Karthika Deepam 11 oct Episode : మోనిత కార్తీక్ పిలుస్తున్నాడని దీపని పిలిపిస్తుంది.. ఏంటి దీపా కార్తీక్ కోసం వెతుకుతున్నావా.. నేనే నిన్ను ఇక్కడికి పిలిపించాను అని అంటుంది మోనిత.. ఏంటి రాజ్యలక్ష్మి అండ చూసుకొని రెచ్చిపోతున్నావు.. ఇలాంటి రాజ్యలక్ష్మి 100 మంది వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు.. కార్తీక్ ను నా నుంచి దూరం చేయాలి అని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను అని మోనిత అంది.. ఆ విషయం గుర్తుంచుకో అని మౌనిత దీప కి వార్నింగ్ ఇస్తుంది.. ఆ మాటలను కార్తీక్ వింటాడు..
అప్పుడే మోనిత అక్కడి నుంచి వెళ్తుండగా.. ఆగు మోనిత అని కార్తీక్ అంటాడు.. దీపకి ఏమని వార్నింగ్ ఇచ్చావో చెప్పు మౌనిత అని కార్తీక్ అడుగుతాడు.. నాకు కార్తీక్ జోలికి వస్తే ఊరుకోను అని చెప్పాను అంతే అని అంటుంది .. దీపను ప్రాణాలు తీసేస్తానని అన్నావు. అంత ఈజీగా ఆ మాట అన్నావు. అంటే అంతకుముందు ఎన్ని ప్రాణాలు తీసేసావ్ అని కార్తీక్ మోనితను నిలదీస్తాడు.. లేకపోతే మీ ఇద్దరి చేతులు కలిపి సాగనంపమంటావా.. నాకు అడ్డొస్తే నిజంగానే ప్రాణాలు తీస్తాను. ఒకసారి కాదు రెండుసార్లు కాదు వంద సార్లు చెప్పాను.. నిజం చెప్తున్నాను కార్తీక్ ఈసారి అది నీ వెంట పడిందో ప్రాణాలు తీస్తాను అని మోనిత అంటుంది. నోరు ముయ్.. నువ్వు చెప్పేది అంతా అబద్దం..!
ఇన్నాళ్లు ఓపిక పట్టా కార్తీక్.. ఇక నావల్ల కాదు నీకు ఆ దీపమీద ఏదో జాలి ఉంటే వెళ్లి చెప్పు.. మా మోనిత మంచిది కాదు నా వెంట పడితే నీ ప్రాణాలు తీస్తుంది అని చెప్పు కార్తీక్ అని మోనిత వెళ్తుంది.. శౌర్య వాళ్ళ బాబాయి తో కలిసి మీరు చెప్పిన ఆవిడ కనిపించిందా అని అడుగుతుంది.. అవును శౌర్య ఆవిడ మనకు ఆ రోజు వాటర్ బాటిల్ ఇచ్చి అమ్మ ఇచ్చింది అని చెప్పమంది.. అయితే ఆమ్మ ఇక్కడే ఉండి ఉంటుంది పిన్ని.. ముగ్గురం మూడు దిక్కులు వెళ్లి వేతుకుందం అని అంటుంది శౌర్య. సరే అని శౌర్య శివను కలుస్తుంది. కార్తీక్ దగ్గరకు తీసుకు వెళ్దాం అనుకునే లోగ మౌనిత ఫోన్ చేసి రేయ్ నువ్వు ఏం చేస్తున్నావ్ రా మర్యాదగా ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టి నువ్వు పక్కకు వెళ్ళిపో లేదంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని మౌనిత శివకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది పాప పాప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా మేడం నన్ను అర్జెంటుగా రమ్మని పిలుస్తుంది నేను ఇంకోసారి నీకు మా సార్ ని చూపిస్తానని శివ అంటాడు..
నిజం నా చుట్టూనే ఉందా నేనే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాను అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు దీపకి ఈ ఊరికి నాకు ఏ సంబంధం లేదు. అలాగే మౌనిత కూడా ఈ ఊరితో ఏ సంబంధం లేదు అని ఆ పెద్దావిడ చెప్పింది. పైగా దీపనే ఆమె సపోర్ట్ చేసింది . మొన్న దీప వేసిన నాటకం వల్లే నాకు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయాను అంటే.. నా చుట్టూనే ఏదో జరుగుతుంది అని కార్తీక్ ఆలోచనలో పడతాడు..
రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ ఏదో ఆలోచనలో ఉంటాడు.. అప్పుడే రాజ్యలక్ష్మి కార్తీక్ దగ్గరకు వచ్చి మౌనిత, దీపా ఇద్దరూ నాకు పరిచయం లేని వారే.. దీప ను మాత్రమే నమ్ము అని ఆమె చెబుతుంది రాజ్యలక్ష్మి చెబుతుంది.. అప్పుడే వారణాసి కార్తీక్ దగ్గరకు వచ్చి మీరు బ్రతికే ఉన్నారా అని అంటారు . ఈ నాటకాలు అని అంటాడు. అప్పుడే ఈ ఫోటో చూసి మీరు ఆ విషయం చెప్పండి అని.. కార్తీక్ దీప కలిసి ఉన్న ఫోటోని కార్తీక్ కి వారణాసి చూపిస్తాడు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.