KarthikaDeepam 22 Oct Episode : మోనిత పై రోజు రోజుకు అనుమానం పెంచుతున్న దుర్గ నమ్మేస్తున్న కార్తీక్..!

KarthikaDeepam 22 Oct Episode : కార్తీక్ శౌర్య గురించి ఆలోచిస్తూ ఇంటికి వస్తుండగా.. ఆనంద్ ఏడుస్తున్న గొంతు బయటికి వినిపిస్తుంది.. అప్పుడే కార్తీక్ ఇంట్లోకి వచ్చి మోనిత ఎక్కడ ఉందని చూస్తాడు.. ఎదురుగా కూర్చుని ఉన్నా కూడా ఆనంద్ ఏడుస్తున్న గొంతు వినిపించుకునే స్థితిలో లేదు.. మోనిత ఆనంద్ ఏడుస్తున్నాడు.. బాబు ఏడుస్తున్న గొంతు బయటికి వినిపిస్తుంది.. ఇక్కడ ఉన్న నీకు వినిపించడం లేదా అని అంటాడు.. దుర్గ గారు ఎక్కడ ఉన్నారు అని కార్తీక్ పిలుస్తాడు..

Advertisement
KarthikaDeepam 22 Oct today full Episode
KarthikaDeepam 22 Oct today full Episode

ఇంట్లో లేడు అని మోనిత అంటుంది.. వాడు ఇంట్లో ఒక గంట లేకపోతే నువ్వు ఉండలేక పోతున్నావా.. అని కార్తీక్ అనుమానంగా మోనిత ను అంటాడు.. అలా ఆనకు కార్తీక్ అని మోనిత అంటుంది.. అవును కార్తీక్ మైండ్ ఆబ్సెంట్ అయినట్టుగా ఉంది.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనట్టుగా ఉంది..

Advertisement

దానికి కారణం  నువ్వే   నాకు టర్చర్ కనిపిస్తుంది అని మోనిత అంటుంది.. మోనిత నీ దొంగ ఏడుపులు నా దగ్గర నటించకు అని అంటాడు..

కార్తీక్ కాఫీ తాగుతావా పెట్టీ తీసుకురానా అని మోనిత అడుగుతుంది. అప్పుడే దుర్గ వచ్చి కాఫీ సూపర్ ఉంది మోనిత అని అంటాడు.. అది చూసి కార్తిక్ నీమీద నాకు జాలి కలుగుతుంది అంటాడు.. మోనిత కాఫీ పెట్టడంలో సూపర్ అని దుర్గ అంటాడు.. ఇందాక నీమీద నాకు జాలి కలుగుతుంది అన్నా కదా ఇప్పుడు నామీద నాకే జాలేస్తుంది అని కార్తీక్ అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు..

రేయ్ ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోరా అని దుర్గ ను బ్రతిమాలాడుతుంది మోనిత.. ఏంటి బంగారం అలా అంటావు అని దుర్గ అంటాడు.. దుర్గ మాటలు విని కార్తీక్ మనసులో మోనిత పై విపరీతమైన అనుమానం కలుగుతుంది.. మరోపక్క కార్తీక్.. శివ ను దీప ఇంటి ముందు నైట్ కాపలా ఉండమని చెప్పాడు.. ఇదంతా కార్తీక్ ఎందుకు చేస్తున్నాడు.. ఒకవేళ కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చిందా అని ఆలోచిస్తుంది మోనిత..

Advertisement