Karthika Deepam 26 May Today Episode : నిరుపమ్ శోభ ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటే.. హిమ వేసిన ప్లాన్ సెట్ అయిందా.!?

Karthika Deepam 26 May Today Episode : నిరుపమ్ మనసు మార్చి నా మెడలో తాళి కట్టించుకోవాలి. నేను అప్పు చేసి రెయిన్ బో హాస్పిటల్ నిరుపమ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి ఒకేసారి అదే హాస్పిటల్ లో పనిచేసి ఆ అప్పు తిర్చేయాలి. ఎలాగైనా నిరుపమ్ నువ్వు పెళ్లి చేసుకోవాలి అని శోభ అనుకుంటుంది. అర్జంటుగా తనని నా వైపు తిప్పుకోవాలని శోభ ప్లాన్ చేస్తుంది..!నిరుపమ్ శోభతో తన మనసులో ఇంకా హిమే ఉందని..

తన మనసులో కూడా నేనే ఉన్నాను. కాకపోతే ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుందో నాకు అర్థం కావడం లేదు. తనకు దగ్గరవ్వాలంటే తన మనసు నేను సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి అని శోభను అడుగుతాడు.. శోభ సాధారణంగా ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయిని వదులుకుంటే.. తను మరో అమ్మాయికి దగ్గర అయితే తను కుల్లు కుంటుంది. అలా నీకు దగ్గరవుతుంది నువ్వు వేరే అమ్మాయి కి దగ్గరయ్యే తనకి కనిపించు అని అంటుంది.. వెంటనే నిరుపమ్ జ్వాలను తీసుకొని నిరుపమ్ హిమా దగ్గరకు వెళతాడు..

Karthika Deepam Serial 26 may 2022 Today Episode Highlights
Karthika Deepam Serial 26 may 2022 Today Episode Highlights

హిమ కాస్త జలస్ గా ఫీల్ అవుతుంది అనుకొని నిరుపమ్ హోటల్ కు తీసుకువెళతాడు జ్వాలను. ఏం తిందామని నిరుపమ్ అడిగితే ఐస్ క్రీమ్ తిందామని అంటుంది జ్వాల.. చల్ల చల్లగా తింటే ఏం బాగుంటుంది. వేడివేడిగా హాట్స్ ఒకటి తీసుకురా బాగా వేడిగా ఉండాలి అని అంటుంది హిమ. నిరుపమ్ హిమలో ఈర్ష్య మొదలైందని అనుకుంటాడు. కానీ నిరుపమ్ జ్వాల కు దగ్గర అవ్వాలని తను వద్దనుకున్న సంగతి తెలీదు నిరుపమ్ కు.. శోభ విల్లిద్దరిని దూరం చేయడానికి ఎలాంటి ప్లాన్ వేస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.