Karthika Deepam 19 May Today Episod : జ్వాలను ను బయటకు తీసుకు వెళ్ళిన సౌందర్య మీ నాన్న ఎవరో చెప్పవే అని అడుగుతుంది.. అసలు నువ్వు ఏమవుదాము అని అనుకున్నావు అని అడిగితే.. జ్వాల చిన్నప్పుడు కలెక్టర్ అవుదామని అనుకున్నాను అని అంటుంది.. మీ నాన్నకు అసలు బుద్ధుందా నీ చేత ఆటో నడిపిస్తున్నాడు ఏంటి అని సౌందర్య అంటుండగా.. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం.. ఆయన ఇప్పుడు లేడు చనిపోయారు అని చెబుతుంది.. ఆ మాట విన్న సౌందర్య తన పై జాలి చూపే ప్రయత్నం చేయబోగా.. నాకు ఈ జాలి లాంటివి చూపించడం ఇష్టం ఉండదు అని ప్రవచనాలు బోధిస్తుంది సౌందర్య కు.. జ్వాల ను చూస్తూ సౌందర్య నిన్ను చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది..
నీ మాటలు నన్ను చాలా ఆనంద పరిచాయి అని చెబుతుంది.సత్యం వాళ్ళింటి మేడపైన నిల్చుని వుండగా స్వప్న వాళ్ళ ఇంటికి రావడం చూస్తాడు. పరుగుపరుగున స్వప్న రా ఇంట్లో కి వెళ్దాం అని అంటాడు. నేను ఇంటి దాకా వచ్చాను కానీ ఇంటి లోపలికి రాను. మన పెద్ద కొడుకు నిరుపమ్ పెళ్లి గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. అయిందేదో అయిపోయింది ఇక హిమ గురించి ఆలోచించడం మర్చిపోండి. నేను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసాను. మీరు మళ్ళీ నిరుపమ్ హిమను కలిపే ప్రయత్నం చేయకండి అని చెబుతుంది.

సౌందర్య కు ఎవరో ఫోన్ చేశారని మళ్లీ కాల్ బ్యాక్ చేస్తుంది.. ఎవరు మాట్లాడారు ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా అని అడుగుతుంది.. నానమ్మ అని పిలుస్తుంది.. నానమ్మ నేను సౌర్యని అని చెబుతుంది.. హిమ ను పిలిచి సంతోషంతో సౌందర్య సౌర్య ఫోన్ చేసిందని చెబుతుంది. స్వప్న వచ్చి సౌందర్యతో ఈ రోజు నుంచి నా కొడుకుని నాకు వదిలేసి సౌర్యం వెతికే పని చూసుకో.. అది ఎక్కడ ఉన్నా నేను వెతికి పట్టుకుంటాను అని సౌందర్య అంటుంది. నీ అదృష్టం బాగుండి సౌర్య ఇంటికి వస్తే దయచేసి నా ఇంటి కోడలిగా మాత్రం చేస్తాను అని చెప్పకు అని స్వప్న అంటుంది..