Karthika Deepam : కార్తీక్, దీపలకు అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్న ఇంద్రుడు..! వచ్చేవారం హైలెట్ సీన్ ఇదే..!

Karthika Deepam : కార్తీకదీపం బుల్లితెర బాహుబలిగా పేరు తెచ్చుకుంది కార్తీకదీపం.. ఈ సీరియల్ కి వచ్చినంత టీఆర్పీ రేటింగ్ మరే సీరియల్ కి రాదు అనండంలో సందేహం లేదు.. కార్తీక్, వంటలక్క ఈ సీరియల్ ను రేంజ్ లోకి తీసుకెళ్లారు.. వీళ్ళిద్దరూ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ మళ్ళీ పుంజుకుంది.. 1500 ఎపిసోడ్స్ కు చేరువలో ఉన్న ఈ సీరియల్ ను ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తుననారని చెప్పాలి.. వచ్చేవారం ఎలాంటి ట్విస్టులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..!

Advertisement
karthika deepam indrudu twist to karthik deepa
karthika deepam indrudu twist to karthik deepa

ఇంద్రుడిని చూడగానే దీప గుర్తుపట్టి కార్తీక్ డాక్టర్ బాబు మనం వెతుకుతుంది ఇతని కోసమే అని చెబుతుంది .. ఇతని ఆటోమే మనం ఎప్పటి వరకు ఫాలో అయ్యాము అని అంటుంది. అయ్యో మేడం నేను దొంగను కాదు.. ఎప్పుడో నేను దొంగతనం చేయడం మానేశాను.. దయచేసి నన్ను పోలీసులకు పట్టించకండి అని ఇంద్రుడు అంటాడు.. నేను నిజంగా కావాలని ఈ తప్పు చేయలేదు.. నేను దొంగతనం చేయడం ఎప్పుడో మానేశాను అని ఇంద్రుడు చెబుతాడు.. మరోవైపు కార్తీక్ నిన్ను దొంగతనం చేసావని ఎవరన్నారు.. అలాగే ఇంకోసారి నువ్వు దొంగతనం చేశాను అని అంటే పోలీసుల నీ దగ్గరికి వచ్చి నిన్ను పట్టుకెళ్తారు అని అంటారు..

Advertisement

జ్వాలా ఫంక్షన్ చేయడానికి డబ్బులు ఎలా సంపాదించాలని ఇంద్రుడు ఆలోచిస్తూ ఉంటాడు.. డాక్టర్ బాబు మనం ఎప్పటినుంచో వెతుకుతుంది ఈ ఆటోనే డాక్టర్ బాబు అంటూ ఇంద్రుడిని చూపిస్తూ దీప చెబుతుంది.. నా ఆటో వెనుక ఆ బోర్డ్ రాసింది మా జ్వాలమ్మ అని ఇంద్రుడు అంటాడు.. మా జ్వాలమ్మ పెద్దమనిషి అయ్యింది అని దీపతో చెబుతాడు.. తనకి ఫంక్షన్ చేయడానికి బట్టలు, నగలు లేవు.. అందుకోసమే ఈ దొంగతనం చేయాలని అనుకున్నాను అని చెబుతాడు.. అయితే పద వంటలక్క అని బట్టల షాప్ కి తీసుకు వెళ్తాడు కార్తీక్.. డాక్టర్ బాబు, వంటలక్క అంటే వీళ్లిద్దరే మా జ్వాలమ్మ అమ్మానాన్నలు అని ఇంద్రుడు అనుకుంటారు.. త్వరగా పదా అని దీప ఇంద్రుడు తో అంటుంది.. ఎక్కడికి అని అడిగితే ఇంకెక్కడికి మీ పాపని చూడటానికి పెద్దమనిషి అయింది అని చెప్పావు కదా అని కార్తీక్ అంటాడు.. ఇప్పుడు వద్దు మా చుట్టాలని ఈరోజు ఇంటికి రావద్దు అని చెప్పాము మీరు కూడా రేపు రండి అని ఇంద్రుడు అంటాడు.. అదేంటి అలా అంటావు అని అంటాడు

