Karthika Deepam Serial : కార్తీక్ సౌర్య ను కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతాడు.. దీప అప్పు తీసుకురావడానికి బయటకు వెళుతుంది.. అంతలో కార్తీక్ సౌర్యను మరో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు.. వాళ్ళను వెతికే పనిలో రుద్రాణి ఫుల్ బిజీగా ఉంటుంది.. రుద్రాణి ఎత్తుగడను తప్పించుకొని దీప సౌర్యను కాపాడుకుంటుందా.!?దీప అప్పు కోసం అడగండి ఇల్లు తొక్కని గడపలేదు. అందులో రుద్రాణి అక్కడకు వస్తుంది.. హిమ ను దగ్గరకు తీసుకోబోగా అరవకు దీప.. అసలే నీరసంగా కనిపిస్తున్నావు..
నువ్వు ఎంత తిరిగినా తాడికొండ తా గ్రామంలో నయాపైసా అప్పు పుట్టదు.. కాదు కాదు అప్పు పుట్టనివ్వకుండా నేను చేశాను. ఎంతమందిని అడుగుతావు అడుగు.. ఎంతమందికి దండం పెడతావో పెట్టు.. ఎంతలా బతిమిలాడతావో బ్రతిమిలాడుకో.. తాడికొండ గ్రామం అంటే గుర్తొచ్చేది ఈ రుద్రాణినే ఇప్పటికైనా మించిపోలేదు దీప డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయించుకో.. దానికి బదులుగా హిమ ను ఇవ్వమని అడుగుతుంది.. కోపం వచ్చినా దీపా అక్కడి నుంచి హిమను తీసుకుని వెళ్ళిపోతుంది.
చాలా సేపు ఎదురు చూసిన తర్వాత డాక్టర్ సౌర్య ఆరోగ్య పరిస్థితి చూసి తనకు ఆపరేషన్ చేయాలని.. అది తన వల్ల కాదుని అది కేవలం డాక్టర్ కార్తీక్ వల్ల మాత్రమే అవుతుంది అని చెబుతాడు. ఇక ఈ విషయం విన్న దీప ఏవిధంగా కార్తీక్ ను ఒప్పించి సౌర్యకు ఆపరేషన్ చేసేలా చేస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.