Karthika Deepam 29 Nov Episode : సౌందర్య తలకి గన్ గురిపెట్టిన మోనిత.! దీప కోసం కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్.!

Karthika Deepam 29 Nov Episode : డాక్టర్ బాబు శౌర్యని ఎలాగైనా వెతకాలి.. ఒకవేళ ఈ సర్జరీ తరువాత నాకు జరగరానిది ఏమైనా జరిగితే నువ్వు శౌర్యని చూసుకుంటావు కదా అని దీప అడుగుతుంది. అలా మాట్లాడకు దీప నీకు అంతా మంచే జరుగుతుంది.. నేను ఉన్నాను కదా అని కార్తీక్ అంటాడు. ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు మీరు నాతో ఎక్కువ ప్రేమగా ఉంటున్నారు. అదే మీకు గతం గుర్తుకు వచ్చి ఉంటే మీరు నా మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తారు.. ఇసుమంతా మీ ప్రేమ కొండంత ధైర్యాన్ని నాకు ఇస్తుంది. ఇలాంటి ఆపరేషన్లు కూడా ఏమీ అవసరం లేకుండానే మీ ప్రేమతో నా ఆరోగ్యం నయమైపోతుంది. కానీ నాకు మీ ప్రేమ దక్కడం లేదు అని బాధపడుతుంది దీప. నువ్వు ఏమీ బాధపడకు నేను నీకు ధైర్యంగా ఉంటాను. ఆ దేవుడు అండగా ఉంటాడు. నీకు అంతా మంచే జరుగుతుంది అని కార్తీక్ అంటాడు.

Advertisement
karthika-deepam-29-nov-today full episode
karthika-deepam-29-nov-today full episode

మరోవైపు సౌందర్య శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. నిన్న శౌర్య ఆచూకీ చెబుతామన్నా ఆవిడ ఇంటికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు వాళ్లు కూడా నిన్న ఆవిడ ఏదైతే చెప్పిందో అది చెప్పడంతో సౌందర్యకు అనుమానం వస్తుంది. కచ్చితంగా దీని వెనకమాల ఇంద్రుడి హస్తం ఉందని సౌందర్య గ్రహిస్తుంది. మీరు ఇలా చెబుతున్నారు నిన్న కూడా ఇక్కడ ఉన్న ఆవిడ ఇలాగే చెబుతుంది. కచ్చితంగా మీ వెనకమాల ఇంద్రుడు ఉండి ఇదంతా చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. సౌందర్య ఆవిడని బెదిరిస్తుంది. కానీ ఆవిడ మాత్రం నిజంగా మేము మీ ఇంట్లోకి అద్దెకు వచ్చాము కావాలంటే ఇంటి ఓనర్స్ ని అడగమని చెబుతుంది. సౌందర్య ఆవిడ తో మీరు ఇలాగే చేస్తే కచ్చితంగా మీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. నా మనవరాలు దొరికేంతవరకు నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. మీరు నాకు నిజం చెప్పి తీరాల్సిందే అని సౌందర్య అంటుంది. ఇక సౌందర్య వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఆవిడ ఇంద్రుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబుతానని బెదిరిస్తుంది అని చెబుతుంది. నువ్వు అలాంటివి ఏమీ పట్టించుకోకు నేనున్నాను కదా అని ఇంద్రుడు ఆమెకు ధైర్యాన్ని ఇస్తాడు.

Advertisement

కార్తీక్ ఫార్మాలిటీస్ అన్ని ఫీల్ చేసి మెడిసిన్ తీసుకువచ్చే లోపు దీప తన బెడ్డుపై ఉండదు. ఎక్కడికి వెళ్లిందని హాస్పిటల్ అంతా వెతుకుతాడు కానీ దీప కనిపించదు. దీప ఎక్కడో రోడ్డు పక్కన చెట్లలో పడి ఉంటుంది. అటుగా ఆటోలో వెళుతున్న ఇంద్రుడు సౌర్య ఆటో అతను ఎవరో పడిపోయారని చెబుతాడు. ఇంద్రుడు దీప చూసినా కానీ ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు ఇంద్రుడు ఒడిలో ఉన్న శౌర్య ఎవరు బాబాయ్ అని అడుగుతుంది. కానీ ఇంద్రుడు దీప మీద కనికరం లేకుండా ముందుకు ఆటో పోనివ్వమని చెబుతాడు.

ఇక రేపటి ఎపిసోడ్ లో కార్తికే వెతుక్కుంటూ వచ్చి దీపను తీసుకు వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. కార్తీక్ వాళ్ళను వేతుకుంటూ మోనిత ఇంటికి వెళుతుంది సౌందర్య కార్తీక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పమని అడుగుతుంది అంతలో సౌందర్యాన్ని ఆ రూంలో పెట్టి మోనిత లాక్ చేస్తుంది తలుపు తీసుకుని సౌందర్య బయటకు వచ్చేసరికి మోనిత సౌందర్య తలకి గన్ గురిపెడుతుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Advertisement