Karthika Deepam 21 Nov Episode : మోనిత మీద ఒట్టేసి కార్తీక్ కి శివ నిజం చెప్పాడా.!? శౌర్య సూపర్ ప్లాన్..!

Karthika Deepam 21 Nov Episode :  మోనిత ఇంత డబ్బులు ఎందుకు శివకి ఇస్తున్నవు. ఎవరైనా ఏదైనా తప్పుడు పని చేసేటప్పుడు మాత్రమే ఇలా ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు నువ్వు శివకు డబ్బులు ఎందుకు ఇస్తున్నావో చెప్పమని కార్తీక్ మోనిత నిలదీస్తాడు.. అవును తప్పుడు పని చేయడానికి శివకి డబ్బులు ఇస్తున్నాను.. ఆ వంటలక్కని చంపేయమని వీడికి సుపారి ఇస్తున్నాను అని మోనిత చెబుతుంది. ఆ మాటలకు కార్తీక్ షాక్ అవుతూ మోనిత వైపు సీరియస్ గా చూస్తాడు.. ఈ సమాధానమేగా కార్తీక్ నీకు కావాల్సింది అని మోనిత అంటుంది.

Advertisement
Karthika Deepam 21 Nov today full Episode
Karthika Deepam 21 Nov today full Episode

శివ నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్లి స్టాక్ వాళ్లకి అడ్వాన్స్ ఇవ్వమని చెబుతుంది. నిజంగానే అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తున్నావా శివ అని కార్తీక్ అడుగుతాడు. అవును సార్ అందుకే ఇచ్చారు మేడం అని శివ చెబుతాడు. మీ మేడం మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. ఇలాంటి కంత్రి వాళ్ళు ఉంటే నాకేంటి లేకపోతే నాకేంటి.. నాకు ఇప్పుడు లక్ష రూపాయలు పోతాయి. మేడం ఏమైపోతే నాకెందుకు అని శివ మనసులో అనుకుని.. నిజంగానే మేడం అడ్వాన్స్ ఇవ్వడానికి డబ్బులు ఇచ్చారు సార్ అని Karthika Deepam 21 Nov today full Episode. మోనిత కూడా షాక్ అవుతుంది. శివ అబద్ధం చెప్పినందుకు బాధపడాలో.. కార్తీక్ కి ఈ విషయం తెలియకుండా చేసినందుకు సంతోషించాలో తెలియక అయోమయంలో ఉంటుంది మోనిత.

Advertisement

కాసేపటి తరువాత కార్తీక్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు. వారణాసి కోమాలో నుంచి బయటకు వస్తే కానీ శౌర్య ఎక్కడ ఉందో పూర్తి వివరాలు తెలియవు. వారణాసి కోమాలో నుంచి బయటకు వస్తే దీపకు నేను నిజం చెప్పడానికి అవకాశం ఉంటుంది అని కార్తీక్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు. అంతలో హాస్పటల్ నుంచి కాల్ వస్తుంది. డాక్టర్ గారు మీరు ఎక్కడున్నారు.. ఆపరేషన్ కి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేశాను అని నర్స్ చెబుతుంది. దగ్గరలోనే ఉన్నా వస్తున్నాను అని చెబుతాడు కార్తీక్. అప్పుడే కార్ రివ్యూ మిర్రర్ లో నుంచి చూస్తే మోనిత తనను వెంబడిస్తున్నట్టు గమనిస్తాడు కార్తీక్. మోనిత నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్ళాలి. నేను కనుక హాస్పటల్ కి వెళ్లి సర్జరీ చేయడం మోనిత చూస్తే ఖచ్చితంగా నాకు గతం గుర్తు వచ్చింది అని అనుకుంటుంది. మోనిత నుంచి ఎలా తప్పించుకోవాలని కార్తీక్ అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే కార్తీక్ ఎక్కడ వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని మోనిత తనని ఫాలో అవుతూ ఉంటుంది.

శౌర్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్లి ఏవో పేపర్స్ జిరాక్స్ తీయిస్తుంది. ఇంద్రుడు చంద్రమ్మ దగ్గరికి వచ్చేసి ఎవరూ ఎక్కడ అని అడుగుతాడు బయట ఉంది అని చెబుతుంది. బయటలేదు శౌర్య ఇంట్లో నుంచి బయటకు కనిపించిందని.. తెలిసిన ఒక అతను ఈ సందు చివర దాటి వెళ్ళిందని చెప్పాడు. అయినా శౌర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు. చూస్తూ ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను అని ఇంద్రుడు అంటాడు. కాసేపటి తర్వాత శౌర్య ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని ఇంద్రుడు అడుగుతాడు. జిరాక్స్ పేపర్లు తీయించడానికి వెళ్ళాను బాబాయ్ అని శౌర్య చెబుతుంది.. ఆ పేపర్స్ లో ఏముంది అని ఓపెన్ చేసి చూడగానే.. శౌర్య ఫోటో కింద అమ్మానాన్నలు ఎక్కడ ఉన్నా త్వరగా రావాలి అని రాపించి ఉంటుంది. అది చూసి ఇంద్రుడు షాక్ అవుతాడు.

Advertisement