Karthika Deepam 18 May Today Episode : జ్వాలా క్యారెజ్ తీసుకుని సత్యం సార్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. అంతలో సత్యం హిమ ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు.. ప్రేమ్ ఈ విషయం జ్వాలాకి చెప్పద్దన్న మాటలు గుర్తొచ్చి జ్వాల ఎంత అడిగినా అసలు ఏం జరిగిందో చెప్పడు.. సత్యం సార్ కి నేనంటే ఇష్టమే నన్ను ఓ ఆటో అమ్మాయిగా బాగానే చూసుకుంటున్నాను అదే కోడలు అయితే నన్ను ఒప్పుకుంటారా అని మనసులో అనుకుంటుంది..
సత్యం సార్ కి డాక్టర్ సాబ్ ను ప్రేమిస్తున్న చెబితే ఎలా రియక్టు అవుతారో అని ఆలోచిస్తుంటుంది జ్వాల..జ్వాల ఆటోలో వెళ్తుండగా దారిలో వాళ్ళ నానమ్మ కార్ కనిపిస్తుంది. నానమ్మ ఎక్కడికి వెళ్తుందో గమనించి ఈరోజు ఎలాగైనా తన ఫోన్ నెంబర్ సంపాదించాలి అని అనుకుంటుంది. ఒక ముసలావిడ దగ్గరకు వెళ్లి పలకరించి వస్తూ ఉండగా సౌందర్య తన కారులో జ్వాలను ఎక్కించి బయటకు తీసుకు వెళుతుంది. మీ నాన్న ఎవరో నాకు చెప్పు అని అడుగుతుంది. అసలు వాడు మనిషేనా కూతురు తో ఇలాగా ఆటో డ్రైవింగ్ చేపిస్తున్నాడు అని సౌందర్య చెడామడా తిడుతుంది..

జ్వాల మా నాన్న అంటే నాకు చాలా గౌరవం అని అంటుంది..జ్వాల వాళ్ళ నానమ్మ సౌందర్య నంబర్ ఎలా గోల సంపాదించి తను కు ఫోన్ చేస్తుంది.. సౌందర్య హలో హలో అంటున్నా జ్వాల ఏం మాట్లాడదు.. కోపం వచ్చిన సౌందర్య ఎవరో మాట్లాడరేంటి అని అంటుంది.. నానమ్మ అని పిలుస్తుంది జ్వాల. ఎవరు అనగానే మర్చిపోయావా నానమ్మ నేను సౌర్య అంటుంది జ్వాల.. ఇక సౌందర్య ఏం మాట్లాడుతుందో.. ఎలా రియాక్ట్ అవుతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..