Karthika Deepam 20 May Today Episode: పోలీసుల దగ్గర సౌందర్య నిల్చుని వుండగా జ్వాల వచ్చి సీసీ ఏంటి ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతుంది. నాకు వేరే పని ఉంది లేవే అయినా నువ్వు ఏంటి ఎప్పుడు చూసినా నన్ను ఫాలో అవుతున్నావు.. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా.. కావాలని నువ్వు నేను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నావా అని సౌందర్య అడుగుతుంది.. నేను తిరిగే దారి నువ్వు తిరిగే దారి రెండు ఒకటే కదా సీసీ.. అందుకే ఒకరికొకరు ఎదురు పడుతున్నాము అని అంటుంది జ్వాల..హిమ జ్వాల వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ బాబాయి పిన్ని ఇద్దరూ డబ్బులు దగ్గర గొడవ పడుతూ ఉంటారు.
వీళ్లకు నేను ఏదైనా సహాయం చేయాలి అని అనుకుంటుంది. అంతలో జ్వాల వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది నాకు వంద పనులు ఉంటాయి. అవి నీకు అవసరమా అని అంటుంది జ్వాల. నానమ్మ పొద్దున్నే ఎక్కడికో వెళ్ళింది. జ్వాల కూడా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది. అంటే ఒకరికి ఒకరు తెలిసిపోయరా.. జ్వాలాకి నేనెవరో తెలిసి కావాలని ఇలా చేస్తుందా.. నేనే ముందు వచ్చి తనతో మాట్లాడాలి అని అనుకుంటుందా అని అనుకుంటూ.. ఛాఛా జ్వాల అలాంటిది కాదు అని అనుకుంటూ ఉంది మనసులో హిమ.ఏంటి నిరూపమ్ నువ్వు ఇంకా హిమ గురించి ఆలోచిస్తున్నావు నిన్ను వద్దు అనుకుందిరా..

నువ్వు పౌరుషంగా ఉండాలి. కానీ తన గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడితే ఎలాగా.. నీకు ఆ విషయం చెప్పాలి నిరుపమ్.. నేను మీ నాన్న ఎందుకు విడిపోయామో నీకు తెలియదు కదా. మీ నాన్న నాతో పెళ్లి కాక ముందు ఒక అమ్మాయిని ప్రేమించారట. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు నాకు సత్యమే కావాలని అడిగిందట.. నాకు పెళ్లి చేస్తే వాళ్ళతో నేను పిల్లల్ని కను అని శబ్దం చేసిందట. కొన్నాళ్ల తర్వాత మీ డాడీ ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా.. ఇద్దరు పిల్లల్ని మీ డాడీ తోనే కనింది.. అని చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది స్వప్న.. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.