Karthika Deepam 25 May Today Episode : జ్వాల క్యారెజ్ తీసుకుని డాక్టర్ సాబ్ వాళ్ళ ఇంటికి వస్తుంది.. ఇంటికి కూడా వచ్చేశావా అని అంటుంది స్వప్న.. నాకు పెద్దలంటే గౌరవం మేడమ్ అంటూ తన కాళ్ళు పట్టుకుంటుంది అనుకుంటే.. తన కళ్ళ దగ్గర పడ్డ 500 రూపాయల నోటు తీసి ఇస్తుంది..! అంతలో శోభ అక్కడ కనిపించగా నా చేతి వంట రుచి కూడా చూడు అని అంటుంది జ్వాల..!
సౌందర్య, ఆనందరావు ప్రేమ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ప్రేమ్ వాళ్ళను చూస్తూ కోపంగా మాట్లాడుతాడు. హిమను కావాలని దూరం చేసిందని అనుకుంటాడు. అంతలో సత్యం వస్తాడు. నిరుపమ్ ను హిమ కాదంటుంది అని కలలో కూడా అనుకోలేదు. ఎవరికీ సమాధానం చెప్పలేక పోతున్నాను అత్తయ్య గారు అని సత్యం అంటాడు. ఇంతకీ కారణం ఏమిటో తెలిసిందా అని అడుగుతాడు. లేదని సౌందర్య చెబుతుంది. ఇంటికి వచ్చి సౌందర్య హీమకి చివాట్లు పెడుతుంది.

అయినా ఎందుకు తనను నిరూపమ్ ను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందో ఆ కారణం మాత్రం చెప్పదు..నిరుపమ్ హిమ దూరమైందని బాధపడుతుంటే శోభ హిమకు దగ్గరవడానికి.. నువ్వు మరో అమ్మాయి తో క్లోజ్ గా ఉంటే నీకు కచ్చితంగా దగ్గరవుతుందని సలహా ఇస్తుంది. నిరుపమ్ జ్వాల కి దగ్గర అవుతున్నట్టు హిమ దగ్గర యాక్ట్ చేస్తాడు.. శోభ ఈ ఐడియా నాకు వర్కౌట్ అవుతుంది. నిరుపమ్ నాకు క్లోజ్ అవుతాడు అనుకుంటే జ్వాలాకి దగ్గర అయ్యడేంటి అని బాధపడుతుంది..