bigg boss 6 telugu : బిగ్ బాస్ హౌస్ లో సమంత విడాకుల టాపిక్.. అనకూడని మాట అనేసిన కంటెస్టంట్.!

bigg boss 6 telugu : టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో సమంత నాగచైతన్య ఒకరు.. ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన విరిద్దరు ప్రేమలో పడ్డారు.. ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. గత ఏడాది అక్టోబర్ లో మేమిద్దరం విడిపోతున్నాము అంటూ వారి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు.. దాంతో వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త గుప్పు మంటుంది.. వీళ్ళిద్దరూ విడిపోవడానికి ఇదే కారణం అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. సమంత నాగచైతన్య లకు సినీ అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీలో కూడా బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు.. కొంతమంది నాగచైతన్యదే తప్పని.. మరి కొంతమంది సమంతది తప్పని.. ఎవరికి తోచినట్టుగా వారు వాదిస్తూ ఉంటారు.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇదే జరిగింది..!!

bigg boss 6 telugu :  బిగ్ బాస్ హౌస్ లైవ్

బిగ్ బాస్ హౌస్ లైవ్ లో ఓ నలుగురు టాప్ కంటెస్టెంట్లు సమంత, నాగచైతన్యాల విడాకుల విషయం ఏదో సందర్భంలో గురించి వచ్చి మాట్లాడుకున్నారట.. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.. ఇందులో ఒక టాప్ కంటెస్టెంట్ అయిన అమ్మాయి సమంతనే అదే కరెక్ట్ అని అంటుంటే.. మరో మేల్ కంటెస్టెంట్ మాత్రం నాగచైతన్యనే కరెక్ట్ అని అన్నాడు.. మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం ఇది మనకు అనవసరమైన టాపిక్ అని.. బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అని వారిద్దరూ వాళ్ళిద్దరినీ హెచ్చరించారు.. దాంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది తప్పని భావించి మౌనంగా ఉండి పోయారు.. అయితే ఈ విషయం గ్రహించిన మా టీవీ యాజమాన్యం వెంటనే ఆ రెండు నిమిషాల సిసి ఫొటోస్ ను డిలీట్ చేసేసిందని ఓ గాసిప్ బయటకు వచ్చింది.. ఈ పుకార్లో నిజమెంతుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది..

bigg boss 6 telugu :  Samantha's divorce topic in the Bigg Boss house
bigg boss 6 telugu : Samantha’s divorce topic in the Bigg Boss house

లైవ్ లో ఈ విషయాలు చర్చించుకోవడం చూసిన కొంతమందిని నెటిజన్స్ ఇది గమనించినట్లు సమాచారం.. మరొకసారి చూసేసరికి వెంటనే ఆ క్లిప్స్ డిలీట్ చేసినట్లు వారు అబ్జర్వ్ చేసినట్లు తెలుస్తోంది.. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్యాలను టార్గెట్ చేస్తూ రకరకాల కథనాలు రాస్తూనే ఉన్నారు.. ఇది కూడా అందులోనే భాగం కావచ్చు లేదంటే నిజంగా కూడా జరిగి ఉండవచ్చు.. ప్రస్తుతం సమంత సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది.. నాగచైతన్య కూడా వరుసగా సినిమాలను చేస్తూ కెరీర్ పై దృష్టి పెట్టారు..

Advertisement