Karthika Deepam: ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు సౌర్యను తీసుకువెళ్తారు.. సౌర్య కండిషన్ బాగోలేదని తెలుసుకున్న కార్తీక్ సౌర్యకి సెలైన్ పెడతాడు. అంతలో డాక్టర్ వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారా అని దగ్గరకు వచ్చి చూస్తుంది. సౌర్య కు సెలైన్ పెట్టి ఉండడం చూసి ఎవరు పెట్టారని హాస్పిటల్ స్టాఫ్ ని అడుగుతుంది.. కార్తీక్ నేనే పెట్టాను అని చెప్పడంతో కోపం వచ్చిన డాక్టర్.. సౌర్యకు ట్రీట్మెంట్ చేయనని హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్లి పొమ్మని చెబుతుంది..!దీప, కార్తీక్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి తమ పరిస్థితి గురించి చెబుతారు. దీప కష్టం తెలుసుకున్న డాక్టర్ తనకు ఒక బిడ్డ ఉందని మీ బాధ అర్థం అయిందని ట్రీట్మెంట్ చేయడానికి అవసరమైన డబ్బును ఏర్పాటు చేసుకోమని చెబుతుంది.
కార్డియాలజిస్ట్ ధనుంజయ్ గారికి సౌర్యను చూడమని చేస్తుంది. రిపోర్ట్స్ పరిశీలించిన డాక్టర్ ధనుంజయ్ పాప గుండెకి హోల్ ఉందని ఆపరేషన్ చేయాలని.. ఇంతకుముందు పాపకు ఆపరేషన్ ఏమైనా జరిగిందా అనే అడగగా.. హోల్ ఉందని డాక్టర్ కార్తీక్ ఆపరేషన్ చేశారని చెబుతారు. అంత పెద్ద డాక్టర్ మీ పాపకు ఆపరేషన్ చేశారా అని డాక్టర్స్ అడుగుతారు. దీప డాక్టర్ కార్తీక్ వాళ్ళ ఇంట్లో పని మనిషిని అందుకే ఆయన ఆపరేషన్ చేశారు అని చెబుతుంది. ఇప్పుడు కూడా డాక్టర్ కార్తీకే ఈ కేసును డీల్ చేయగలరు..

నావల్ల కాదు.. ఒకసారి ఆపరేషన్ జరిగింది కాబట్టి మళ్లీ ఏమైనా ప్రాబ్లమ్స్. ఎదురైతే నేను ఎదుర్కొన లేను అందుకని ఆయననే పిలిపించి చూపించడం మంచిదని సలహా ఇస్తారు ధనుంజయ్.ఇక దీపా ఏం చెప్పి కార్తీక్ ని ఆపరేషన్ చేయడానికి ఒప్పిస్తుంది. సౌర్య కోసం కార్తీక్ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంటాడా.. ఆపరేషన్ చేసి సౌర్య ను కాపాడుకుంటాడా.. అని తెలియాలంటే రేపటి వరకు వేచి చూడక తప్పదు..