Karthika Deepam 1 September Today Episode : మోనిత ట్రాప్ లో పడి తనని ప్రేమిస్తున్న కార్తీక్.. వంటలక్క మాస్టర్ ప్లాన్..!!

Karthika Deepam 1 September Today Episode : కార్తీక్ దీప చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. మోనిత నిజంగా నా భార్య కాదా అని ఆలోచనలో పడతాడు.. ఎలాగైనా కార్తీక్ ను నా సొంతం చేసుకోవాలి అని మోనిత అనుకుంటుంది.. ఒకప్పుడు దీప నాకు అడ్డంగా ఉంది. ఇప్పుడు ఆ గతం లేదు ఆ దీప కూడా ఈ జీవితంలో లేదు.. ఇక నేను బలవంతంగా నైనా కార్తీక్ ప్రేమను పొందాలి అని మోనిత అనుకుంటుంది.. అప్పుడే మోనిత కావాలని తన చేతికి గాయం చేసుకుంటుంది.. కానీ కార్తీక్ ఏమీ రియాక్ట్ కాడు.. నీకు నిజంగా నీకు దెబ్బ తగిలిన నాకు ఎందుకో ఫీలింగ్స్ రావడం లేదు అని కార్తీక్ మోనిత మొహం మీదే చెబుతాడు..! నేను నీకు ఎంత చేశాను కూడా నీకు తెలియదు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా నీకోసం నేను ఏమి వదులుకున్నానో తెలుసా అని.. మోనిత ఆనంద్ గురించి చెబుతుంది.. కార్తీక్ మనకు ఒక బాబు ఉన్నాడు ..నీకు ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు వాడికి ఫుల్ గా ఫీవర్ వచ్చింది.

నీకు సేవలు చేసుకుంటూ వాడిని పట్టించుకోవడమే మర్చిపోయాను.. వాడిని ఇంట్లోనే ఉంచి నీకోసం హాస్పిటల్ చుట్టూ తిరిగాను.. అప్పుడు ఆనంద్ నాకు దూరమయ్యాడు. అసలు తను ఉన్నాడో లేడో కూడా నాకే తెలీదు అని మోనిత చెబుతుంది.. మనసులో సారీ ఆనంద్ నువ్వు బ్రతికే ఉన్నా కానీ నువ్వు లేవని మీ నాన్నతో అబద్ధం చెబుతున్నాను.. నన్ను క్షమించు అని మనసులో అనుకుంటుంది.. అవునా మోనిత అని కార్తీక్ అప్పటినుంచి మోనిత పై ప్రేమ చూపించడం మొదలుపెడతాడు.. ఎలాగైనా నీకోసం ఓ వంట మనిషిని తీసుకు వస్తాను.. నువ్వు ఇలా చేతికి గాయం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని కార్తీక్ తన మీద ప్రేమ చూపిస్తాడు.. ఇంకెందుకు నిన్న మన ఇంటికి వచ్చిన ఆ వంటలక్కనే పిలుద్దం.. తనే వంటలు చేస్తుంది అని కార్తీక్ అంటాడు..

Karthika Deepam 1 September Today Full Episode
Karthika Deepam 1 September Today Full Episode

తనని జీవితంలోనో ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు అని మోనిత చెబుతుంది.. దీప చేతి వంట తిన్న వాళ్ళ డాక్టర్ అన్నయ్య అమ్మ దీపా నీ వంటలు చాలా బాగున్నాయి.. మీ ఆయన అదృష్టవంతుడు అని అంటాడు.. ఆయనకు కూడా నా వంటలు అంటే చాలా ఇష్టం అన్నయ్య అని దీప చెబుతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం నీ చేతి వంట రుచి చూపించి నువ్వు తన దీపవేనని గుర్తు చేయమని చెబుతాడు.. ఇలా అయితే కచ్చితంగా మీ డాక్టర్ బాబు నిన్ను కచ్చితంగా గుర్తు పడతాడు అని వాళ్ళ అన్నయ్య చెబుతాడు.. ఇక అందుకోసమే దీప కార్తీక కోసం బిర్యాని చేస్తుంది.. ఆ వాసన పసికట్టి కార్తీక్ తననే వంట మనిషిగా పెట్టుకోవాలని తన దగ్గరకు వస్తారు.. ఇక ఏం జరుగుతుందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి..

Advertisement