కార్తీక్ ను మోనితకు అప్పగించిన దీప..! వారణాసి ఎంట్రీ ఇచ్చాడుగా..

సౌందర్య ఆనందరావుతో మోనిత ను కలిసిన విషయం గురించి మాట్లాడుతుంది.. మోనిత మనల్ని చూడగానే బాధపడుతూ మన దగ్గరకు రాలేదు తను చాలా కూల్ గా రియాక్ట్ అయింది అంటే.. కచ్చితంగా మళ్ళీ ఏదో తప్పు చేస్తుందండి.. కచ్చితంగా కార్తీక్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసు అని అనిపిస్తుంది.. కార్తీక్ చనిపోయినప్పుడు తను తెల్లచీర కట్టుకొని వచ్చింది.. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం రంగు చీర కట్టుకొని వచ్చింది.. కచ్చితంగా ఏదో జరుగుతుంది.. మోనిత మళ్లీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని సౌందర్య అంటుంది..

Karthika Deepam 30 August 2022 today episode Highlights
Karthika Deepam 30 August 2022 today episode Highlights

సౌర్యా దగ్గరకు వారణాసి వస్తాడు ఏంటి వారణాసి తాతయ్య నిన్ను ఎక్కడికి పంపించారా అని సౌర్యా అడుగుతుంది.. లేదు శౌర్య నేనే నీకోసం వచ్చాను అని అంటాడు.. తాతయ్యకు నేనంటే చాలా ప్రేమ.. కచ్చితంగా నిన్ను తాతయ్యే ఎక్కడికి పంపించాడు అని అనుకున్నాను.. అందుకే అడిగాను అని అంటుంది.. లేదు సౌర్యా నేనే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను అని వారణాసి అంటాడు.. శౌర్య వాళ్ళ బాబాయ్ పిన్ని పిలిచి వారణాసిని పరిచయం చేస్తుంది.. ఇప్పటి నుంచి ఇతను కూడా మనతోనే ఉంటాడని శౌర్య చెబుతుంది..

డాక్టర్ బాబుని చూసిన దీప తనని ఫాలో అయ్యే తను ఉంటున్న చోటుకు వెళుతుంది.. డాక్టర్ బాబు అని దీప కార్తీక్ తో మాట్లాడుతుండగా ఎవరు కార్తీక్ అని మోనిత లోపల..
నుంచి బయటకు వస్తుంది. మోనిత ను చూసిన దీప కోపంగా.. నాకు తెలుసే డాక్టర్ బాబు నీ దగ్గరే ఉన్నారని నాకు అనుమానం రాకుండా ఉండాలని.. ఫోటో పట్టుకొని నా ముందు యాక్షన్ చేస్తున్నావా అని దీప మోనితను అడుగుతుంది.. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. నాకు నమ్మకం కలిగాక నీ సంగతి చూద్దామని ఆగాను కార్తీక్ తన మాటలు ఏమీ పట్టించుకోకు పదా లోపలికి అని అంటుంది.. మోనిత ఒక్క అడుగు ముందుకు వేసావంటే నీ ప్రాణాలు తీస్తాను.. తను ఏదో పిచ్చిది.. అలా వాగుతుంది.. కార్తీక్ ఆవిడ తో నీకు ఏం పని.. నిజంగా ఆవిడ నీకు తెలీదా.. నిన్ను పేరు పెట్టి పిలుస్తుంది నన్ను డాక్టర్ బాబు అని అంటుంది నిజంగా ఈవిడెవరో నీకు తెలియదా అని కార్తీక్ మౌనితను నిలదీస్తాడు.. అసలు ఆవిడ ఎవరు నువ్వు ఎవరు నేనెవరు అని కార్తీక్ అడుగుతాడు.. ఏం జరుగుతుంది మౌనిత ఇక్కడ అని కార్తీక్ అడుగుతాడు.. ఏంటి కార్తీక్ నువ్వు.. పేరు పెట్టి పిలిస్తేనే ఏదో జరిగిపోతుంది అని అంటావు అని మోనిత అంటుంది.. ఇలాంటి వాళ్ళు డబ్బులు కోసం వస్తూనే ఉంటారు అని మౌనిత అంటుంది ఎవరే డబ్బులు కోసం వచ్చింది నేను నా భర్త కోసం నా మాంగళ్యం కోసం వచ్చాను అని దీప ఉంటుంది..

డాక్టర్ బాబు నా భర్త.. నాకోసం నా డాక్టర్ బాబు వస్తాడు.. మొన్న ప్రమాదంతో మీరిద్దరూ చచ్చి బ్రతికారు.. ఆ ప్రమాదంతో మీ జీవితాలు ముగిసిపోయాయి ఇప్పుడు కార్తీక్ మరో జన్మ ఎత్తినట్లే అది నా కోసమే.. ఇంకా నా కార్తీక్ నీ సొంతం కాదు అని మౌనిత అంటుంది.. అవుతాడు అని దీప గట్టిగా వాదిస్తుంది.. మా అనుబంధమే ఆయనకు అన్నీ గుర్తుకు వచ్చేటట్లు చేస్తుంది.. అంతవరకు నువ్వు నా డాక్టర్ బాబు ని జాగ్రత్తగా చూసుకో అని దీప మోనిత కు కార్తీక్ ను అప్పగిస్తుంది మిగతా విశేషాలు రేపటి ఎపిసోడలో చూద్దాం..

Advertisement