Sunday, May 22, 2022

Karthika Deepam 14 May Today Episode : జ్వాలకి ఐ లవ్ యూ చెప్పిన నిరుపమ్.. హిమ చెంప పగలగొట్టిన సౌందర్య..!

Karthika Deepam 14 May Today Episode : హిమ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయడంతో స్వప్న, ప్రేమ్ సంతోషిస్తారు.. స్వప్న కి అవకాశం దొరకడంతో సౌందర్యను చెడామడా వాయిస్తుంది.. నన్ను నా కొడుకుని ఇలా అందరి ముందు అవమానం పాలు చేసింది మీ మనవరాలు.. అది నష్ట జాతకురలని నేను మొదటినుంచి మొత్తుకుంటూనే ఉన్నాను.. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా.. నా కొడుకు జీవితాంతం ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందని భరించాలని.. స్వప్న సౌందర్య పై ఫైర్ అవుతుంది..హిమ వాళ్ళ అమ్మనాన్న ఫోటో ముందు నిల్చోని మీకు ఇచ్చిన మాటను నేను నిలాపెట్టుకున్నాను..

ఈరోజు నా ప్రేమను త్యాగం చేసి సౌర్యకి ఇచ్చాను.. నాకు కూడా మొన్నే తెలిసింది సౌర్య మనసులో నీరూపమ్ బావ ఉన్నాడని.. ఆరోజు రెస్టారెంట్లో సౌర్య నిరుపమ్ బావ ఫోన్ నెంబర్ ను నా మొగుడు అని సేవ్ చేసుకుంది.. అప్పుడే నాకు అర్థమైంది సౌర్య నిరూపమ్ బావను ఇష్టపడుతుందని.. అందుకే నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను.. తన ఆనందం కంటే నాకు ఏ ఆనందము అవసరం లేదు.. నాకు ఇష్టమైన బావ ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. నిరుపమ్, జ్వాల పెళ్లి చేయడమే నా జీవిత లక్ష్యం అని హిమ అంటుంది..హిమ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసిందన్న కోపంతో సౌందర్య ఇంటికి వస్తుంది..

karthika deepam serial 14 may 2022 today episode highlights
karthika deepam serial 14 may 2022 today episode highlights

ఏమైందే హిమ నీకు చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేశావు అంటూహిమ చెంప పగలగొడుతుంది.. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా.. పెళ్లంటే తమాషాలు అనుకుంటున్నావా.. ఎందుకు ఆఖరి నిమిషంలో కావాలని పెళ్లి క్యాన్సిల్ చేశావు అని అడుగుతుంది.. హిమ నాకు ఇష్టం లేదు అంతే అని అంటుంది.. అదే ఎందుకు అని హిమను సౌందర్య నిలదిస్తుంది.. ఇక నిరుపమ్ హిమ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసిందన్న బాధతో తప్పతాగి కార్ లో ఉండడం చూసి జ్వాల డాక్టర్ సాబ్ అంటూ బయటికి తీసుకు వస్తుంది.. జ్వాల నేనంటే నీకు ఇష్టం కదా.. ఐ లవ్ యూ జ్వాల అని అంటాడు..

Related Articles

- Advertisement -

తాజా వార్తలు