మరొక యూట్యూబ్ ఛానల్ వాళ్లు పెట్టిన ఓ థంబ్ నెయిల్ చూపిస్తూ.. పెళ్లి కాకుండానే నువ్వు తల్లివి ఎలా అయ్యావు అని సిరిని ప్రశ్నించింది.. దీనికి సిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి నేను తల్లిని ఎప్పుడు అయ్యాను అంటూ .. తన పొట్ట వైపు చూసుకొని అలాంటిది ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చింది.
మరొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన థంబ్ నెయిల్ చూపిస్తూ.. సిరి జ్ఞాపకాలు అన్ని లైఫ్ లో నుండి తీసేసిన శ్రీహన్.. ఇది నిజమేనా అని ఆరియనా అడగగా.. దానికి సిరి చాలా ఎమోషనల్ అయింది. అలాంటిది ఏమీ లేవు. మా వ్యక్తిగత జీవితంలో ఎన్నో గొడవలు జారిగాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం గురించి ఇంకా చాలానే మాట్లాడింది. అది పూర్తి ఇంటర్వ్యూ చూస్తే గాని అర్థం కాదు. ఈ సస్పెన్స్ వల్ల ఆ ఎపిసోడ్ లో సిరి ఇంకా ఏం మాట్లాడింది అనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇక సిరి మాట్లాడిన మాటలు తెలియాలంటే ఆ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే శ్రీహన్ గురించి ఈ సమయంలో సిరి బ్యాడ్ గా చెబితే మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో సిరి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడమే మంచిది అని నెటిజన్స్ అంటున్నారు. ఒకవేళ సిరి ఆ వీడియోలో పాజిటివ్ గా చెబితే అది శ్రీహన్ కి ప్లస్ అవుతుందేమో చూడాలి..