Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ పరుగులు.. వచ్చేవారం హైలెట్ సీన్ ఇదే..!

Karthika Deepam : సీరియల్ టి ఆర్పి రేటింగ్ కా బాప్ కార్తికదీపం.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ వచ్చినంతగా మరి సీరియల్ కు రాదనడంలో సందేహం లేదు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ నిన్నటి తో 1454 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో గుప్పెడంత మనసు 11.17 రేటింగ్ సొంతం చేసుకుని ఎప్పటి లాగానే మొదటి స్థానంలో నిలిచింది.. ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం..!! దీపను మోనిత మా ఆయన నువ్వు తెచ్చి నాకు అప్పగించాల్సిందే అని మోనిత దీప చెవిలో చెబుతుంది.. మళ్లీ మా ఆయన నా దగ్గరికి తిరిగి వస్తారు అని మోనితతో చెబుతుంది దీప.. డాక్టర్ బాబు రేపు వినాయక చవితి పూజ చేస్తున్నాను.. మీరు తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాను అంట అక్కని కార్తీక్ అంటాడు.. మోనితతో డాక్టర్ బాబు రేపు దీప వాళ్ళింటికి వెళ్దామని అంటాడు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని మోనిత అంటుంది. ఒకటి మనవైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.. లేదంటే దీపైనా మన ఇంటికి రావాలి ఏం చేస్తావో నీ ఇష్టం..

ఈ కండిషన్ కి మోనిత ఒప్పుకోక తప్పదు.. మోనిత దీప ఇంటికి వెళ్తుంది.. ఏంటి అని వంటలక్క ఇంటికి ఈ మామిడి తోరణాలు అని అడుగుతుంది.. నువ్వు మా ఇంటికి ఏ పని లేకుండా ఇక్కడికి రావు కదా.. ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది దీప.. అదే మా ఆయన డాక్టర్ బాబు రేపు మా ఇంట్లో పూజకు రమ్మని పిలవమని చెప్పాడు.. అందుకే వచ్చాను అని మోనిత అంటుంది.. నేను వచ్చిన రాకపోయినా నీకు ప్రతిఫలం దక్కుతుంది అని దీప అంటుంది.. మౌనిత కార్తీక్ ని తీసుకొని బజారుకి వస్తుంది.. అప్పుడే కార్తీక్ కార్ పక్కన ఆపి ఏదో కొనడానికి చూస్తుండగా సౌర్య ను చూస్తాడు.. మౌనిత ఆ పాపను చూసావా అని కార్తీక్ అడుగుతాడు తీరా చూస్తే అక్కడ సౌర్య ఉంటుంది .. కార్తీక్ ను లాక్కోవాల్సిన ఆలోచన వస్తే ఎవరు బాగా చేస్తారో నాకు తెలుసు.. కానీ నాకు కావాల్సింది లాక్కోవడం కాదు.. నా డాక్టర్ బాబు నా దగ్గరికి రావడం.. ఎలా నా నుంచి దూరమయ్యారో.. అలాగే నా దగ్గరికి రావడం వస్తారు.. ప్రమాదం నుంచి ఆయన తప్పించుకునీ నీ దగ్గర ఉండడం.. ఒక రకంగా డాక్టర్ బాబు నీ దగ్గర ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉంది.. యాక్సిడెంట్ తర్వాత ఇంకా ఎక్కడైనా ఉంటే నా డాక్టర్ బాబు ఏమైపోయారో అనుకున్నా.. నువ్వు బాగా చూసుకున్నావ్..

Kartika Deepam Serial TRP Rating Runs
Kartika Deepam Serial TRP Rating Runs

ఇలాగే మేమిద్దరం కలిసి వరకు ఆయనను గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకొమని దీప మోనిత తో అంటుంది.. పగటి కలలు కంటున్నట్లున్నావు దీపక్క అని మౌనిత అంటుంది.. అలాగే కలలు కంటూ ఉండు అని అనగానే.. నేను వచ్చినా రాకపోయినా దానికి తగ్గ ప్రతిఫలం నీకు తగ్గుతుంది.. నువ్వు ఎంతగా ఆలోచించినా నీకు అది అర్థం కాదు అని దీప అంటుంది.. నువ్వు అనుకున్నది మాత్రం జరగదు అని వెళ్ళు అని దీపా మోనిత తో ఉంటుంది. కార్తీక్ సౌర్యని చూసి కార్ పక్కన సౌర్య ను చూస్తాడు.. మౌనిత ఆ పాపను చూసావా అని కార్తీక్ అడుగుతాడు. తీరా చూస్తే అక్కడ సౌర్య ఉంటుంది .. కార్తీక్ సౌర్యని గుర్తుపట్టాడా అని మోనిత మనసులో అనుకుంటుంది.. పాపం కదా తను బొమ్మలు అమ్ముకుంటుంది. మనం తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని అంటాడు.. ఆ బొమ్మలు మొత్తం కొని తనకు హెల్ప్ చేయమని అంటాడు.. గణపతి పూజలో కార్తీక్ పక్కన దీప కూర్చుని పూజ చేస్తుంది.. మీరు నాకు ముందుగానే మాట ఇచ్చారు అని చెబుతుంది. కార్తీక్ కి ఒకపక్క దీప మరోవైపు మౌనిత ఇద్దరూ ముగ్గురూ కలిసి కూర్చొని పూజ చేస్తారు. కార్తిక్ గతం గుర్తుకు రావాలని వేడుకుంటుంది..