Karthika Deepam 24 Nov Episode : కలిసిపోయిన కార్తీక్ దీప కుటుంబం.. అంతలో మోనిత ఇంత పని చేసిందా.!?

Karthika Deepam 24 Nov Episode : దీప కి ఇల్లు ఇచ్చిన ఆమె వస్తుంది. డాక్టర్ కార్తీక్ మాకు ఆపరేషన్ చేశారు. ఆయన మీద ఉన్న గౌరవం తో ఆయన చనిపోయారని తెలిశాక ఇలా ఆయన ఫోటోకి దండ వేశాం అని చెబుతుంది. డాక్టర్ బాబు చనిపోలేదు బ్రతికే ఉన్నారు. నేను ఆయన భార్య అని దీప చెబుతుంది. నా పాప శౌర్య కు వెతకడానికి ఇక్కడికి వచ్చాను. నాకు హెల్ప్ చేయమని దీప అడుగుతుంది. తప్పకుండా హెల్ప్ చేస్తాను అని అంటుంది..

karthika-deepam-24-nov- today full episode
karthika-deepam-24-nov- today full episode

కార్తీక్ దుర్గ కి గతం గుర్తు వచ్చిందని చెబుతాడు. ఇన్నాళ్లు నువ్వు దీపకి సపోర్ట్ ఉన్నందుకు నాకు సంతోషం గా ఉంది అంటడు. దీప కు అండగా ఉండాల్సింది మీరు కదా కార్తీక్ సార్ అని అంటాడు దుర్గ. నేను దీప దగ్గరకి వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండి మోనిత కి శౌర్య గురించి ఏమైనా తెలుసు ఏమో కనుక్కొని నాకు చెప్పమని కార్తీక్ దుర్గ కి నిజం చెబుతాడు.

దీప సంగారెడ్డి మొత్తం శౌర్య కోసం వెతికింది. శౌర్య ఫోటోను చూపిస్తూ ఆ ఊరంతా వెతుకుతుంది. ఇక శౌర్య నాకు ఎప్పటికీ దొరకదు అని దీప దీలా పడిపోయి కూర్చుని ఉంటుంది. అప్పుడే గాలికి ఎగురుకుంటూ వచ్చి సౌర్య అంటించిన పేపర్ కనిపిస్తుంది. అమ్మానాన్న ఎక్కడున్నా రావాలి అంటూ తన ఫోటో ఉన్న పేపర్ దీప దగ్గరకు వస్తుంది . ఆ పేపర్ ని చూసి ఏడుస్తూ నేను నీకోసం వెతుకుతున్నట్టే.. నువ్వు మా కోసం వెతుకుతున్నావా శౌర్య.. నువ్వు ఎక్కడున్నా కచ్చితంగా నేను వెతికి పట్టుకుంటాను అని ఆ పేపర్ మీద ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. దీప కి అతను అడ్రెస్స్ చెబుతాడు. దీప ఆ ఊరు మనిషిని తీసుకుని అతని దగ్గరకు వెళ్తుంది.

నా బిడ్డ శౌర్య ఉంది ఇతని దగ్గర కాదు. ఇంద్రుడు దగ్గర అని అంటుంది. ఆ ఇంద్రుడు కి నేను ఏం అన్యాయం చేశాను. నా బిడ్డను నాకు కాకుండా దూరం చేస్తున్నాడు అని దీప ఏడుస్తుంది. ఇంద్రుడు నన్ను తప్పు దారి పట్టించడానికి ఇలా వేరే అతని ఫోన్ వేశాడని అంటుంది. శౌర్య ఆచూకీ తెలియక దీప కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు ఉన్నాయి. దీప దగ్గరకి కార్తీక్ వస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరు కలిసి శౌర్య ను వెతుకుతరు. అప్పుడే సౌందర్య హీమ వాళ్ళను తీసుకుని శౌర్య దగ్గరకు వస్తారు. శౌర్య మాతో పాటు రమ్మని వాళ్ళ నానమ్మ అంటుంది. నేను రాను అని శౌర్య పెద్దగా అరుస్తుంది. ఆ మాటలు విన్న దీప శౌర్య గొంతు గుర్తు పట్టి తన దగ్గరకి వెళ్తుంది. కార్తీక్ దీప పిల్లలు సౌందర్య అంతా కలుస్తారు. ఇంకా మనం విడిపోకూడదని కోరుకొంటారు. అప్పుడే మోనిత వచ్చి దీప నీ గన్ తో కలుస్తుంది.