Kiraak RP : జబర్దస్త్ , అదిరింది వంటి షో ల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇతడు కూడా వెళ్లిపోయి అదిరింది షో చేశాడు. కానీ అదిరింది షో టీ ఆర్ పీ రేటింగ్ రాకపోయేసరికి షో కాస్త ఆగిపోయింది. దీంతో జబర్దస్త్ నుంచి వచ్చిన వెంటనే కిరాక్ ఆర్పీ జబర్దస్త్ పై రకరకాల సంచలన కామెంట్లు చేయడంతో ఆయనకి మళ్ళీ జబర్దస్త్ లో అవకాశం లేకపోయింది.

అయితే ప్రస్తుతం ఆదాయానికి గండిపడుతుందని ఆలోచించిన ఈయన సరికొత్తగా రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పేరిట ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి ప్రస్తుతం నెలకు 2 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే తయారు చేస్తున్న వంటలకు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈయన వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజుల్లుతోంది. మొత్తానికైతే రెస్టారెంట్ ద్వారా బాగా సంపాదిస్తున్న కిరాక్ ఆర్పి త్వరలోనే హైదరాబాదులో మరో 15 బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది ఆయన తోటి నటీనటులు అభినందనలు తెలియజేస్తున్నారు.