Karthika Deepam 26 Nov Episode : దీప ఆరోగ్యం విషమం.. నాకు గతం ఎప్పుడో గుర్తోచిందన్న కార్తీక్.. ప్చ్ ఇదంతా కల..!?

Karthika Deepam 26 Nov Episode : దీప నీ నమ్మకం చూస్తుంటే.. గతం తెలియని నాకు వర్తమానం లో మాత్రం నువ్వే నా భార్య అనిపిస్తుంది. నేను నీ భర్తను అనుకో దీప అని అంటాడు. ఇద్దరు కలిసి శౌర్య ఇద్దరు కలిసి శౌర్య ను వెతుకుతుంటారు. అప్పుడే సౌందర్య హిమ వాళ్ళు మరోపక్క శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు.. ఎదురుగా ఇంద్రుడు చంద్రమ్మ ఇద్దరూ కలిసి శౌర్యతో పాటు నడుచుకుంటూ వస్తారు.. వాళ్లంతా ఎదురుపడతారు. నువ్వు నాకోసం రాలేదేంటి అని శౌర్య వాళ్ళ నానమ్మ ను అడుగుతుంది. మీరు ఇల్లు ఖాళీ చేశారు కదా అని సౌందర్య అంటుంది.. నువ్వే కదా ఆ రోజు రానని చెప్పావంట అని శౌర్య అంటుంది.. ఓహో నీకు ఇలా చెప్పాడా? వీడు నీ దగ్గర నిన్ను అతని దగ్గరే ఉంచుకోవడానికి ఇలా కుట్రలు పన్నుతున్నాడు.. మీ అమ్మానాన్న నిన్ను కలవడానికి వస్తే కలవనివ్వకుండా చేశాడు..

karthika-deepam-26-nov today full episode
karthika-deepam-26-nov today full episode

ఈ విషయాలన్నీ నీకేం తెలియదు శౌర్య.. కావాలంటే అతని చెప్పమను.. రేయ్ నిజం చెప్తావా చంపే మంటావా అని ఇంద్రుడిని సౌందర్య బెదిరిస్తుంది.. క్షమించండి అమ్మ అని సౌందర్య కాలు పట్టుకుంటాడు ఇంద్రుడు. తను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటాడు.. ఇప్పటికైనా మాతోపాటు వస్తావా శౌర్య అని సౌందర్య అడుగుతుంది.. నేను రాను నానమ్మ అమ్మ నాన్న వచ్చకే వస్తాను అంటుంది. నేను రాను అని శౌర్య పెద్దగా అరుస్తుంది. ఆ మాటలు విన్న దీప శౌర్య గొంతు గుర్తు పట్టి తన దగ్గరకి వెళ్తుంది. కార్తీక్ దీప పిల్లలు సౌందర్య అంతా కలుస్తారు. ఇంకా మనం విడిపోకూడదని కోరుకొంటారు. అప్పుడే మోనిత వచ్చి దీప నీ గన్ తో కలుస్తుంది.. నో అలా జరగకూడదు అంటూ ఆనందరావు కలలో నుంచి బయటకు వస్తాడు. ఇదంతా నిజమని అనుకున్న వీక్షకులు.. ప్చ్.. ఛా.. అంటూ నీరుగారిపోయారు.

దీప శౌర్య ను వెతకడానికి మళ్ళీ బయటకు వస్తుంది. కానీ తన ఆరోగ్యం బాగోలేదని రోజు రోజుకి నిరసించబోతుందని కార్తీక్ గమనిస్తాడు. ఎలాగైనా తనను ఒప్పించి హాస్పిటల్ కి తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్ చేయిస్తాడు. ఆ తర్వాత శౌర్య ను వెతకడానికి వెళ్దామని చెబుతాడు . మొత్తానికి హాస్పిటల్ కి తీసుకువెళ్లి బ్లడ్ టెస్ట్ లు అయితే చేయించాడు. ఆ రిపోర్ట్స్ లో దీపకి అంతకు ముందు ఉన్న జబ్బుతోపాటు గుండె సమస్యలు కూడా ఉన్నాయని తేలింది. ఈ విషయాన్ని ఇప్పుడు దీపక్ ఎలా చెప్పాలి నేను తన భర్తని అని చెబితే కానీ దీప హాస్పటల్లో ఉండడానికి ఒప్పుకోదు. లేదంటే తను హాస్పిటల్ లో జాయిన్ అవ్వదు ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు తనకి స్టంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది..

ఇవన్నీ జరగాలంటే దీప కి నేను కచ్చితంగా నిజం చెప్పి తీరాలి. అప్పుడే దీప వంట చేస్తాను అని వెళ్తుండగా .. నీకు పొగ పడదు అని ఎన్నిసార్లు చెప్పాలి. నిన్ను వంట చేయొద్దని చెబుతున్నానని కార్తీక్ అంటాడు. ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు ఎలా గుర్తున్నాయని నన్ను అడగద్దు. ఎందుకంటే నాకు గతం గుర్తొచ్చింది దీప.. ఇప్పుడు కాదు చాలా రోజులైంది నాకు గతం గుర్తుకు వచ్చి.. శౌర్య ను మనం కలిసిన తర్వాత నీకు నిజం చెబుదామని అనుకున్నాను. ఒకవేళ నాకు గతం గుర్తుకు వచ్చిందని మోనితకు తెలిస్తే నీకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఇన్ని రోజులు భయపడ్డాను. నాకు గతం ఎప్పుడో గుర్తొచ్చింది దీప అంటూ కార్తీక్ దీప ను దగ్గరకు తీసుకుంటాడు. ఇక నీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నీకు స్టంట్ వేయాల్సి వస్తుందని.. ఖచ్చితంగా హాస్పిటల్ లో చేరమని కార్తీక్ ఎలా ఒప్పిస్తాడో చూడాలి.