Karthika Deepam: సౌర్యకి సాయం చేసిన కార్తీక్.. అక్కచెల్లెలు అయినా దీప, మోనిత..! 

మోనిత శివ ను ఆ వంటలక్క ఇంట్లో ఉందేమో చూసి రమ్మని అడుగుతుంది.. దీపక్క లేదు అని శివ అంటాడు.. వెంటనే శివ చంప చెల్లుమనిపిస్తుంది మోనిత.. వరుసలు పెట్టి పిలిచావంటే ఇలాగే చంపలు వాయిస్తారు అని మోనిత అంది.. మీరంతా వంటలక్క అంటారు కదా అందుకే నేను దీపక్క అని పిలిచాను అని శివ అంటాడు.. నా దగ్గర పని చేస్తూ దానిని వరుసలు పెట్టి పిలిచావంటే ఇలాగే చంపలు వాయిస్తాను అని మోనిత శివకు వార్నింగ్ ఇస్తుంది..

Karthika Deepam 10 September Today Full Episode
Karthika Deepam 10 September Today Full Episode

మోనిత శివ ను తీసుకుని దీప ఇంటికి వెళ్తుంది.. ఏంటి దీపక్క ఏం చేస్తున్నావు అని మోనిత అడుగుతుంది.. శివ మనసులో మేడం ఇదంకా నేను దీపక్క అంటే కొట్టింది.. ఇప్పుడే తనే పిలుస్తుంది ఏంటి అని ఆలోచనలో పడతాడు.. ఏంటి అని దీపక్క ఇంటికి ఈ మామిడి తోరణాలు అని అడుగుతుంది.. నువ్వు మా ఇంటికి ఏ పని లేకుండా ఇక్కడికి రావు కదా.. ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది దీప.. అదే మా ఆయన డాక్టర్ బాబు రేపు మా ఇంట్లో పూజకు రమ్మని పిలవమని చెప్పాడు.. అందుకే వచ్చాను అని మోనిత అంటుంది.

డక్టర్ బాబు ను లాక్కోవాల్సిన ఆలోచన వస్తే ఎవరు బాగా చేస్తారో నాకు తెలుసు.. కానీ నాకు కావాల్సింది లాక్కోవడం కాదు.. నా డాక్టర్ బాబు నా దగ్గరికి రావడం.. ఎలా నా నుంచి దూరమయ్యారో.. అలాగే నా దగ్గరికి రావడం వస్తారు.. ప్రమాదం నుంచి ఆయన తప్పించుకునీ నీ దగ్గర ఉండడం.. ఒక రకంగా డాక్టర్ బాబు నీ దగ్గర ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉంది.. యాక్సిడెంట్ తర్వాత ఇంకా ఎక్కడైనా ఉంటే నా డాక్టర్ బాబు ఏమైపోయారో అనుకున్నా.. నువ్వు బాగా చూసుకున్నావ్.. ఇలాగే మేమిద్దరం కలిసి వరకు ఆయనను గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకొమని దీప మోనిత తో అంటుంది.. పగటి కలలు కంటున్నట్లున్నావు దీపక్క అని మౌనిత అంటుంది.. అలాగే కలలు కంటూ ఉండు అని అనగానే.. నేను వచ్చినా రాకపోయినా దానికి తగ్గ ప్రతిఫలం నీకు తగ్గుతుంది.. నువ్వు ఎంతగా ఆలోచించినా నీకు అది అర్థం కాదు అని దీప అంటుంది.. నువ్వు అనుకున్నది మాత్రం జరగదు అని వెళ్ళు అని దీపా మోనిత తో ఉంటుంది..

మోనిత కార్తీక్ ని తీసుకొని బజారుకి వస్తుంది.. అప్పుడే కార్తీక్ సౌర్యని చూసి కార్ పక్కన సౌర్య ను చూస్తాడు.. మౌనిత ఆ పాపను చూసావా అని కార్తీక్ అడుగుతాడు.. తీరా చూస్తే అక్కడ సౌర్య ఉంటుంది .. కార్తీక్ సౌర్యని గుర్తుపట్టాడా అని మోనిత మనసులో అనుకుంటుంది.. పాపం కదా తను బొమ్మలు అమ్ముకుంటుంది. మనం తనకి ఎలాగైనా హెల్ప్ చేయాలని అంటాడు.. ఆ బొమ్మలు మొత్తం కొని తనకు హెల్ప్ చేయమని అంటాడు..