. రేపు స్నానం చేయించి ఫంక్షన్ చేస్తాము రేపు మీరు రండి అని ఇంద్రుడు అంటాడు.. దీప సరే అని అంది.. ఈ ఊరు మాకు కొత్త రేపు ఇక్కడే ఉంటాము.. నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళమని ఇంద్రుడితో చెబుతుంది దీప.. మరోవైపు జ్వాలను ప్రేమగా పెంచుకున్న ఇంద్రుడు తన తల్లిదండ్రులను తనకి పరిచయం చేయాలని అనుకోడు.. ఎక్కడ జ్వాలను తన నుంచి దూరం చేసేస్తారో అని ఆలోచన ఇంద్రుడికి కలుగుతుంది .. అందుకే వీళ్ళని రాకుండా చేయాలని అనుకుంటాడు ప్రస్తుతానికి అయితే తీసుకు వెళ్ళలేదు.. కానీ రేపు మాత్రం దీప వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు..

వాల్తేరు వాణి దీప ఇంటిపై నిప్పు అంటించడం చూసిన దుర్గ తన దగ్గరకు వచ్చి నువ్వు పోసింది పెట్రోల్ కాదు నీళ్లు అని దుర్గా అంటాడు.. వాల్తేరు వాణి దుర్గ మాటలు షాక్ అవుతుంది.. నాకు నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు డౌట్ కొడుతూనే ఉంది.. అయినా నేను నీలాంటి ఆడవాళ్ళకి దూరంగా ఉంటాను .. నీకు దగ్గరైనట్టు నటించింది ఎందుకో తెలుసా.. నువ్వు దీపమ్మను కాపాడుతావు అని అనుకున్నాను.. కానీ నువ్వు ఎప్పుడైతే పోలీసులను చూసి దాక్కున్నావో.. నాకు అప్పుడే అనుమానం వచ్చింది.. నువ్వు తేడా క్యాండెట్ అని అనుకున్నా.. అందుకే నీ మీద ఓ కన్నేసి ఉంచాను.. నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారు అని వాల్తేరు వాణి ని దుర్గా అడుగుతాడు.. ఆ మోనితనే కదా అని అడుగుతాడు అని అంటాడు.. దీప నొక్క దాన్నేనా.. నన్ను కూడా చంపేమని చెప్పిందా అని వాణి నీ అడుగుతాడు.. ఇద్దరినీ చంపేయమని చెప్పింది అని వాల్తేరు వాణి చెబుతుంది.

మోనిత దగ్గరకు వెళ్లి ఏంటి ఇంకా దీపమ్మ ముగ్గేస్తుందని చూస్తున్నావా.. నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు ఆ వాల్తేరు వాణి నాకు మొత్తం చెప్పేసింది అని దుర్గా అంటాడు.. దానికి నాకు సంబంధం ఏంటి అని మోనిత ఓట్రిస్తుంది.. నీ మీద పోలీసులకు చెప్పనా.. అప్పుడు అటెంప్ట్ టూ మర్డర్ కేసు కింద నిన్ను బొక్కలో కూర్చోబడతారు.. అప్పుడు నిజాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి అని మోనిత తో దుర్గా అంటాడు.. పోని ఈ విషయం కార్తీక్ సార్ తో చెప్పినా అని అంటాడు దుర్గ.. ఏ విషయం అంటూ కార్తీక్ వస్తాడు.. మీకు అసలు పగలు రాత్రి అన్న తేడా లేదా పొద్దున్నే మొదలెట్టేసారా అని మోనితను అడుగుతాడు కార్తీక్.. అది కాదు కార్తీక్ అని చెప్పబోతుండగా ఇక నువ్వు మారవు అని మోనిత పై విసుకుని కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. తరువాయి భాగంలో కార్తీక్ దీప ఇద్దరూ కలిసి సౌర్యను చూడడానికి వెళ్తారు.. కార్తీక్ వాళ్ళు ఎలాగోలా అడ్రస్ కనుక్కొని సౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు.. మరోవైపు శౌర్య పుష్పావతి ఫంక్షన్ను చాలా గ్రాండ్గా చేస్తాడు ఇంద్రుడు.. ఆ ఫంక్షన్ లో శౌర్య తన అమ్మానాన్నలను చూస్తుందా లేదా అనేది చూడాలి.. అయితే ఇంద్రుడు శౌర్య ను ఇవ్వడానికి ఒప్పుకోడు.. అదే ఊహించని ట్విస్ట్..

Advertisement