Karthika Deepam 09 Nov Episode : కార్తీక్ కి గతం గుర్తొచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న మోనిత..! నువ్వు మారిపోయావ్ బాబయి అన్న శౌర్య..!

Karthika Deepam 09 Nov Episode :  ఏమైంది శౌర్య అని వాళ్ళ పిన్ని అడుగుతుంది.. ఇందాక గుడిలో పంతులుగారు మీ అమ్మానాన్నల పేర్లు చెప్పండి అని అనగానే.. మేము మీ అమ్మానాన్న పేర్లు చెప్పకుండా మా పేర్లు ఎందుకు చెప్పమని అనుకుంటున్నావు కదా శౌర్య అంటాడు.. ఎందుకు చెప్పాను అంటే నీ గురించి ఇక్కడ ఎవ్వరు తెలియకూడదు అని నీకు అవసరమని మీ తాతయ్య నాన్నమ్మ వాళ్ళు వెతుకుతున్నారు.. వాళ్లే ఈ గుడికి వచ్చి పంతులు గారిని అడిగారనుకో.. నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది కదా.. అందుకే చెప్పలేదు. మనం ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి పని ఇంద్రుడు అంటాడు. ఈమధ్య నువ్వు చాలా మారిపోయావు బాబాయ్ అని సౌర్య అంటుంది. అదేం లేదమ్మా కొత్త ఊరు కదా మీ బాబాయి కాస్త కంగారు పడుతున్నాడు అని చంద్రమ్మ కవర్ చేస్తుంది. అంతే అని ఇంద్రుడు కూడా శౌర్యకు నచ్చచెబుతాడు..

karthika-deepam-09-novtoday-full-episode
karthika-deepam-09-novtoday-full-episode

కార్తీక్, దీప వాళ్ళు ఎక్కడికి వెళ్లారని మోనిత దీప ఇంట్లో నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే దుర్గ వచ్చి మోనితను ఇంకా రెచ్చగొడతాడు. ఇప్పుడు కార్తీక్ దీప ఇద్దరు కలిసి వచ్చారు అనుకో వాళ్ళిద్దరూ ఒక్కటైయినట్టు కార్తీక్ బాబుకి గతం గుర్తించినట్టు.. కార్తిక్ కి గతం గుర్తుకు రాలేదు. వాళ్ళిద్దరూ విడివిడిగా వస్తారు చూస్తూ ఉండు అని దుర్గను రెట్టిస్తుంది మోనిత అప్పుడే కార్తీక్, దీప ఇద్దరూ కలిసి వస్తారు.. దీప మోనిత ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతుంది నువ్వే నా కార్తిక్ ని వదలకుండా జిడ్డులా పట్టుకున్నావు అని మోనిత అంటుంది. నువ్వు చెప్పు ఎవరు ఎవరిని పట్టుకున్నారు అని కార్తీక్ మోనితను నిలదీస్తాడు. కార్తికే గతం గుర్తుకు వచ్చిందా అని మోనిత ఆలోచనలో పడుతుంది. తన మనసు బాగోలేదు అని చెప్పింది కదా.. అయినా తనని చూస్తేనే అర్థమవుతుంది కదా తను ఏదో విషయం గురించి బాధపడుతుంద. పదా మనం ఇంటికి వెళ్దామని కార్తీక్ మోనితను అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్లిపోతాడు..

కార్తీక్ పై అనుమానం వచ్చిన మోనిత తన పరుసు చెక్ చేస్తూ ఉంటుంది ఏంటి మోనితనా పరిస్థితి తీసుకున్నావు అని కార్తీక్ అడుగుతాడు చేంజ్ కావాలి అందుకే చూస్తున్నాను అని మోనిత అంటుంది అది కాదులే నా మీద అనుమానం వచ్చింది నువ్వేదో అడగాలనుకుంటున్నావో అడుగు అని కార్తీక్ అంటాడు అవును కార్తీక్ నీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి అని మౌనిత అంటుంది నీ పర్స్ లో ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది అని కార్తీక్ అంటాడు.. అప్పుడే దుర్గా చైన్ బాగుందా మౌనిత అంటూ సీన్లోకి వస్తాడు. నాకు నువ్వే కదా కార్తిక్ కి డౌట్ వచ్చేలాగా మాట్లాడతాడు దుర్గ.. నా మెడలో చైన్ లేకపోతే ఏమైందిలే నువ్వు అభిమానించే వాళ్లకి చేనుకొని ఇచ్చావు కదా అని కార్తీక్ అంటాడు.. దుర్గతో నువ్వు ఎలా ఉంటున్నావో నాకు తెలియదు అని అనుకుంటున్నావా.. అంటూ మోనితను తక్కువ చేసి మాట్లాడతాడు. కార్తిక్ నిజంగా గతం గుర్తుకు వచ్చిందా అని మోనిత అనుకుంటుంది.

డాక్టర్ బాబు ఈరోజు కార్తీక పౌర్ణమి కదా గుడిలో 365 వత్తులు వెలిగించాలి అని అనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోనంటే నాకు ఒక 600 రూపాయలు కావాలి మీరు ఇస్తారా అని రేపు అడుగుతుంది. కార్తీక్ కంట నీళ్లు పెట్టుకుని తన పర్స్ లో ఉన్న డబ్బులు తీసి దీపకు ఇవ్వబోతుండగా.. అప్పుడే మోనిత వచ్చి ఆ డబ్బులను లాక్కుంటుంది. నువ్వు దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటుంది.. కార్తిక్ కి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. కార్తీక్ నిజంగా గతం గుర్తుకు వస్తే నా చెంప పగలగొడతాడు అని మోనిత అనుకొని.. కావాలని ఇంకా ఇంకా కార్తీక్ ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. కార్తీక్ నిజంగానే మోనిత చంప పగలగొడతాడు. కచ్చితంగా తనకి గతం గుర్తుకు వచ్చిందని మోనిత ఫిక్స్ అవుతుంది..