Karthika Deepam 06 Oct Today Episode : దీప అర్ధరాత్రి వచ్చి డాక్టర్ బాబు అంటూ తలుపులు పెడుతుంది. మౌనిత కార్తీక్ ఇద్దరు వెళ్లి తలుపులు తీస్తారు. ఇంట్లోకి వచ్చిన దీప ఇల్లంతా వెతుకుతూ ఏంటి మీ ఇల్లు ఎంత బోసిగా ఉంది అని అడుగుతుంది. సెలబ్రేషన్స్ ఏమీ లేవ అని అడుగుతుంది.. ఏం పండగా అని మోనిత అడుగుతుంది.. అసలు ఏం పండుగ దసరా, దీపావళి, సంక్రాంతి నా అని మోనిత విసుక్కుంటూ అడుగుతుంది.. నా జీవితంలోనే పెద్ద పండుగ.. మీ పుట్టిన రోజు పండుగ దీప అంటుంది.. అయ్యో మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఏమీ లేవా.. అయితే మా ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుందాం రండి అని దీప తన ఇంటికి తీసుకు తీసుకువెళ్తుంది.. దీప ఆనందంగా కార్తీక్ బర్త్డేని సెలబ్రేట్ చేసి తనకు కేక్ తినిపిస్తుంది.. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ పుట్టినరోజుకి ఇదే గిఫ్ట్ మీకు ఇచ్చాను అని ఒక పర్సు కూడా ఇస్తుంది..
అవును డాక్టర్ బాబు కావాలంటే ఈ పరుసు మీద డేట్ కూడా ఉంటుంది చూడండి అని దీప చూపిస్తుంది.. కార్తీక్ కదా మనం ఎక్కడి నుంచి వెళ్లిపోదామని మౌనిత అంటుంది.. నువ్వు ఎలాగూ సెలబ్రేట్ చేయవు చేసే వాళ్ళని కూడా చేయనివ్వ అని అంటుంది.. డాక్టర్ బాబు రేపు ఉదయం రెడీ అయి ఉండండి చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి అని దీప చెబుతుంది.. కార్తీక్ సరే అని అంటాడు.. మర్చిపోకండి డాక్టర్ బాబు డాక్టర్ అమ్మ మీరే దగ్గరుండి సార్ ని తీసుకురావాలి అని అంటుంది దీప.. కానీ అప్పటికే మోనిత కార్తీక్ ను బయటికి తీసుకు వెళ్తుంది.. మోనిత ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకు వెళుతున్నావు.. అసలు అయినా అంత త్వరగా ఎలా మర్చిపోయావు మోనిత.. నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకు వెళుతున్నావు మౌనిత అని కార్తీక్ మౌనితను అడుగుతాడు.. వంటలు అక్కను నన్ను దూరం చేయడానికి ఎక్కడికైనా తీసుకెళ్తున్నావని కార్తీక్ అడుగుతాడు లేదంటే దుర్గకు నీకు అడ్డు వస్తున్నాను అని నన్ను ఏమైనా చేయడానికా.. ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా అని అడుగుతాడు..

ఈ మధ్య ఎక్కడ చూసినా అలాంటి వార్తలే.. తన మా ప్రేమకు అడ్డుస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్త ను కడతేర్చిన భార్య.. మీరిద్దరూ కలిసి నన్ను హు హు చంపేస్తారా అని కార్తీక్ మోనిత ను అడుగుతాడు.. కార్తీక్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని మోనిత అంటుంది.. ఆ దుర్గ ఎవరో నాకు తెలియదు వాడు.. ఉన్నాడో పోయాడో కూడా నాకు తెలియదు అని మోనిత అంటుంది.. అసలు వాళ్ల నుంచి ప్రశాంతంగా ఉండాలని నేను నిన్ను తీసుకుని ఇలా బయటకు వచ్చాను అని మోనిత చెబుతుంది.. అయితే వేరే ప్లాన్ ఏమీ లేదు అని అంటావు అంతేనా అని కార్తీక్ అడుగుతాడు.. కార్తీక్ నీకు దండం పెడతాను వెళ్దాం పదా అంటుంది.. అయినా పెళ్ళాం పగ పడితే తప్పించుకోవడం చాలా కష్టం ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా దొరికిపోతాం అని కార్తీక్ అంటాడు నువ్వు ఏంటి కార్తీక్ ఎంత దారుణంగా ఉన్నావు నిన్ను భరించడం చాలా కష్టం నీ ప్రేమ కోసం అందర్నీ కాదని అనుకున్నాను.. నాకు పది నిమిషాలే ఇంత టార్చర్ ఉంటే దీప పదేళ్లు ఆ అనుమానాన్ని ఆ టార్చర్ ని ఎలా భరించిందో అని మోనిత మనసులో అనుకుంటుంది..