Sunday, May 22, 2022

Karthika Deepam 13 May Today Episode : హిమ నిరుపమ్ తో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఇదేనట..!

Karthika Deepam 13 May Today Episode : నిరుపమ్, హిమలా నిశ్చితార్థం వేడుక గుడిలో జరుగుతుంది.. కానీ హిమ మనసులో ఏదో కలవర పాటు పడటం సౌందర్య, నిరుపమ్ గమనిస్తారు. ఏమైంది అని అడిగితే ఏం లేదనట్టుగా సమాధానం చెబుతుంది.. ఇక స్వప్న ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడానికి సత్యం దగ్గరున్న ఉంగరాలను మాయం చేస్తుంది.. దాంతో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అనుకునే సమయానికి సౌందర్య ఇలాంటిదేదో జరుగుతుందని.. నేను ముందుగానే ఊహించి నేను కూడా ఉంగరాలు కొన్నాను అని చెప్పి స్వప్నకు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది..!

జ్వాల ప్యాసింజర్ ను ఆటోలో ఎక్కించుకుని నిరుపమ్, హిమలా నిశ్చితార్థం జరుగుతున్న గుడి దగ్గరకు వస్తుంది.. మళ్లీ రిటర్న్ వచ్చేవరకు ఉండమని ఆమె చెప్పడంతో సరే వెయిట్ చేస్తాను కానీ ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వాలి అని అంటుంది.. ఆమె వచ్చేవరకు డాక్టర్ సాబ్ ఫోటోని చూస్తూ.. మీరంటే నాకు చాలా ఇష్టం.. మిమ్మల్ని నన్ను ఎవరిని దూరం చేయలేరు అని అనుకుంటూ ఉంటుంది.. ఇక ఆ ప్యాసింజర్ ఈ గుడికి ఒక ఎంగేజ్మెంట్ కోసం అని వచ్చామనీ.. చివరి నిమిషంలో ఆ అమ్మాయి పెళ్లి ఇష్టం లేదని చెప్పిందనీ.. అందుకని ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందని చెబుతారు.. ఆ అమ్మాయికి బుర్ర లేదా చివరి నిమిషం వరకు ఏం చేస్తుంది అని అంటుంది జ్వాల..

Karthika Deepam Serial 13 May 2022 Today Episode Highlights
Karthika Deepam Serial 13 May 2022 Today Episode Highlights

హిమ ఆఖరి నిశ్చితార్థం లో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ.. సారీ బావా అని చెప్పి అక్కడి నుంచి ఇంటి వచ్చి.. వాళ్ళ అమ్మనాన్నల ఫోటో ముందు నిల్చుని ఏడుస్తూ.. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సౌర్య కోసం నా ప్రాణం అడ్డు వెద్దాం అనుకున్నాను.. కానీ ఈ రోజు నా ప్రేమను అడ్డు వేసాను.. సౌర్య మనసులో ఏముందో నాకు ఈ రోజే తెలిసింది.. అని హిమ వాళ్ళ అమ్మనాన్నల ఫోటో ముందు నిల్చుని చెబుతుంది.. అంటే జ్వాల మనసులో డాక్టర్ సాబ్ ఉన్నాడని హిమ తెలుసుకుందా.!? ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..!

Related Articles

- Advertisement -

తాజా వార్తలు